For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5.. సరయును పంపేసింది అందుకేనా?.. అదే నిజమైతే మోసమే..

  |

  బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. మొదట కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు కాస్త నిరుత్సాహ పరిచారు అనే కామెంట్స్ అయితే గట్టిగానే వచ్చాయి. కానీ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతూ ఉండడం వలన కంటెస్టెంట్స్ లో కూడా కొత్త రకాల స్వభావాలు బయటపడుతున్నాయి. ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకునే క్రమంలో షో మరింత రసవత్తరంగా మారుతోంది. చూస్తుంటే ఈసారి కూడా బిగ్ బాస్ రేటింగ్స్ విషయంలో రికార్డులు బ్లాస్ చేసేలా ఉందని అర్థమవుతోంది.

  అయితే మొదటి వారం సరయు తెలుగు ఎలిమినెట్ అవ్వడం అందరిని కాస్త ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి. అంతేకాకుండా సరయు వెళ్ళి పోవడం వెనుక ఒక మోసం జరిగింది అని కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే నెగిటివ్ ప్రచారాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

  Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

  నిజంగా షాకింగ్..

  నిజంగా షాకింగ్..

  13వ కంటెస్టెంట్ గా సరయు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టినప్పుడు ఈసారి బోల్ట్ కంటెంట్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కానీ ఆమెను ఒక వారానికి పరిమితం చేయడం ఒక వర్గం వారిని షాక్ కు గురి చేసిందని చెప్పాలి. నిజానికి చివరిలో ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు సరయు సేఫ్ జోన్ లోకి వస్తుందని అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా జశ్వంత్ సేఫ్ లోకి రావడం విశేషం.

  హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్: అదిరిపోయే ఫోజులతో అందాల విందు

  సరయుతో పోలిస్తే..

  సరయుతో పోలిస్తే..

  జశ్వంత్ జెస్సీ సరయు ఇద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనే విషయంలోకి వెళితే సోషల్ మీడియాలో ఎక్కువగా జెస్సి పేరు ఎక్కువగా వినపడింది. నిజానికి సరయు హౌస్ లో అయితే ఏ మాత్రం సైలెంట్ గా ఉండలేదు. ఎప్పటికప్పుడు ఆమె ఆమె ఎనర్జీగా కనిపిస్తూనే ఉంది. కానీ ఆమె తో పోలిస్తే జెస్సి మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. అనవసరమైన గొడవల్లో తలదూర్చి అందరి చేత చిన్నపిల్లల మెంటాలిటీ అనిపించుకున్నాడు కూడా. అలాంటి ఆలోచన ఉంటే బిగ్ బాస్ లో ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టమే చెప్పాలి.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  సరయు అబ్బాయిలు ఫాలోయింగ్

  సరయు అబ్బాయిలు ఫాలోయింగ్

  బ్యాడ్ కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేయడంలో అలాగే నామినేషన్ విషయంలో కూడా జెస్సి చెప్పిన పాయింట్స్ చాలా సిల్లీగా ఉన్నాయి. అసలు నిజానికి జెస్సి ఈ వారం చేసి వెళ్లి పోవడం ఖాయమని కూడా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. సరుయు ఒక విధంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఆమె మాటలకు అబ్బాయిలలో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అసలు జెస్సి ఎక్కువగా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే వరకు కూడా ఎక్కువ మందికి తెలియదు.

  ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..

  వచ్చిన కొత్తలో స్మోకింగ్..

  వచ్చిన కొత్తలో స్మోకింగ్..

  అసలు సరయు వెళ్ళిపోయే అవకాశమే లేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ నిజంగానే పెద్ద షాక్ ఇచ్చాడు. అయితే సోషల్ మీడియాలో కొంతవరకు ఒకటైతే వైరల్ గా మారుతుంది. బిగ్ బాస్ ను ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులు చూస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే సరయు వచ్చిన కొత్తలో స్మోకింగ్ చేసింది.

  కొంతవరకు అది నెగిటివ్ కావచ్చని కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ అదే నిజం అనుకుంటే తప్పు. గతంలో కూడా చాలా మంది స్మోక్ చేశారు. అయితే సరయు సిగరెట్ తాగిన సన్నివేశాలను ఒక్కసారి మాత్రమే చూపించారు. మళ్లీ ఆ తర్వాత అసలు చూపించలేదు.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  సరయును తీసేయ్యడం కరెక్ట్ కాదా?

  సరయును తీసేయ్యడం కరెక్ట్ కాదా?

  ఆ తర్వాత లోబో మాత్రమే స్మోకింగ్ జోన్ లో కనిపించాడు. ఆ తరువాత మళ్లీ కనిపించలేదు.. ఆ విషయాన్ని పక్కన పెడితే జెస్సికి పాత కంటెస్టెంట్స్ కొంతమంది మద్దతు పలకడం విశేషం అని చెప్పవచ్చు. కానీ పవర్ఫుల్ కంటెస్టెంట్ గా నిలబడే అర్హత ఉన్న సరయును తీసేయ్యడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఇదివరకు ఆమె కాజల్ తో కూడా గట్టిగానే వాదించింది. ఆమెకు పోటీగా ఎవరు వచ్చినా కూడా మాట్లాడలేరు అనే విధంగా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎందుకో మొత్తం రివర్స్ అయ్యింది.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  అదే నిజమైతే..

  అదే నిజమైతే..

  బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం సరయు వెళ్ళిపోతుందని నిజంగా ఊహించలేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఆమె నీ పుట్టలో వేలు పెట్టడం డైలాగ్ తో కూడా కొంత నెగటివ్ కామెంట్స్ అందుకున్నట్లు మరొక వాదన వినిపిస్తోంది. టెలివిజన్ లాంటి షో లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటే రేటింగ్ పై తీవ్రంగా ప్రభావం పడువచ్చు అనే అపోహలు కూడా రావచ్చు. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. రెండు మూడు సార్లు కూడా అదే తరహాలో సరయు డైలాగ్స్ తో హైలెట్ గా నిలిచింది.

  ఇక ఆమెను నేను కావాలని పంపించారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మళ్లీ బిగ్ బాస్ పై నెగిటివ్ ప్రచారం కొనసాగే అవకాశం ఉంటుంది. తదుపరి వారం ఎవరు బయటికి వెళ్తాను అని విషయంతో బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ వీక్ ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 5 sarayu eliminating and behind the reasons
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X