Bigg Boss Telugu 5 Unseen: ముగ్గురు అంటీలతో లోబో లవ్ ట్రాక్.. మధ్యలో దూరిన యాంకర్ రవి.. బావా అంటూ!

బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్ లోబో హాస్యం ఇంటి సభ్యులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా ప్రేక్షకులకు కూడా మంచి వినోదాన్ని అందిస్తున్నది. ఇంటిలోని లేడీ కంటెస్టెంట్లతో రొమాంటిక్‌గా లవ్ ట్రాక్ నడుపుతూ హాస్యాన్ని పండిస్తున్నారు. ఇంటిలో ఇప్పటికే ఇద్దరు అంటీలతో లవ్ ట్రాక్ నడుపుతున్న లోబో మరో కంటెస్టెంట్‌తో ప్రేమగా వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది. యాంకర్ రవి మధ్యలో దూరి.. నా లవర్‌ను ఎందుకు పట్టుకొంటున్నావని అడగడం లోబోకు చిరాకు పెట్టింది. అయితే లోబో కొత్తగా లైన్ వేస్తున్నది ఎవరంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

సరయు ఎలిమినేషన్ తర్వాత

సరయు ఎలిమినేషన్ తర్వాత


బిగ్‌బాస్ షోలో సరయూ ఎలిమినేషన్ తర్వాత ఇల్లు గంభీరంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరు ఎమోషనల్‌గా కనిపించారు. సరయు వెళ్లిపోవడం బాధగా ఉందని కొందరు అంటే.. నాగార్జునతో కలిసి వేదికపై అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి పరిస్థితి నుంచి కంటెస్టెంట్లను బయటకు తీసుకురావడానికి లోబో చేసిన చిన్న పని అందరికి ఉపశమనం కలిగించింది.

శ్వేతా వర్మ నా లవర్ అంటూ

శ్వేతా వర్మ నా లవర్ అంటూ

ఇంటిలో శ్వేతా వర్మ భుజంపై లోబో చేయివేసి నా లవర్ అంటూ తీసుకెళ్తూ కనిపించాడు. అయితే నీకు ప్రియ ఇష్టం అని చెప్పావు.. ఇప్పుడు శ్వేతా వర్మను తీసుకెళ్తున్నావు. అది తప్పు కాదా అని నటరాజ్ మాస్టర్ అడిగితే.. ఆయనకు అందరూ ఇష్టమే. రోజుకు ఒకరు కావాలి అంటూ పక్క నుంచి కామెంట్ వినిపించింది. అయితే లోబో, శ్వేతా వర్మను విడదీస్తూ యాంకర్ మధ్యలో దూరాడు.

రవి కారణంగా చెప్పుతో కొట్టుకొన్న లోబో

రవి కారణంగా చెప్పుతో కొట్టుకొన్న లోబో

అయితే తనను, శ్వేతా వర్మను విడదీయడంతో లోబో హార్ట్ అయ్యాడు. యాంకర్ రవితో మాట్లాడుతూ.. నువ్వు ఎవరు? మధ్యలోకి రాకు అన్నాడు. అయినా రవి అలాగే శ్వేతా వర్మను పట్టుకొని ఉండటంతో లోబో పక్కనే ఉన్న చెప్పుతో తలకు కొట్టుకొంటూ కనిపించాడు. అందరూ ఆపడానికి ప్రయత్నిస్తే.. కొత్త చెప్పు ఏం కాదు.. అని యాంకర్ రవి ఏడిపించాడు. ఇంతకు మీ మధ్య రవి ఎవరు అంటూ నటరాజ్ మాస్టర్ అడిగితే.. పక్కనే ఉన్న సిరి.. అమ్మాయి లవర్ అంటూ కామెంట్ చేసింది. కాసేపు నన్ను వదలండి.. నాకు చాలా ఇరిటేషన్‌గా ఉంది అంటూ కాసేపు రిలాక్స్ అయి పక్కనే ఉన్న ప్రియ వద్దకు వెళ్లాడు.

బంగారం అంటూ ప్రియతో లోబో

బంగారం అంటూ ప్రియతో లోబో

ప్రియతో మాట్లాడుతూ.. అన్నం తిన్నావా బంగారం అంటూ లోబో ప్రేమగా, వినమ్రంగా అడిగాడు. దాంతో ప్రియా రియాక్ట్ అవుతూ.. తాగకుండానే ఇలా మాట్లాడుతున్నావు.. తాగితే ఎలా మాట్లాడుతావో అని అంది. దాంతో పక్కనే ఉన్న రవి. లోబో మందు తాగడు. ఆయనకు అలవాటు లేదని అంటూ చెప్పారు. ప్రియతో ప్రేమగా ఉండటంతో చూసి నిద్రలో ఉన్న ఉమ లేచి.. ఏంటి ప్రియ అంటూ ఆమె వెంట పడుతున్నావు అని గయ్ మని లేచింది.

Recommended Video

Allu Arjun Eats At A Roadside Hotel In Kakinada, Video Goes Viral || Filmibeat Telugu
బుస్సుమని లేవకు.. ఉమకు లోబో కౌంటర్

బుస్సుమని లేవకు.. ఉమకు లోబో కౌంటర్

అయితే నిద్ర లేచి తనపై అరుస్తున్న ఉమను ఉద్దేశించి... నీవు ఎందుకు లేచావు. పడుకో అంటూ చేతుల్తెత్తి లోబో మొక్కాడు. నీవు ఎందుకు లేచావు బుస్సు మని.. పడుకో అంటూ కామెంట్ చేశాడు. నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఎందుకు లేచావు. నిన్ను ఎవరు లేవమన్నారు అని లోబో అంటే.. నీవు నా ప్రియ అని ఎలా అంటావు అంటూ ఉమ ఫైర్ అయింది. దాంతో నువ్వు లేవకు.. పడుకో అంటూ లోబో తనదైన శైలిలో జవాబు ఇవ్వడంతో ఇంటి సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X