Bigg boss 5: వెక్కిలి చేష్టలతో రెచ్చగొట్టిన RJ కాజల్.. నేను విలన్ అవుతాను అంటూ రవి వార్నింగ్

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు సెలబ్రిటీలు ఎన్నో ఆలోచనతో గేమ్ ఆడాలని అనుకుంటారు. అయితే పరిస్థితులు మాత్రం వారిని ఒక్కసారిగా మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బయట ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా హౌస్ లోకి వస్తే మాత్రం ఒక్కసారిగా ఇద్దరి మధ్యలో గొడవలు కూడా వస్తూ ఉంటాయి. మొదట్లో హౌస్ లో ఫ్రెండ్స్ కూడా చివరికి వచ్చేసరికి వెన్నుపోటు కూడా పొడుస్తూ ఉంటారు. ఇక ఎంత తెలివిగా మాట్లాడినా కూడా ఎంత గట్టిగా మాట్లాడారు అనేది బిగ్ బాస్ హౌస్ లో చాలా ముఖ్యమైనది. అయితే RJ కాజల్ అయితే ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా క్షణాల్లో మాటలు మారుస్తూ ఉండటం విశేషం. ఇక గతంలో చాలా మంది హౌస్ మెట్స్ తో కోట్లటలు పెట్టుకుంది. ఆమె ఇటీవల మరోసారి రవితో కూడా గొడవకు దిగినట్లు ప్రోమో లో అర్థమవుతోంది.

అప్పటి నుంచి గొడవలు

అప్పటి నుంచి గొడవలు

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు కాజల్ ఎక్కువగా రవి తో డే మంచి స్నేహాన్ని కొనసాగించింది. ఇన్ని రోజులు ఇద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ గా కొనసాగుతూ వచ్చారు. అయితే నామినేషన కు వచ్చేసరికి కొన్నిసార్లు యాంకర్ రవి రివర్స్ అవ్వక తప్పలేదు. మూడో వారంలో కాజల్ నామినేట్ చేసినప్పుడు మెడపై కొట్టిందనే ఫిజికల్ గా అది చాలా నొప్పిని కూడా కలిగించిందని రవి నామినేట్ చేయడం కాజల్ కు ఏమాత్రం నచ్చలేదు. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు మొదలవుతూనే ఉన్నాయి.

రెచ్చగొట్టిన కాజల్

రెచ్చగొట్టిన కాజల్

కాజల్ మెల్లగా షణ్ముఖ్ జస్వంత్ గ్యాంగ్ తో కూడా చాలా క్లోజ్ గా కొనసాగుతూ వస్తోంది. ఇక ముందుగానే షన్ను , రవిపై కోపంతోనే ఉన్నాడు. ఇక ఈ సారి వారితో కలిసి కాజల్ కిడా టార్గెట్ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కావాలని రెచ్చగొట్టాలని డిసైడ్ అయ్యింది. రోబో రవి వాష్రూమ్ నుంచి డైరెక్ట్ గా డిన్నర్ లోకి రాగానే గొడవ జరిగిందని కాజల్ కావాలని రవి ముందు వెకిలి చేష్టలతో నవ్వుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.

ఎందుకు రెచ్చగొడుతున్నావు

ఎందుకు రెచ్చగొడుతున్నావు

ఇక ఆ తర్వాత కాజల్ చేసిన పనికి శ్రీ రామచంద్ర కూడా అప్సెట్ అయ్యాడు. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదని అనడం తో నేను కావాలని చేయలేదు కానీ కేవలం ఫన్ కోసమే అలా చేశానని చెబుతుంది. తరువాత రవి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కాజల్ ఎందుకు రెచ్చగొడుతున్నావు అడిగాడు. అందుకు కాజల్ తాను అలా ఏమీ అనుకోలేదు అది కేవలం సరదాగా అనిపించి జోక్ చేశాను అని కాస్త సీరియస్ గానే సమాధానం చెబుతుంది. కాజల్ మాట తీరుతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన రవి ఎదుటివారి భావాలను కూడా అర్థం చేసుకోవాలని అలా రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని కౌంటర్ ఇస్తాడు.

తెలియకుండా ఎందుకు వస్తారో..

తెలియకుండా ఎందుకు వస్తారో..


ఏదైనా తెలుసుకోనీ మాట్లాడాలని అది కూడా తెలియకుండా ఇక్కడికి ఎందుకు వస్తారు అంటూ మరోసారి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. అందుకు కాజల్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా ఎందుకు అంటున్నావు రవి అని అడుగుతుంది. సరదగా మాత్రమే అన్నాను అంటూ సమాధానం చెప్పినప్పటికీ అవతల వారికి అది ఫన్ కాదు అని రవి మరో కౌంటర్ ఇచ్చాడు. నా ఇంటెన్షన్ అయితే అసలు రెచ్చగొట్టడమే కాదు అని కాజల్ కూడా గట్టి వాదిస్తుంది.

Recommended Video

#BiggBossTelugu ఇతను Eliminate అవడం పక్కా.. టాప్ 5 వీరే!! || Filmibeat Telugu

ఫైట్ చేయి.. కానీ మాటలు మార్చకు

ఇక రెచ్చగొట్టడం తనకు కూడా వస్తుంది అని రవి చెప్పిన తర్వాత అందుకు కాజల్ స్టాప్ అని అడగొచ్చు కదా అని అంటుంది. ఆ మాటలకు తట్టుకోలేక రవి అప్పుడు నేను విలన్ అవుతాను అని మరొక కౌంటర్ ఇస్తాడు. ఇక రోజు రవి లోబో బాత్రూం పనుల్లోనే ఉన్నారు కిచెన్ లోకి రావడంలేదు అన్నవా లేదా అని రవి ప్రశ్నించడంతో కాజల్ మళ్లీ మాట మారుస్తుంది. నేను అలా అనలేదు అని చెప్పగానే డైనింగ్ టేబుల్ మీద రవి గట్టిగా కొడతాడు. మళ్లీ ఫేస్ మీద మాట మారుస్తోంది అని చెబుతూ ఫైట్ చేయి కానీ వెంటనే మాటలు మార్చుకు అని రవి మరొకసారి సీరియస్ హెచ్చరికలు చేస్తాడు. మరి ఈరోజు వీరి చర్చ ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి.

ఐదోవారం ఎలిమినేషన్ కోసం తొమ్మిది మంది

ఐదోవారం ఎలిమినేషన్ కోసం తొమ్మిది మంది

ఇక ఇదిలా ఉంటే.. ఐదోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సీక్రెట్ రూమ్‌లో సాగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొంటూ నామినేట్ చేసుకొన్నారు. ఇంటిలో ఎక్కువ మంది షణ్ముఖ్ జస్వంత్‌ను నామినేట్ చేశారు. దాదాపు ఎనిమిది మగ సభ్యులు నామినేట్ చేయడం గమనార్హం. షణ్ముఖ్, వీజే సన్నీ, జస్వంత్, యాంకర్ రవి, మానస్, విశ్వ, హమీదా ఖాతూన్, లోబో, శైలజా ప్రియ నామినేట్ అయ్యారు. ఈ వారం కూడా టాప్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఈ సారి ఎలిమినేషన్ మరింత ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X