కాజల్ కు కెప్టెన్ అయ్యే అవకాశమే లేదు.. బిగ్ బాస్ ఆగ్రహంతో జెస్సి అసహనం

నాలుగో వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ షో మరోసారి ఉత్కంఠభరితంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కంటెస్టెంట్స్ మధ్య లో కొత్త ట్విస్టులు మొదలయ్యాయి. మొన్నటి వరకు ఎంతో స్నేహంగా ఉన్నవారు కూడా శత్రువులుగా మారుతున్న వాతావరణం కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో బంధువులతో స్నేహితులతో ఎంత కలిసికట్టుగా ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ శత్రువులుగా మారే అవకాశం వస్తూనే ఉంటుంది. ఇక ఈ సారి రవి కూడా అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నాడు. అలాగే కెప్టెన్సీ టాస్క్ లో బాగంగా గొడవలు మొదలయ్యాయి. అయితే జెస్సి చేసిన పొరపాటు కారణంగా rj కాజల్ కూడా ఈ వారం కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయింది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 కాజల్ ఆగ్రహం..

కాజల్ ఆగ్రహం..

బిగ్ బాస్ హౌస్ లో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో విలన్స్ అయ్యే సందర్భం ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో యాంకర్ రవి అందరికంటే ప్రధాన కంటెస్టెంట్ అయినప్పటికి అతడు అందరి దృష్టిలో కూడా నెగిటివ్ అవుతున్నాడు. ఒక విధంగా అతని అది ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియదు కానీ ప్రేక్షకుల్లో మాత్రం భిన్న అభిప్రాయాలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఫైనల్ గా కాజల్ కూడా రవిని దూరం పెట్టేసింది. మొన్నటి వరకు ఫ్రెండ్ అని చెప్పిన రవి కాజల్ ని నామినేట్ చేయడంతో అతనిపై ఒక్కసారిగా నెగటివ్ ఇంప్రెషన్ కలిగింది.

ఆ విషయంలో తగ్గేది లేదు

ఆ విషయంలో తగ్గేది లేదు

తలపై ఎవరైనా కొడితే మాకు నాకు బాధగా ఉంటుందని అది ఫిజికల్ గా తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టింది అని రవి కారణం చెప్పగా అందుకు కాజల్ చాలా బాధతో రవికి దూరంగా జరిగింది. అది సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాజల్ అతడికి దూరంగా ఉంటూ వస్తోంది. ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదని అసలు మాట్లాడొద్దు అని కూడా చెప్పేసింది.

 కెప్టెన్ అయ్యే అవకాశం లేదు.

కెప్టెన్ అయ్యే అవకాశం లేదు.

ఇక RJ కాజల్ కు మరో దెబ్బ పడింది. గత మూడు వారాలుగా కెప్టెన్ అవ్వాలని ఆమె కఠినంగా ప్రయత్నం చేస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని నిర్ణయించుకుంది. అయితే ఊహించని విధంగా ఆమె ఈ వారం ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఈ వారం జెస్సి తో పాటు కాజల్ కూడా కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయిందని బిగ్బాస్ సీరియస్ గా చెప్పారు.

ఆ అవకాశం ఇద్దరికి లేదు.

ఆ అవకాశం ఇద్దరికి లేదు.

బిగ్ బాస్ ఇచ్చిన బరువును కోల్పోయే టాస్క్ లో ఎవరు కూడా ఫుడ్ తినకూడదు అని ఆర్డర్ వేసిన విషయం తెలిసిందే. ఇంట్లో ఉన్న వంటసామాన్లు అలాగే పండ్లను.. అన్నిటికీ తీసుకొని స్టోర్ రూములో పెట్టేస్తారు. అయితే టాస్క్ లో సంచాలకులుగా ఉన్న జెస్సీ ఎవరు కూడా రూల్స్ ను అతిక్రమించి ఫుడ్ తీసుకోకుండా జాగ్రత్త పడల్సినన అవసరం ఉంది. అయితే కొందరు దొంగచాటుగా ఫుడ్ తీసుకోవడం వలన అతను ఫెయిల్ అయినట్లే. ఇంకా ప్రభావం కాజల్ పైన కూడా పడింది. ఇద్దరూ జోడిగా ఉండడం వలన ఈ వారం వారిద్దరికీ కెప్టెన్ అయ్యే అవకాశం లేదని బిగ్ బాస్ క్లారిటీగా చెప్పేశాడు. దీంతో జెస్సి ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశాడు.

Recommended Video

#BiggBossTelugu5 : Lobo, Nataraj Master Lost It Completely || Filmibeat Telugu
మానవత్వం లేదని అన్నారు

మానవత్వం లేదని అన్నారు

బిగ్ బాస్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా జెస్సితో పాటు కాజల్ కూడా కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయింది. ఇక ఫైనల్ గా జెస్సి తీవ్రస్థాయిలో అసంతృప్తి చెందాడు. కొందరు కావాలని చేశారని నేను ఎంత చెప్పినా కూడా వినలేదు. మానవత్వం లేదని అన్నారు. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ నేను ఫాలో అయ్యాను అంటూ ఆ విషయంలో అందరిపై ఒక్కసారిగా కోప్పడ్డాడు. ఎంత చెప్పినా వినలేదు మానవత్వం లేదని అన్నారు... అంటూ కూడా సడన్ గా లేచి వెళ్లిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X