Bigg Boss Telugu 5 నుంచి షాకింగ్ న్యూస్.. ఆ కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. ఫ్యాన్స్ దెబ్బతోనే?

తెలుగు యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి వివిధ కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. రవి అన్యాయమైన ఎలిమినేషన్‌పై అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రవి అభిమానులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే రవి బిగ్ బాస్ రీ ఎంట్రీ గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

గేటు ముందు ఆందోళన

గేటు ముందు ఆందోళన

బిగ్ బాస్ 5 తెలుగు నుంచి ఎవరూ ఊహించని యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో..ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ గేటు ముందు ఆందోళన చేశారు. కావాలనే రవిని ఇంటి నుంచి బయటకు పంపేశారని..అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కు ప్రియాంక సింగ్, కాజల్ కంటే తక్కువ ఓట్లు ఎలా పడతాయి..మీరు ఓట్ల లెక్క చూపించండి..అప్పుడే మేము నమ్ముతాము అంటూ రచ్చ చేశారు.

రవిని కావాలనే ఎలిమినేట్

రవిని కావాలనే ఎలిమినేట్

అయితే ఆ తరువాత యాంకర్ రవిని కావాలనే ఎలిమినేట్ చేశారని, దానికి కారణం ఆయన భారీ పారితోషికం అని కూడా ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ 5 తెలుగు కంటెస్టెంట్స్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వాళ్లలో రవి కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన 85 రోజులు ఇంట్లో ఉన్నాడు. దానికిగాను ఏకంగా 90 లక్షల వరకు పారితోషికం అందుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అందుకేనా?

అందుకేనా?

మరో 20 రోజుల పాటు కనుక ఆయన ఇంట్లో ఉంటే కచ్చితంగా 25 లక్షల వరకు పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అంటే బిగ్ బాస్ విన్నర్ కంటే కూడా రవి అత్యధిక పారితోషికం అందుకున్నట్లు అవుతుందని, ఇప్పటికే ఆయన ఖాతాలోకి విన్నర్ కంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది, అయినా ఆయన నుంచి ఆశించిన కంటెంట్ అయితే రావడం లేదు అని భావించి యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

రవిని మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి

రవిని మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి

అయితే రవి అభిమానులు సహా న్యూట్రల్ బిగ్ బాస్ ప్రేక్షకులు అతన్ని మళ్లీ షోలోకి తీసుకురావాలని స్టార్ మా ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌తో పోలిస్తే రవి అత్యంత అర్హత కలిగిన కంటెస్టెంట్ అని నిర్వాహకులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. రవిని మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి తీసుకురావాలని షో నిర్వాహకులను నెటిజన్లు కోరుతున్నారు.

రవిని మళ్లీ షోకి

రవిని మళ్లీ షోకి

ఈ క్రమంలోనే . యాంకర్ రవిని మళ్లీ షోకి తీసుకురావాలని స్టార్ మా యోచిస్తోందని, రవి అభిమానులు తమపై చాలా ఒత్తిడి తెస్తున్నారని వెల్లువై భావిస్తున్నారని అంటున్నారు. ఈ వారాంతంలో రవి ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే, మేకర్స్ నుండి ఈ వార్త ఇంకా ధృవీకరించబడలేదు. దీనిపై రవి కూడా మాట్లాడలేదు. సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆనవాయితీ.

Recommended Video

Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
 హౌస్ లోకి మళ్ళీ వస్తాడా?

హౌస్ లోకి మళ్ళీ వస్తాడా?

కానీ మిగతా వాళ్లతో పోలిస్తే రవి మాత్రం బయట పెద్దగా ఇంటెరివ్యూ లు ఇవ్వలేదు. మరి అందుకోసమే రవి లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడా? నిజంగానే ఆయన నిజంగానే హౌస్ లోకి మళ్ళీ వస్తాడా? మరి తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X