Bigg Boss Telugu 5: విన్నర్ అతనే..అద్భుతంగా ఆడుతున్నాడు.. సజ్జనార్ వీడియో వైరల్!

టెలివిజన్ లో బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ముందు హిందీ బాషలో విజయవంతం కావడంతో తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో ఈ షోను ఆదరిస్తున్నారు. సినిమాల కంటే కూడా ప్రేక్షకుల దీని మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో నాలుగు సీజన్లు పూర్తిచేసుకున్న ఈషో.. ప్రస్తుతం ఐదవ సీజన్ కొనసాగుతుంది. అయితే ఈ షో సగం రోజులు పూర్తి చేకుని ఫినాలే వైపు అడుగులు వేస్తూ ఉండడంతో లోపల కంటేస్టంట్స్ కోసం బయట తిప్పలు పడుతున్నాయి పీఆర్ ఏజెన్సీలు. తాజాగా శ్రీ రామ చంద్రకు సజ్జనర్ సపోర్ట్ చేశారు. ఆ వివరాల్లో కి వెళితే

రచ్చ బ్యాచ్

రచ్చ బ్యాచ్

తెలుగు బిగ్‏బాస్ సీజన్ 5 పదవ వారంలోకి అడుగుపెట్టింది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇక ఇప్పటివరకు తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి సరయు, ప్రియా, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హామిదా, లోబో, విశ్వ ఎలిమినేట్ కాగా.. ఈవారం అనారోగ్య సమస్యలతో జెస్సీ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బిగ్‏బాస్ షోను అటు సినీ ప్రముఖులు సైతం వీక్షిస్తూ తమ మద్దతు తెలుపుతున్న క్రమంలో ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు తన సంపూర్ణ మద్దతు ట్రాన్స్‏జెండర్ ప్రియాంకకు తెలిపారు.

సోనూ సహా

సోనూ సహా


రియల్ హీరో సోనూ సూద్.. సింగర్ శ్రీరామచంద్రకు మద్దతు తెలిపారు. జబర్దస్త్ బ్యాచ్ కూడా తమ పాత స్నేహతుడికి అండగా నిలుస్తున్నారు. తాజాగా బిగ్‏బాస్ తెలుగు షో గురించి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బిగ్‏బాస్ షోలో తన మద్దతు ఎవరికనేది తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సజ్జనార్ మాట్లాడుతూ.. బిగ్‏బాస్ ఇంట్లో శ్రీరామ్ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన కప్ గెలుస్తాడనే నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు.

సజ్జనార్ కుం థాంక్స్

సజ్జనార్ కుం థాంక్స్

ఈ దెబ్బతో శ్రీరామచంద్ర ఫ్యాన్స్ అందరూ సజ్జనార్‏కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పటికే సోనూసూద్, సజ్జనార్ తమ మద్దతు శ్రీరామచంద్రకు తెలియజేయగా.. పాయల్ రాజ్ పుత్ సైతం తన సపోర్ట్ శ్రీరామ్ చంద్రకే అని చెప్పేసింది. అలాగే హిందీ కమెడియన్ భారతీ సింగ్ సైతం శ్రీరామచంద్రకు మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటి వరకు శ్రీరామచంద్రకు ఓటింగ్ పరంగా ఎలాంటి డేంజర్ జోన్ లేదు. ఈపరంగా చూసుకుంటే శ్రీరామచంద్ర సెమి ఫైనల్‏లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

Recommended Video

Actor Harshavardhan Funny Interview With Raja Vikramarka Crew
షణ్ముుఖ్ ను ఎలివెట్ చేస్తూ

షణ్ముుఖ్ ను ఎలివెట్ చేస్తూ


మరో పక్క షణ్ముఖ్ జస్వంత్ కి కూడా తెలుగు బుల్లితెర సెలబ్రిటీలు అలాగే యూట్యూబ్ స్టార్స్ అందరూ తమ మద్దతు పలుకుతున్నారు.. షణ్ముఖ తో పరిచయం ఉన్నవారు పరిచయం లేనివారు సైతం అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.. షణ్ముక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్న సంస్థ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడంతో ఎక్కువగా షణ్ముఖుని సోషల్ మీడియాలో హీరోని చేసే ప్రాసెస్ లో పడ్డారు. మరి చూడాలి ఈ ఈ సీజన్ విన్నర్ గా ఎవరు గెలుస్తారు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X