రాంచరణ్‌ను లోపలికి పంపండి.. రెండు వారాలు చాలూ అంటూ బిగ్‌బాస్ బ్యూటీ క్రష్
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో ప్రేక్షకులకు శనివారం ఎపిసోడ్ విందు భోజనంగా మారబోతున్నది. ఈ షో తారల తళుకుబెళుకులతో వేదిక రచ్చగా మారబోతున్నది. ఇంటి సభ్యుల ప్రవర్తన తీరుపై నాగార్జున తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంటిలోని పరిస్థితులపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రోమోలో స్టార్ హీరో రాంచరణ్‌ను పరిచయం చేశాడు. వేదికపై నుంచి రాంచరణ్‌తో మాట్లాడుతూ ఇంటి సభ్యులు ఎలా ఎంజాయ్ చేశారంటే..

రాంచరణ్ ఎంట్రీ అదిరిపోయింది. .
బిగ్‌బాస్ వేదికపై రాంచరణ్ ఎంట్రీ అదిరిపోయింది. హీజ్ ద మిస్టర్.. తీస్ మార్కాన్ అంటూ పాటపై మెగా పవర్ స్టార్ స్టైల్‌గా నడుచుకొంటూ వచ్చాడు. అలా స్టైల్‌గా రాగానే అంతే స్టైల్‌తో నాగార్జున ఆయనను ఆహ్వానించాడు. రాంచరణ్‌ను వేదికపైన చూడగానే అందరూ కేరింతలు కొడుతూ హాయ్ చెప్పారు. దాంతో నేను వస్తే.. మీరు లేచి నిలబడలేదు. కానీ రాంచరణ్ వస్తే మాత్రం నిలబడ్డారు. అంది గుర్తుపెట్టుకొంటాను అంటూ కామెంట్ చేశారు.

నేను లోబో మాదిరిగా తయారయ్యా..
ఇక ఇంటి సభ్యులతో రాంచరణ్ మాట్లాడుతూ.. నేను ఈ రోజు లోబోలాగా తయారై వచ్చాను అని అనగానే.. లోబో ఆనందానికి హద్దులేకుండా పోయాయి. వెంటనే భూమిపైకి వంగి తలను నేలకు ఆనించి నమస్కారం చేశాడు. దాంతో రాంచరణ్ కూడా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక కార్తీకదీపం ఫేమ్ ఉమ గురించి ఏదో చర్చ జరిగినట్టు కనిపించింది. నాగార్జున మాట్లాడుతూ.. ఆమె చాలా మంచిది. కానీ కొన్ని సార్లు బూతులు మాట్లాడుతుంటుంది అని అనగానే.. కాలర్ నోటికి అడ్డు పెట్టుకొని రాంచరణ్ ఓ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

ఏదో ఒక రోజు మీతో అంటూ...
బిగ్‌బాస్ వేదిక మీద రాంచరణ్‌ను చూడగానే శ్వేతా వర్మ థ్రిల్ అయిపోయింది. చెర్రీతో మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు మీతో, మీ పక్కన నటించాలని అనుకొంటున్నాను అంటే.. తప్పకుండా అంటూ రెండు థమ్స్ ఆప్స్ సింబల్స్ చూపించాడు. దాంతో పక్కనే ఉన్న నాగ్ స్పందిస్తూ.. పైకి అలా కనిపిస్తున్నది. కానీ చూడటానికి చాలా వైల్డ్ అని అనగానే రాంచరణ్ బెదిరిపోయినట్టు ఫీలింగ్ పెట్టాడు.

దీప్తి సునైనాకు రోజు లవ్ యూ...
ఇక రాంచరణ్‌ను చూసి షణ్ముఖ్ థ్రిల్ అయ్యాడు. లవ్ యూ అంటూ ఏదో చెప్పబోతుండగా.. ఇప్పుడు నీకు లవ్ యూ చెబుతున్నాడు. కానీ రోజు దీప్తికి లవ్ యూ అంటూ మెసేజ్ పంపిస్తున్నాడు అని నాగ్ అనగానే.. అవునా అన్నట్టు రాంచరణ్ ఫోజ్ పెట్టారు. ఇక హమీదాను చూసి హాయ్ అనగానే.. పక్కనే ఉన్న నాగ్ రియాక్ట్ అయ్యాడు. హమీదాను ప్రేమించడానికి శ్రీరామచంద్ర ట్రై చేస్తున్నాడు. కానీ హమీదా మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటూ నాగార్జున వార్తలు చదివాడు.

సార్ రాంచరణ్‌ను లోపలికి పంపండి..
రాంచరణ్‌ను చూసి యాక్టర్ ప్రియ ఎక్సైట్ అయిపోయింది. సార్ లోపలికి పంపించండి సార్.. లోపల రెండు వారాలు ఉంచేద్దామా అని నాగార్జున అనగానే.. అవును సార్.. రెండు వారాలు హ్యాపీగా ఉంచేసుకొంటాం అని ప్రియ అనగానే.. రాంచరణ్ అమ్మ బాబోయ్ అనే విధంగా ఫీలింగ్ పెట్టాడు.
ఇంటి సభ్యులకు నాగార్జున వార్నింగ్
రాంచరణ్ వచ్చిన సందర్భంగా ఇంటి సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు. కానీ ఆనందాన్ని నాగార్జున ఎక్కువ సేపు ఉంచలేదు. డోంట్ బీ హ్యాపీ.. నేను మళ్లీ వస్తాను. మీ అందర్ని సెట్ చేస్తాను అంటూ రాంచరణ్‌ను పంపించేందుకు వెళ్లిపోయారు. దీనిని బట్టి ఈ వారాంతం షో ఘాటుగా ఉండబోతుందనే సంకేతాలను హోస్ట్ నాగార్జున ఇచ్చారు. నాగార్జున ఏం క్లాస్ పీకుతారనే విషయం కోసం ఈ రాత్రి ప్రసారం కాబోయే పూర్తి ఎపిసోడ్‌ను చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











