Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ ఫైట్.. ఏం జరిగిందంటే?
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ఉత్సాహంగా వివాదాస్పద అంశాలతో ముందుకు సాగుతున్నది. ఇంటి సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలు, విభేదాలతో ప్రతీ రోజు ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. తాజాగా ఇంటి సభ్యులు వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. అందంగా ముస్తాబైన కంటెస్టెంట్లు భారీగా నిర్వహించిన పూజలో పాల్గొని విఘ్నేశ్వరుడిని ఆరాధించారు. అంతేకాకుండా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో కూడా పాల్గొన్నట్టు ప్రోమోలో కనిపించింది. అంతేకాకుండా ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకొన్నట్టు ప్రోమోలో చూపించారు. తాజా ప్రోమోలో చూపించిన సన్నివేశాల ప్రకారం ఏం జరిగిందంటే..

వినాయకుడిని ప్రతిష్టించి..
అందరికీ ఇష్టమైన వినాయకచవితి పండుగ కోసం బిగ్‌బాస్ ఇంటిని అందంగా ముస్తాబు చేశారు. స్వయంగా వినాయకుడిని తయారు చేసి ఇంటిలో ప్రతిష్టించారు. అందరూ కలిసి వినాయకుడికి హారతి ఇచ్చి ప్రార్థన చేశారు. దేవ శ్రీ గణేశ దేవ.. శ్రీ గణేశా దేవ పాటను పెట్టి పూజలు చేశారు. జై గణేష్ మహారాజుకు జై అంటూ నినాదాలు చేశారు. తమ ఆటకు విఘ్నాలు కలుగకుండా చూడాలని వేడుకొన్నారు.

వైబ్రేషన్స్ మాములుగా లేవు కదా..
వినాయకుడికి పూజలు చేసిన తర్వాత ఇంటి సభ్యులు ఓ రకమైన అధ్యాత్మిక లోకానికి వెళ్లినట్టు కనిపించింది. ఒకరినొకరు కౌగిలించుకొన్నారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అనంతరం మానస్; షణ్ముఖ్, యాంకర్ రవి ఓ చోట కూర్చొని మాట్లాడుకొన్నారు. ఇంటిలో వైబ్రేషన్స్ మామూలుగా లేవు కదా. ఇల్లు ఇల్లులా లేదు అంటూ షణ్ముఖ్ జస్వంత్ అనడం కనిపించింది.

నటరాజ్ మాస్టర్ కంటతడి
ఇక ఇంటిలో సడెన్‌గా మూడ్ మారిపోయినట్టు కనిపించింది. నటరాజ్ మాస్టర్ కన్నీరు పెట్టుకొంటుంటే లోబో ఓదార్చుతు కనిపించారు. అయితే టాస్క్ సందర్బంగా ఏదైనా జరిగిందా అనేది అనుమానంగా మారింది. లేదా నటరాజు తన గర్బవతి అయిన భార్యను ఊహించుకొని ఏడ్చారా అనేది షో చూస్తేనే స్పష్టమవుతుంది.

కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ టాస్క్
అలాగే వినాయకుడి పండుగ రోజున ఇంటి సభ్యులకు ఆసక్తికరమైన బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. పైన కొన్ని రంగు రంగుల మటి కుండలను కట్టిపెట్టారు. ఓ కంటెస్టెంట్‌ను మరో కంటెస్టెంట్ తన భుజాలపై ఎత్తుకొన్నారు. భుజాలపై కూర్చొని వ్యక్తి కళ్లకు గంతలు కట్టి ఆ మట్టి కుండలను పగలకొట్టే పనిలో పడ్డారు. ఆ టాస్క్ నిర్వహిస్తుండగా ఇంటి సభ్యులందరూ ఈలలు వేసి.. గోల చేసి కంటెస్టెంట్‌కు మద్దతు తెలిపారు. ఈ టాస్క్ నేపథ్యంగా గొడవ చోటుచేసుకొన్నది.
Recommended Video

విశ్వ ఒక్కడే చేయగలుగుతాడా?
టాస్క్ అనంతరం యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ మధ్య మాటల యుద్ధం జరిగినట్టు కనిపించింది. విశ్వ ఒక్కడే చేయగలుగుతాడా? విశ్వ ఒక్కడికే కళ్లు ఉన్నాయా? ఇంకా నలుగురైదుగురు ఉన్నారు. వారిని నేను లేపుతాను. ఒకరి కాదు.. ఇద్దరిని పెట్టండి నేను లేపుతాను అని నటరాజ్ అనడం కనిపించింది.
దాంతో నటరాజ్‌తో యాంకర్ రవి మాట్లాడుతూ.. అడిగిన నేను చెడ్డవాడిని అయ్యానా? నేను అడిగిన కదా అంటూ అన్నారు. దాంతో ఇక చాలు లే అన్నట్టు నటరాజ్ మాస్టర్ సైగ చేశాడు. అయితే ఈ గొడవకు కారణం ఏమిటో పూర్తి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











