Bigg Boss ప్రియకు బ్యాడ్ న్యూస్.. హమీదాకు శ్రీరామ్ ముద్దులు.. సిరికి హాగ్స్‌తో పండిన కెమిస్ట్రీ

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పెళ్లి చూపులు టాస్క్ సందడిగా కొనసాగుతున్నది. ఇంటి సభ్యులు ఎమోషన్స్ పండిస్తూ.. అలకలు, అల్లరితో గేమ్‌ను ఆసక్తికరంగా మలిచారు. తమకు కేటాయించిన పాత్రల్లో కంటెస్టెంట్లు దూరి జీవించినంత పని చేస్తున్నారు. బుధవారం ప్రసారమయ్యే తాజా ఎపిసోడ్‌లో షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్ర, హమీదా, లహరి షారి, మానస్ మధ్య లవ్ ట్రాక్ క్రేజీగా కనిపించింది. తాజా ప్రొమోలో కనిపించిన సన్నివేశాలు ఎలా ఉన్నోయో మీరే చూడండి..

పురోహితుడికి లైన్ వేసిన సిరి హన్మంతు

పురోహితుడికి లైన్ వేసిన సిరి హన్మంతు

పురోహితుడిగా పాత్రలో నటిస్తున్న షణ్ముఖ్‌తో సిరి హన్మంతు రొమాంటిక్‌గా గాలం వేసింది. ఈ పెళ్లి ఆపేసి.. ఎలాగైనా పెళ్లికొడుకును సెట్ చేయండి అంటూ సిరి అడిగితే.. మరీ నాకేమిటి లాభం అంటూ షణ్ముఖ్ ప్రశ్నించాడు. దాంతో షణ్ముఖ్ ఎదపై వాలి.. థ్యాంక్యూ సో మచ్ అంటూ రొమాన్స్‌ పండించింది. అయితే తనపై వాలిన సిరిని హత్తుకొంటూ వదిలేశాడు. ఆపేశావేంటిరా అంటూ సిరి అంటే.. చాలా రోజులు అయింది అంటూ షణ్ముఖ్ కామెంట్ చేశాడు.

శ్రీరాం ఒక్క ఛాన్స్ అంటూ హమీదా

శ్రీరాం ఒక్క ఛాన్స్ అంటూ హమీదా

ఇక శ్రీరామచంద్రతో హమీదా సంభాషణ మరింత ఆసక్తిగా సాగింది. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని హమీదా అంటే.. నా చేతిలో ఏమీ లేదు అని శ్రీరామచంద్ర అన్నారు. హమీదాతో శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. మనిద్దరి ఒకరికి ఒకరు తొడు ఉండకపోవచ్చు. మనం ఎవరితో ఉన్నా నీ మీద నాకు ప్రేమ, నా మీద నీకు ప్రేమ ఉంటుంది అని అన్నాడు.

శ్రీరామచంద్రతో సిరి కంటతడి

శ్రీరామచంద్రతో సిరి కంటతడి

ఇదిలా ఉండగా, శ్రీరామచంద్రతో సిరి మాట్లాడుతూ.. నీకు తెలిసినప్పటి నుంచి నీవు మనం ఫ్రెండ్స్ అనుకొన్నాం. కానీ చిన్నప్పటి నుంచి నేను నిన్ను లవ్ చేస్తూ ఉన్నాను. ఓ దశలో సిరి కంటతడి పెట్టుకొంటే.. వద్దు ఏడవకు అంటూ శ్రీరామచంద్ర కంటతడి తుడుస్తూ కనిపించాడు. ఇలా శ్రీరాం డబుల్ లవ్ ట్రాక్ నడిపిస్తూ కనిపించాడు. సిరి, హమీదాకు ముద్దుల పెడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తల్లి పాత్ర పోషిస్తున్న ప్రియతో మాట్లాడుతూ.. నీకు ఒకే అనిపిస్తే నాకు సై అంటూ పెళ్లి ప్రపోజల్‌కు సిద్ధమయ్యాడు.

లహరి షారితో మానస్ లవ్ ట్రాక్

లహరి షారితో మానస్ లవ్ ట్రాక్

కానీ అని మాస్టర్‌తో పింకి మాట్లాడుతూ.. హమీదా శ్రీరామ్‌కు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే.. ఎక్స్ కదా అంటూ అని కొట్టేసింది. హమీదా ఐలవ్ యూ చెప్పింది. ఇక లహరి షారితో మానస్ డేటింగ్ చేస్తూ.. చాలా రోజులుగా తెలిసిన అమ్మాయితో.. కాబోయే వారితో ఉన్నట్టు ఉంది అని చెప్పడం కనిపించింది. ఇలా ఇంటిలో రకరకాల ప్రేమ వ్యవహారాలు గేమ్‌ను రక్తికట్టించాయి.

Recommended Video

Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic
ప్రియాకు ఫోన్‌లో బ్యాడ్ న్యూస్

ప్రియాకు ఫోన్‌లో బ్యాడ్ న్యూస్


ఇక బిగ్‌బాస్ తాజా ప్రోమోలో ఇంట్లోని ఫోన్ మోగింది. అందరూ ఏమిటో అని పరుగెత్తుకొచ్చారు. ప్రియ ఫోన్ ఎత్తగానే... నీకు బ్యాడ్ న్యూస్ అంటూ అవతలి నుంచి ఓ కంఠం వినిపించింది. ఆ ఫోన్ వినగానే ప్రియ నీరసంగా, అలాగే బాధలో మునిగిపోయినట్టు కనిపించింది. ఇలా రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌పై ప్రోమో మరింత ఆసక్తిని పెంచింది. ఇంటిలో పెళ్లి సందడితోపాటు రారండోయో వేడుక చూద్దాం.. లాంటి పెళ్లి పాటలు ప్లే అవుతుండగా.. ఇంటి సభ్యులు డ్యాన్సులతో హోరెత్తించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X