నా పెళ్లాంకు కూడా ఇంతలా చెప్పుకోలేదు.. ఆర్జే కాజల్‌ను కసురుకొన్న యాంకర్ రవి
బిగ్‌బాస్ ఇంటిలో ఏడోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల ప్రక్రియ అందరిలోను విభేదాలు సృష్టించాయి. సోఫా మీద టవల్ ఆరేస్తాడని యాంకర్ రవిని ప్రియాంక చేసిన నామినేషన్ వేయగా దానిని సంచాలకుడు వీజే సన్నీ ఆమోదించడం, అదే సమయంలో కాజల్‌ను ప్రియాంక నామినేట్ చేయగా దానిని అంగీకరించకపోవడంపై రచ్చ జరిగింది. ఆ విషయంపై కాజల్, యాంకర్ రవి మధ్య ఘాటైన సంభాషణ జరిగింది. వారద్దరూ మాట్లాడుకొంటూ..
Photo Courtesy: Star మా and Disney+Hotstar

వీజే సన్నీ నిర్ణయంపై రవి
తనను నామినేట్ చేయడంపై వీజే సన్నీని ఉద్దేశిస్తూ.. వీడు తప్పు చేసిండు.. పైగా ఒప్పుకోవడం లేదు అంటూ యాంకర్ రవి తన సంభాషణను మొదలుపెట్టాడు. దాంతో కాజల్ స్పందిస్తూ.. వాడు (వీజే సన్నీ) తప్పు చేయలేదు రవి. నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక ఫ్రెండ్‌ను సేవ్ చేయడానికి మరో ఫ్రెండ్‌ను నామినేట్ చేశాడు అని కాజల్ తన వాదనను వినిపించింది. అయితే కాజల్ వాదనను రవి కొట్టిపడేశాడు.

శ్వేతా వర్మ టాపిక్ ఎలా తీస్తాడు అంటూ
కాజల్ వాదనను పక్కన పెడుతూ వీజే సన్నీ నామినేషన్ సందర్భంగా శ్వేత టాపిక తీశాడు. ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత నామినేషన్ సమయంలో ఆమె ఉంటే నిన్ను నామినేట్ చేసేది.. ఇప్పుడు ఆమె లేదు కాబట్టి నిన్ను చేస్తాను అంటే.. అది కరెక్ట్ కాదు అని యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. నామినేషన్ సందర్భంగా శ్వేతా వర్మ టాపిక్ తీయడం సరికాదు అంటూ యాంకర్ రవి గట్టిగా అన్నాడు.

నేను ఫ్రెండ్ కాదా అంటూ రవి
యాంకర్ రవి మాటలకు కాజల్ స్పందిస్తూ.. ఇప్పుడు మన మధ్య శ్వేత టాపిక్ తీయకు.. ఫ్రెండ్ అనుకొని నన్ను సేవ్ చేశాడు. నిన్ను నామినేట్ చేశాడు అని అంటే.. నేను ఫ్రెండ్ కాదా అని రవి సమాధానం ఇస్తే.. నేను వంద రీజన్స్ చెబుతాను. ఇందాకటి నుంచి అంటున్నావు. సన్నీ గాడు.. వాడు.. గాడు గాడు అంటూ చెబుతున్నావు. నా పేరు తీయలేవా? కాజల్‌ను నామినేట్ చేయమని చెప్పలేవా అంటూ కాజల్ ఘాటుగా స్పందించింది.

ఆడుకొందాం అంటూ నామినేట్ చేస్తావు
నన్ను నామినేట్ చేశావు కాదా.. దానిని బట్టి కాజల్ నీకు ఫ్రెండ్ కాదు కదా.. సింపుల్. కలిసి ఆడుదాం అంటావు. సడెన్‌గా నన్ను నామినేట్ చేస్తావు అంటూ కాజల్ ఫైర్ అయింది. కాజల్ మాటలతో విసిగిపోయిన యాంకర్ రవి.. నా జీవితంలో ఇలా నా పెళ్లాం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎక్స్‌ప్లేన్ చేయలేదు. టాస్క్‌లో నీవు నాకు టిట్ ఫర్ టాట్ చేశావు. నేను దానిని దృష్టిలో పెట్టుకొన్నానా? నేను నామినేట్ చేస్తున్నానా? ఆ రెండు పాయింట్లు విషయంలో సారీ ఎందుకు చెప్పడం లేదు అంటూ నాగ్ సార్ ముందు హగ్ కోసం ప్రయత్నిస్తున్నాడనే విషయాన్ని లేవనెత్తి యాంకర్ రవి ప్రశ్నించాడు.
Recommended Video

యాంకర్ రవికి సారీ చెప్పిన ఆర్జే కాజల్
దాంతో ఆ రెండో పాయింట్ హగ్ అని చెప్పిన విషయంలో నేను సారీ చెబుతున్నాను. కొన్ని విషయాలతో ఆందోళనకు గురయ్యాను. అందుకే నా మూడ్ బాగాలేదు. నాకు కొంత సమయం కావాలి. నాకంటూ ఒకస్పేస్ కావాలి అంటే.. అదే విషయం కెమెరా ముందు చెప్పు. అప్పుడు నేను వదిలేస్తాను అంటూ యాంకర్ రవి అన్నారు. అలా వారిద్దరి మధ్య ఘాటుగా సంభాషణ జరిగింది.


Click it and Unblock the Notifications











