For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ ఇదే.. అదిరిపోయేలా నాగ్ ఎంట్రీ.. ఇంకా స్పెషల్ ఏమిటంటే?

  |

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షో ప్రారంభానికి అంతా సిద్దమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొన్న కంటెస్టెంట్ల రాక కోసం బిగ్‌బాస్, అలాగే ఇల్లు కూడా అంగరంగవైభంగా ముస్తాబైంది. ఆదివారం సెప్టెంబర్ 5వ తేది ఆదివారం బిగ్‌బాస్ తెలుగు 5 ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొనే వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉన్నాయి.

  ఆరోగ్య, కోవిడ్ పరీక్షలు తట్టుకొని

  ఆరోగ్య, కోవిడ్ పరీక్షలు తట్టుకొని

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కోసం ఇప్పటికే ఎంపిక చేసిన కంటెస్టెంట్లతోపాటు స్టాండ్‌బైగా ఉన్న మరో ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు తరలించారు. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు, అలాగే కోవిడ్ నిర్దారణ పరీక్షలు జరిపించారు అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే కంటెస్టెంట్లందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉత్సాహంగా వేదిక మీదకు వచ్చేందుకు ముస్తాబు అవుతున్నారని చెప్పారు.

  ఆడియో విజువల్ ప్రజెంటేషన్ షూట్

  ఆడియో విజువల్ ప్రజెంటేషన్ షూట్

  ఇక కంటెస్టెంట్లకు సంబంధించిన ఫోటో షూట్స్ ఘనంగా ముగిసాయి. వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలకు సంబంధించిన వివరాలను వీడియో రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఆడియో, విజువల్ ప్రజెంటేషన్ కూడా పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.

  హోస్ట్‌గా నాగార్జున స్పెషల్ ఎంట్రీ

  హోస్ట్‌గా నాగార్జున స్పెషల్ ఎంట్రీ

  ఇక హోస్ట్‌గా అక్కినేని నాగార్జున మరోసారి తనదైన శైలిలో బిగ్‌బాస్ షోను రంజుగా నడిపించడానికి పూర్తిగా సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయనపై షూట్ చేసిన ప్రోమో వీడియోలకు అనూహ్యమైన స్పందన రావడంతో షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హోస్ట్‌గా నాగార్జున వేదిక మీదకు స్పెషల్‌గా రప్పించడానికి చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తాయి అని వెల్లడిస్తున్నారు.

  బిగ్‌బాస్ తెలుగు 5లో ఎంపికైన కంటెస్టెంట్ల లిస్ట్

  బిగ్‌బాస్ తెలుగు 5లో ఎంపికైన కంటెస్టెంట్ల లిస్ట్

  1. యాంకర్ రవి
  యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా ఇప్పటికే ఎంతో మంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక బిగ్‌బాస్‌లో తన మార్కు టాలెంట్‌ను ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారు.

  2.యాంకర్ వర్షిణి

  2.యాంకర్ వర్షిణి

  యాంకర్ వర్షిణి కూడా టాప్‌ రేంజ్‌లో బుల్లితెరపైన రాణిస్తున్నారు. హోస్ట్‌గా పలు కార్యక్రమాలకు, అలాగే ఢీ, ఇతర కార్యక్రమాల్లో టీమ్ లీడర్‌గా రాణిస్తున్నారు.

  3. యాక్టర్ ప్రియ

  3. యాక్టర్ ప్రియ

  సీనియర్ నటిగా ప్రియకు మంచి గుర్తింపు ఉంది. హోమ్లీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు.

  4. వర్థమాన నటి లహరి షారి

  4. వర్థమాన నటి లహరి షారి

  ఇటీవల కాలంలో యువ తారగా లహరి షారి టాలీవుడ్‌లో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్జున్ రెడ్డి, మల్లీ రావా, పేపర్ బాయ్, శ్రీనివాస కల్యాణం, తిప్పర మీసం, జాంబిరెడ్డి చిత్రాల్లో నటించారు.

  5. జబర్తస్త్ ప్రియాంక

  5. జబర్తస్త్ ప్రియాంక

  బుల్లితెరపై పాపులర్ షో ద్వారా ప్రియాంక‌గా మంచి గుర్తింపు పొందారు. ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఆమె అసలు పేరు సాయి తేజ. ప్రస్తుతం బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

  6. సిరి హన్మంతు

  6. సిరి హన్మంతు

  సిరి హన్మంతు సీరియల్ నటిగా, న్యూస్ రీడర్‌గా, యూట్యూబ్ స్టార్, షార్ట్ ఫిలిం యాక్టర్‌గా సుపరిచితులు. సినీ హన్మంతు అసలు పేరు శిరీష హన్మంతు.

  7. సింగర్ రామచంద్ర

  7. సింగర్ రామచంద్ర


  టాలీవుడ్‌లో పాపులర్‌ గాయకుడిగా సింగర్ రామచంద్రకు మంచి పేరు ఉంది. అలాగే ఇండియన్ ఐడల్ 5 విజేతగా కూడా అందరికి సుపరిచితులు.

  Director Maruthi Launched 'Achamaina Telugu Inti Pillave' Song From Savitri w/o Satyamurthy
  బిగ్‌బాస్‌లోకి చలాకీ యువతీ, యువకులు

  బిగ్‌బాస్‌లోకి చలాకీ యువతీ, యువకులు

  బిగ్‌బాస్‌లోకి వచ్చే వారిలో ఈ కింది ఇవ్వబడిన సినీ, టెలివిజన్, సోషల్ మీడియా ఇన్ల్పూయేన్సర్స్ ఉన్నారు. వారి పేర్లు ఇవే..
  8. సెవెన్ ఆర్ట్స్ సరయు
  9 దీపక్ సరోజ్
  10. వర్థమాన నటి శ్వేతా వర్మ
  11 షణ్ముఖ్ జస్వంత్
  12 నటరాజ్ మాస్టర్
  13. టెలివిజన్ యాక్టర్ సన్నీ
  14 టెలివిజన్ నటుడు మానస్ షా
  15 టెలివిజన్ నటి ఉమాదేవి (కార్తీకదీపం ఫేమ్)
  16 మోడల్ జస్వంత్
  17 ఆర్జే కాజల్
  18 యూట్యూబర్ లోబో
  19 లహరి షారి

  English summary
  Bigg Boss Telugu 5 season is strating on September 5th. Here is the confirmed list of the reality show is.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X