Bigg Boss telugu 5: షన్ను ఫ్యాన్స్ బూతులకు సరయు కౌంటర్.. దమ్ముంటే అక్కడికి రండి నేనొస్తున్నా..

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం అంచనాలకు తగ్గట్లు గానే బాగానే కొనసాగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ లో సరయు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి బోల్డ్ గోర్ల్ తప్పకుండా కొన్ని వారాలపాటు సందడి చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ మొదటి వారమే ఎలిమినెట్ అయ్యింది. ఇక మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత కూడా సరయు తనదైన శైలిలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆమె రెండు మూడు ఇన్సిడెంట్స్ వలన బాగా హర్ట్ అయినట్లు చెప్పింది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ పై కూడా తీవ్ర స్థాయిలో కామెంట్ చేసింది. అయితే కొన్ని నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేస్తూ కామెంట్ చేసిన వారికి హెచ్చరిక కూడా చేసింది.

ఇప్పుడు ఇలా చేయక తప్పడం లేదు

ఇప్పుడు ఇలా చేయక తప్పడం లేదు

సరయు మాట్లాడుతూ.. నాకు మొదటి నుంచి కూడా సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ గురించి కానీ అందులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి గానీ వీడియోలు చేయాలని అనుకోలేదు. కాకపోతే జరిగిన రెండు పరిణామాల వలన ఈ వీడియో చేయక తప్పడం లేదు.. అని వివరణ ఇచ్చింది.

 షన్ను ఫ్యాన్స్ నుంచి ఫోన్ కాల్స్

షన్ను ఫ్యాన్స్ నుంచి ఫోన్ కాల్స్

ఎవరో షన్ను అభిమానులు.. నన్ను కించపరిచేలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. రెండవ అంశం ఏమిటంటే ఇటీవల ఒక ఆరేళ్ళ పాపను అత్యాచారం చేసి చంపేశాడు ఒకడు. సింగరేణి కాలనీ లో 144 సెక్షన్ కూడా పెట్టారు. నన్ను కామెంట్ చేసేందుకు కేటాయించిన సమయాన్ని వాళ్లకోసం సగం కూడా కేటాయించలేదు.. అని సరయు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 మీకు దమ్ముంటే అక్కడికి రండి

మీకు దమ్ముంటే అక్కడికి రండి

అయితే మా ఇల్లు కూడా సింగరేణి కాలనీకి దగ్గరగా ఉన్న సరూర్ నగర్ లోనే ఉంది. నేను వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ చేయడానికి వెళుతున్నాను. మీకు దమ్ముంటే ఒక మానవత్వంతో ఆలోచించి వాళ్ల పేరెంట్స్ కి మద్దతు ఇవ్వండి. మీ ఉన్నదాంట్లో మీరు చేయాల్సిన సహాయం మీరు చేయండి. ఆ తర్వాత మీకు నచ్చినట్లుగా కామెంట్ చేయండి. నన్ను అటాక్ కూడా చేయండి. అప్పుడు ప్రతి దానికి నేను కూడా సమాధానం ఇస్తాను.. అని సరయు మాట్లాడింది.

 ఏవి కూడా టెలికాస్ట్ అవ్వలేదు..

ఏవి కూడా టెలికాస్ట్ అవ్వలేదు..

షణ్ముఖ్ జస్వంత్ ను నేను మూలకు కూర్చోమని అన్నందుకు నన్ను ఎటాక్ చేయడానికి అలాగే బూతులతో తిడుతున్నారు కదా.. అయితే నేను ఆ మాట అనడానికి ఎంత ఫేస్ చేసి ఉంటాను అనేది ఒకసారి ఆలోచించండి. నాకు జరిగిన పరిణామాలు టెలికాస్ట్ అయి ఉంటాయి అనుకున్నాను. ఆరోజు నేను స్టేజి పైన చెప్పిన విషయాలను కూడా మీరు అర్థం చేసుకుంటారు అని అనుకున్నాను. కానీ బయటికి వచ్చి చూసిన తర్వాత అవి ఏవి కూడా టెలికాస్ట్ అవ్వలేదు.. అని చెప్పింది.

ఆధారాలు ఉన్నాయి..

ఆధారాలు ఉన్నాయి..

అయినా పర్వాలేదు నా దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలతో నిజాలు మీకు చెప్పాలని అనుకున్నాను. కానీ అప్పటి వరకు అన్యాయం జరిగినపాప న్యాయం జరిగేలా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇక బుధవారం ఉదయం 11 గంటలకు యూట్యూబ్ ఛానల్ లో ఆధారాలతో మీ ముందుకు నేను వస్తాను అని సరయు వివరణ ఇచ్చింది. ఇక సరయు బిగ్ బాస్ పై ఎలాంటు కామెంట్స్ చేస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Recommended Video

Bigg Boss Telugu 5 : Uma బూతుల దెబ్బకు.. Week 2 Nominations || Oneindia Telugu

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X