Bigg Boss 5: నామినేషన్స్ లో ఎవిక్షన్ పాస్ గొడవ.. కాజల్, శ్రీరామ్ మాటల యుద్ధం!
బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్లే అనిపిస్తోంది. గత రెండు వారాలు కూడా షో ఏమాత్రం ఆసక్తికరంగా కొనసాగలేదు అని కామెంట్ చేస్తే చాలానే వచ్చాయి. ముఖ్యంగా హోస్టింగ్ విషయంలో అయితే నాగార్జున ఈసారి పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడం లేదు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక 12వ వారం లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ సీజన్ 5 ఎలిమినేషన్ ప్రక్రియను కూడా చాలా కొత్తగా మొదలు పెట్టారు. మొన్నటి వరకు జరిగిన ఆట ఒక లెక్క ఈరోజు నుంచి జరగబోయే ఆట మరొక లెక్క అనే విధంగా కనిపిస్తుంది. ఇక నేడు నామినేషన్స్ లో కాజల్ శ్రీరామ్ అలాగే సన్నీ మధ్యలో మాటల యుద్ధాలు కొనసాగినట్లు తెలుస్తోంది.

ఈసారి వెళ్లిపోయేది ఎవరు
గత వారం ఎలిమినేషన్ లో పెద్దగా సందేహాలు అయితే నెలకొనలేదు. అందరు కూడా ఆనీ మాస్టారు వెళ్ళిపోతుందని అనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే ఆమె హౌస్ లో నుంచి వెళ్ళిపోయింది. ఇక ఈ వారం ఎవరు ఇంట్లో నుంచి వెళ్లిపోతారనది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వారందరూ కూడా టాప్ పవర్ఫుల్ కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు. ఒకరిని మించి మరొకరు బిగ్ బాస్ ఆటను ముందుకు తీసుకు వెళుతున్నారు. దీంతో ఎలిమినేషన్స్ ఊహించడం చాలా కష్టమే అని చెప్పవచ్చు.

ఏవిక్షన్ పాస్ గోడవ
ఇక నేడు నామినేషన్స్ లో చాలా గొడవలు జరిగినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏవిక్షన్ పాస్ విషయం పాస్ విషయంలో కాజల్ పై శ్రీ రామచంద్ర మొదటి నుంచి కూడా అసంతృప్తిగానే ఉన్నాడు. కావాలని అక్కడ కాజల్ వేరే విధంగా ఆలోచించింది అని, ఆమె ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఆరోపణలు చేశాడు. ఏవిక్షన్ పాస్ సన్నీకి దక్కేలా చేయడం పై మొదటి నుంచి కూడా శ్రీరామ్ ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. ఇక మధ్యలో వచ్చిన సన్నీపై కూడా శ్రీరామ్ ఒక్కసారిగా వాయిస్ పెంచేశాడు.

కాజల్ vs శ్రీరామ్
ఎవరో ఒకరిని సేవ్ చేయాలని ఆలోచనతోనే ఉండాలి. కానీ నువ్వు మాత్రం ఇద్దరిపై ప్రభావం చూపించే విధంగా ఏవిక్షన్ పాస్ విషయంలో ఆలోచించావు. అది నాకు ఏమాత్రం నచ్చలేదు అని శ్రీ రామచంద్ర క్లియర్ గా వివరణ ఇవ్వడంతో అందుకు కాజల్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏదేమైనా ఈ ఆటలో నా క్లారిటీ నాకు ఉంటుంది. నా స్నేహితుడికి ఏవిక్షన్ పాస్ ఇవ్వాలనేది నా ఆలోచన.. అని కాజల్ సమాధానం ఇవ్వడంతో అందుకు శ్రీరామ్ నీ ఫ్రెండ్ వెళ్ళి పోతాడు అని భయమా అని మరొక కౌంటర్ ఇచ్చాడు.

మధ్యలోకి వచ్చిన సన్నీ
కాదు నా ఫ్రెండ్ ఇవ్వడమే తనకు ఇష్టమని కాజల్ సమాధానం ఇవ్వగా.. ఏదేమైనా కూడా ఆనీ మాస్టర్ ఏవిక్షన్ పాస్ కు అర్హురాలు అంటూ శ్రీరామచంద్ర మరొక మాటను చెప్పాడు
ఇక కాజల్ శ్రీరామచంద్ర మధ్య మాటలు కొనసాగుతున్న సమయంలో సన్నీ మధ్యలోకి వచ్చాడు.. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ క్లారిటీ ఇస్తున్న సమయంలో శ్రీరామచంద్ర సన్నీ నువ్వు మధ్యలో కి రావద్దు నేను కాజల్ తో మాట్లాడుతున్నాను అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Recommended Video

కౌంటర్ షాక్ ఇచ్చిన సన్నీ
ఏదేమైనా నాకు కాజల్ ఆడిన గేమ్ ఏమాత్రం నచ్చలేదు అంటూ శ్రీరామచంద్ర ఆమెను నామినేట్ చేశాడు. ఇక సన్నీ మరోసారి కలుగజేలుకొని ఇక్కడ ఎవరెవరు ఎవరితో క్లోజ్ గా ఉన్నారో అందరికి తెలుసు అని అన్నప్పుడు శ్రీరామ్ నాకు తెలియదు అని అన్నాడు. ఇక శ్రీరామ్ మరింత సహనం కోల్పోయి నేను సిరి షన్ను కూడా గ్రూప్ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 5కోట్ల మంది గ్రూప్ అంటూ మరింత తెలివిగా సమాధానం ఇవ్వగా.. అందుకు సన్నీ మాట్లాడుతూ.. నేను ఆ గ్రూప్ లీడర్ ని అంటూ షాక్ ఇచ్చాడు. ఇక శ్రీరామ్ అనుకున్నట్లే సన్నీని నామినేట్ చేశాడు.


Click it and Unblock the Notifications











