Bigg Boss Telugu 5 elimination: గన్ షాట్‌తో ఉమాదేవి ఎలిమినేషన్.. లోబోకు ఎమోషనల్ వార్నింగ్.. కంటతడి పెడతూ

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో అందరూ ఊహించినట్టుగానే రెండోవారంలో కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఉమాదేవి ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఉమాదేవి ఎలిమినేషన్ తర్వాత ఇంటి సభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు. సెప్టెంబర్ 19వ తేదీన ప్రసారమైన ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగాయంటే..

డెస్టినీ గేమ్‌తో

డెస్టినీ గేమ్‌తో

సన్ డే రోజున ఫన్ డేగా ట్రీట్ చేయడంతో ఇంటి సభ్యులతో హోస్ట్ నాగార్జున ఫన్ గేమ్స్ ఆడించారు. డెస్టీనీ అంటూ ఇంటి సభ్యులతో గేమ్ ఆడించారు. ఈ గేమ్ కోసం ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించారు. పురుషులను ఒక జట్టుగా, మహిళలను మరో జట్టుగా విడదీశారు. ఆ తర్వాత టేబుల్‌పై గ్లాస్‌లు పెట్టి అందులో ఒక బాల్ వేసి.. ఆ గ్లాసు కింద ఉన్న ఫోటోలో కనిపించిన వ్యక్తితో డ్యాన్స్ చేయాలి. ఈ గేమ్‌లో మహిళల జట్టు విజయం సాధించింది. ఈ గేమ్ అనంతరం నామినేట్ అయిన నలుగురు సభ్యుల్లో ఆర్జే కాజల్‌ను సేఫ్ చేశారు. దాంతో నటరాజ్ మాస్టర్, ప్రియ, ఉమ మిగిలారు.

దెయ్యంలా వెంటపడిందంటూ

దెయ్యంలా వెంటపడిందంటూ

ఆ తర్వాత ఇంటి సభ్యులను లివింగ్ రూమ్‌లోకి పిలిచి ఇంట్లో దెయ్యం అనే గేమ్‌ను ఆడించారు. ఎవరైతే వెంటపడి దెయ్యంలా వేధిస్తారో వారి ముఖంపై ఓ స్టిక్కర్ వేయాలి. అలా ప్రతీ సభ్యుడు ఇంటి సభ్యుడి గురించి చెప్పి.. తమకు అనిపించిన వ్యక్తిపై స్టిక్కర్ అతికించాడు. అలా ఎక్కువగా దెయ్యం అని సిరి హన్మంతుకు స్టిక్కర్ వేశారు. ఆ తర్వాత ఓ పాటను ప్లే చేసి..

ప్రియ సేఫ్ ఇలా..

ప్రియ సేఫ్ ఇలా..

ఆ తర్వాత మిగిలిన ముగ్గురు నామినేట్ అయిన సభ్యులను సేఫ్ చేసే ప్రక్రియను నాగార్జున మొదలుపెట్టారు. తన చేతిలో ఓ క్లిప్పును చూపించి ప్రియను సేఫ్ అయినట్టు ప్రకటించారు. దాంతో ప్రియ సంతోషంలో మునిగిపోయింది. ఇక ఎలిమినేషన్‌లో మిగిలింది నటరాజ్ మాస్టర్, ఉమాదేవి. వారిద్దరిని లాన్‌లోకి పిలిచి చివరి ఎలిమినేషన్ రౌండ్‌ను నిర్వహించారు.

 చేతికి గన్ ఇచ్చి...

చేతికి గన్ ఇచ్చి...

లాన్‌లోకి ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ రాగానే.. వారిని కళ్లజోడు పెట్టుకోమని చెప్పారు. చేతిలో ఓ గన్ ఇచ్చి పట్టుకోమన్నారు. తాను చెప్పినప్పుడు గన్ పేల్చితే.. దానిని పొగ వస్తుందో వారు సేఫ్ అయినట్టు భావించాలి. అలా గేమ్ స్టార్ చేసి.. నటరాజ్ గన్ షూట్ చేయగా.. ఆయన గన్ లోనుంచి పొగ వచ్చింది. దాంతో నటరాజ్ సేఫ్ అయినట్టు.. ఉమాదేవి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.

వేదికపై నాగార్జునతో కలిసి

వేదికపై నాగార్జునతో కలిసి


అలా ఎలిమినేట్ అయిన ఉమాదేవి ఇంటి సభ్యులకు గుడ్‌బై చెప్పి నాగార్జున వద్దకు వచ్చారు. వేదికపైన తన జర్నీ చూసి ఎంజాయ్ చేశారు. లోబోతో రొమాన్స్‌ను చూసి ఫన్ అయ్యారు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడారు.. కుండల బద్దలు కొట్టి ఇంటి సభ్యుల గురించి చెప్పే ప్రక్రియను ఉమ చేపట్టారు. వారిలోని లోపాలను చెప్పి సరిదిద్దుకోమని చెప్పారు.

Recommended Video

Bigg Boss Telugu 5: Sriram Chandra - Hamida హాట్‌ హాగ్స్‌.. రొమాంటిక్ డ్యాన్సు || Oneindia Telugu
లోబోకు వార్నింగ్

లోబోకు వార్నింగ్

చివరగా లోబో గురించి చెబుతూ ఉమాదేవి ఎమోషనల్ అయ్యారు. లోబోతో తాను 20 ఏళ్లకు పైబడి కలిసి పనిచేశాం. మన గురించి ఏదో అనుకొంటారు. కానీ మనం ఓ లక్ష్యంతో వచ్చాం. దానిని పూర్తి చేయి. కానీ లోబోను కొందరు కించ పరుస్తున్నారు. వారిని పట్టించుకోవద్దని లోబోకు ఉమ చెప్పింది. అనంతరం వేదిక మీద నుంచి ఉమ నిష్క్రమించింది. దాంతో బిగ్‌బాస్‌లో ఉమ జర్నీ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X