Bigg boss Telugu 5: కెప్టెన్సీ టాస్క్ లో రెచ్చిపోయిన రవి.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సన్నీ.. అదే ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి కాగా ఆరుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో వారానికి సంబంధించి ఎవరు కెప్టెన్ అవ్వాలి అనే విషయం మీద కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఆసక్తికరంగా జరగబోతోంది. ఈ రోజు కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ జరగబోతుండగా దానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఆ వివరాల్లోకి వెళితే

ఏడవ వారం టాస్క్ లు

ఏడవ వారం టాస్క్ లు

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఇప్పటివరకు మునుపెన్నడూ లేని విధంగా ఏడవ వారం టాస్క్ లు డిజైన్ చేశారు. ఎప్పటిలా కాకుండా విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ టాస్కులను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్స్ కూడా కొత్తగా సాగగా నామినేషన్స్ లో ఒకరి మీద ఒకరు ఆసక్తికరంగా గొడవలు పడుతూ నామినేట్ చేశారు. బిగ్ బాస్ కెప్టెన్ అయ్యే అవకాశం ఐదుగురు హౌస్ సభ్యులకు దక్కగా 'బంగారు కోడిపెట్ట' టాస్క్ అయితే బాగా హైలైట్ అయింది.

ఒక రేంజ్ లో గొడవ

ఒక రేంజ్ లో గొడవ

ముఖ్యంగా ప్రియ- సన్నీల మధ్య జరిగిన గొడవ ఒక రేంజ్ లో హైలైట్ అయింది. ఒకర్నొకరు దూషించుకుంటూ ఫిజికల్ ఎటాకింగ్‌కి దిగారు. లోబో స్పెషల్ పవర్ తో ఈ టాస్క్‌లో ఐదుగురు పోటీదారులు కెప్టెన్ పోటీదారులుగా నిలిచారు. శ్రీ రామ్ ప్లేస్ లో కాజల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ దెబ్బతో మానస్, విశ్వ, సన్నీ, యాంకర్ రవి, కాజల్‌లు కెప్టెన్ పోటీదారులు కావడంతో వీరిలో ఒకరు ఈవారం కెప్టెన్ కాబోతున్నారు.

బెలూన్ టాస్క్

బెలూన్ టాస్క్

కాజల్ కంటే శ్రీరామ చంద్ర ఎక్కువ గుడ్లు సంపాదించగా లోబో తనకి లభించిన స్పెషల్ పవర్ ద్వారా శ్రీరామ్‌ని వెనక్కినెట్టి కాజల్‌కి ఆ అవకాశం ఇచ్చాడు. అయితే తాజా ప్రోమో ప్రకారం ఐదుగురు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో ఉండగా వారికి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి దాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాజల్ రవి బెలూన్ పగలకొట్టడానికి ప్రయత్నించింది కానీ వర్కౌట్ కాలేదు.

సన్నీ కెప్టెన్, కాజల్ రేషన్ మేనేజర్

సన్నీ కెప్టెన్, కాజల్ రేషన్ మేనేజర్

కానీ రవి తెలివిగా మానస్ బెలూన్ పగలగొట్టి అతనిని పోటీ నుంచి తప్పించాడు. ఇక కాజల్ బెలూన్ కూడా పగల కొట్టడంతో ఆమె ప్రియను పట్టుకుని ఏడ్చేసింది. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే టాస్క్‌లో సన్నీ కెప్టెన్‌గా అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. రేషన్ మేనేజర్‌ ని నిర్ణయించుకునే పవర్ తనకే ఉండటంతో కాజల్‌ని రేషన్ మేనేజర్‌గా చేసుకున్నట్టు కూడా లీక్‌లు బయటకొచ్చాయి.

Recommended Video

Bigg Boss Telugu 5 : డేంజర్ జోన్‌లో Priya, Siri, Anee | VJ Sunny VS Priya || Filmibeat Telugu
ప్రియ ఏం చేస్తుందో?

ప్రియ ఏం చేస్తుందో?

అయితే మొన్నటి ఎపిసోడ్ దాకా సన్నీతో గొడవ పడిన ప్రియ నిన్నటి ఎపిసోడ్‌లో ప్రియ సన్నీతో క్లోజ్ అవుతున్నట్టుగానే కనిపించింది. అతని ప్లేట్‌లో తినడం.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవచ్చా అని అడగడం సహా సన్నీ కెప్టెన్ అయితే నేను రేషన్ మేనేజర్ అవుతా అని కామెడీ చేయడం చూస్తే సన్నీ తో ప్రియ గొడవలు ముగింపు పలికి కాస్త మంచిగా ఉండడానికి చూస్తోంది. మరి ప్రియ సన్నీ ఎపిసోడ్ ఎండాకా వెళ్తుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X