Bigg Boss Telugu 5 Unseen:శ్వేతా వర్మకు పెళ్లిచూపులు..పెళ్లికొడుకుగా షణ్ముఖ్.. కొంటెచూపులతో కెమిస్ట్రీ అదుర్స్

బిగ్‌బాస్ ఇంటిలో సభ్యుల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు తమ లవ్ ట్రాక్స్ నడిపిస్తూ కంటెంట్ జనరేట్ చేయడానికి కంటెస్టెంట్లు ప్రయత్నిస్తున్నారు. ఇంటిలో శ్వేతావర్మ, షణ్ముఖ్ మధ్య సోమవారం సెప్టెంబర్ 20 ఎపిసోడ్‌లో పెళ్లిచూపులు, రొమాంటిక్ సీన్లు ఆహ్లదకరంగా మారాయి. బిగ్‌బాస్‌కు సంబంధించిన అన్ సీన్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 అందంగా తయారైన శ్వేతావర్మ

అందంగా తయారైన శ్వేతావర్మ

బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో శ్వేతావర్మ, అనీ మాస్టర్‌ది తల్లికూతుళ్ల అనుబంధం. వారిద్దరూ మధ్య మంచి ప్రేమ కనిపిస్తున్నది. ఇంటిలో తనపై ప్రేమను కురిపించే తల్లి దొరికిందని శ్వేతావర్మ పలు మార్లు తన మనసులోని మాటను వ్యక్తం చేసింది. అయితే తాజా ఎపిసోడ్‌లో శ్వేతావర్మ అందంగా ముస్తాబై అనీ మాస్టర్‌తో కూర్చోని ఉండగా.. షణ్ముఖ్ వచ్చి లైన్ వేసేందుకు ప్రయత్నించాడు. శ్వేతావర్మను చూస్తూ ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నది. చాలా బాగా తయారైంది అంటూ షణ్ముఖ్ ఓ రకంగా చూడగా.. ఈ రోజు నీలో ఏదో మార్పు కనిపిస్తున్నదని అనీ మాస్టర్ గ్రహించింది.

మా జోడి ఎలా ఉందని అంటూ..

మా జోడి ఎలా ఉందని అంటూ..

శ్వేతా వర్మకు ఈ రోజు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని అనీ మాస్టర్ అంటే... అవును ఈ ఫోటోను మ్యాట్రిమోనియల్ సైట్‌లో పెడుదాం అంటూ షణ్ముఖ్ కామెంట్ చేశాడు. అంతేకాకుండా శ్వేతావర్మకు పక్కనే నిలబడి తమ జోడి ఎలా ఉందని షణ్ముఖ్ చూసుకొన్నారు. హిల్స్ వేసుకొన్నా ఇద్దరు సమానంగా కనిపిస్తున్నారు అనీ మాస్టర్ అంటే.. మేమిద్దరు బాగా ఉన్నాం కదా అన్నారు. నీవు ఏదో కొంటే చూపు చూస్తున్నావు అని అనీ మాస్టర్ అంటే.. ఈ రోజంతా కొంటె చూపులే అంటూ చిలిపిగా షణ్ముక్ స్పందించాడు.

కొంటే చూపులు సాంగ్‌పై శ్వేతా, షణ్ముఖ్

కొంటే చూపులు సాంగ్‌పై శ్వేతా, షణ్ముఖ్

ఇక శ్వేతావర్మ, షణ్ముఖ్ రొమాన్స్ చూసి వీజే సన్నీ అక్కడికి వచ్చి వారి మధ్యలో దూరేందుకు ప్రయత్నించాడు. ఈ లోగా షణ్ముఖ్, శ్వేతావర్మ రొమాన్స్ చూసి కొంటే చూపుతో.. కొంటే చూపుతో అంటూ అనీ మాస్టర్ పాటపడింది. దాంతో నేను పాట పడుతాను.. మీరు రొమాంటిక్‌గా లుక్స్ ఇచ్చుకొండి.. ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసూకొంటూ ప్రేమగా తలను ఆడించండి అంటూ వీజే సన్నీ సూచనలు ఇచ్చారు. దాంతో వారిద్దరూ ఎదురెదురుగా నడుచుకొంటూ వచ్చి లవ్ ట్రాక్ నడిపించాడు. దాంతో నాకు అల్లుడు దొరికాడు అంటూ అనీ మాస్టర్ అన్నారు.

 4 మిలియన్ల ఫాలోవర్స్ అంటూ..

4 మిలియన్ల ఫాలోవర్స్ అంటూ..

షణ్ముఖ్, శ్వేతా వర్మ మధ్య కెమిస్ట్రీ చూసి నాకు అల్లుడు దొరికిపోయాడు. ఇన్స్‌టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న అల్లుడు నాకు దొరికాడు అంటూ అనీ మాస్టర్ గట్టిగా అరుస్తూ సంతోషంలో మునిగిపోయారు. అయితే షణ్ముఖ్, శ్వేతావర్మకు డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తూ వీజే సన్నీ మధ్యలో దూరిపోతే.. నువ్వు వాళ్లిద్దరి మధ్య దూరకు అంటూ వీజే సన్నీని దూరంగా అనీ మాస్టర్ పంపింది.

 నాకు అల్లుడు దొరికాడు అని అనీ మాస్టర్..

నాకు అల్లుడు దొరికాడు అని అనీ మాస్టర్..

అయితే షణ్ముఖ్, శ్వేతావర్మ లవ్ ట్రాక్‌ ఎపిసోడ్‌ను చూసిన జస్సీ తట్టుకోలేకపోయాడు. శ్వేతావర్మను బాగా చూసుకో అంటూ షణ్ముఖ్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే.. వీజే సన్నీ కామెంట్ చేశాడు. నీవు షణ్ముఖ్‌కు బావమరిది అంటే జెస్సీ నవ్వుతూ కనిపించాడు. దాంతో నాన్ సీరియల్ యాక్టర్.. యాంకర్ కాకుండా షణ్ముఖ్‌కు నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. నాకు అలాంటి అల్లుడు దొరికాడు అంటూ అనీ మాస్టర్ సంతోషంలో మునిగిపోయింది. పెళ్లి చూపులు సీన్ చూసి కాజల్, తదితరులు అబ్బో. వారేవా అంటూ కామెంట్ చేస్తూ కనిపించారు.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
 మూడోవారంలో నామినేషన్‌లో ఐదుగురు

మూడోవారంలో నామినేషన్‌లో ఐదుగురు

ఇదిలా ఉండగా, మూడోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్‌ అత్యంత గందరగోళంగా మారింది. ప్రియా, లహరిషారి, యాంకర్ రవి మధ్య భారీ గొడవ జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వారంలో ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో శ్రీరామచంద్ర, లహరి, ప్రియ, ప్రియాంక, మానస్ ఉన్నారు. ఈ సారి టాప్ సెలబ్రిటీలు నామినేషన్‌‌కు గురికావడం చాలా ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X