twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: ఇంటి కెప్టెన్‌గా జు జూ.. సిరి హన్మంతును ఏడిపించిన షణ్ముఖ్.. అసలేం జరిగిందంటే?

    |

    బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ తర్వాత కెపెన్సీ టాస్క్‌కు పోటీదారులు ఎంపిక కోసం హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి ఆహ్లాదంగా, వినోదంగా సాగింది. ఇంటిలో పెళ్లి చూపులు, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో సాగిన టాస్క్‌లో దాదాపు అందరూ తమ వంతుగా మంచిగా ప్రతిభను చాటుకొన్నారు. అయితే మూడు, నాలుగు వారాల కోసం ఎవరు కెప్టెన్ అయ్యారు? ఎలా కెప్టెన్సీని చేజిక్కించుకొన్నారనే విషయంలోకి వెళితే..

    కెప్టెన్సీ టాస్క్‌లో నలుగురు

    కెప్టెన్సీ టాస్క్‌లో నలుగురు

    హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి ఉత్తమ ప్రతిభను చాటిన జస్వంత్, శ్వేతా వర్మ, శ్రీరామచంద్ర‌ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. సీక్రెట్ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన యాంకర్ రవిని కూడా కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపికయ్యారు. అయితే జస్వంత్, శ్వేతా వర్మ కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపిక కావడం ఆశ్చర్యం కలిగించేలా మారింది. అయితే ఏ ప్రాతిపాదికగా వారిని కెప్టెన్సీ టాస్క్కు తీసుకొన్నారనే విషయం ఫుల్ ఎపిసోడ్ చూస్తే గానీ అర్ధం కాదు.

    స్విమ్మింగ్ టాస్క్‌లో మజా అంటూ

    స్విమ్మింగ్ టాస్క్‌లో మజా అంటూ

    స్విమ్మింగ్ టాస్క్ గురించి షణ్ముఖ్‌తో హమీదా ఖాతూన్ మాట్లాడుతూ.. మనం ఈ టాస్క్‌లో ఉంటే మజా వచ్చేది అంటూ కామెంట్ చేసింది. దానికి అవును మన నిజంగానే మజా ఉండేది అని షణ్ముఖ్ చెబుతుండగా.. వారి మధ్యలో సిరి హన్మంతు దూరింది. మేము మాట్లాడుకొంటుండగా.. నువ్వు ఎందుకు మధ్యలో దూరుతావు అంటూ షణ్ముఖ్ కసురుకొన్నాడు.

    సిరిని ఏడ్పించిన షణ్ముఖ్

    సిరిని ఏడ్పించిన షణ్ముఖ్

    అయినా షణ్ముఖ్ వెంట సిరి హన్మంతు పడుతూ కనిపించింది. నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని సిరి అంటే.. నీకు ప్రాబ్లెం ఏమిటి అని షణ్ముఖ్ అన్నాడు. దాంతో నీవు మాట్లాడకపోతే నేను ఒంటరిగా ఫీలవుతున్నాను అని సిరి అంటే.. ఒంటరిగా ఫీల్ అవ్వు.. పక్కనే జస్వంత్‌తో మాట్లాడుతూ.. నన్ను వదిలేయమని చెప్పు అని షణ్ముఖ్ అన్నాడు. దాంతో నేను నీకు ఏమైనా గర్ల్‌ఫ్రెండ్‌నా అంటూ సిరి అంటే.. నీతో ఫ్రెండ్ షిప్ చేయడం కూడా ఇష్టం లేదు అంటూ షణ్ముఖ్ అనడం అందర్నీ షాక్ గురిచేసింది. షణ్ముఖ్ అలా మాట్లాడటంతో సిరి భోరున ఏడుస్తూ ఇంటిలో కనిపించింది.

    కెప్టెన్‌గా జస్వంత్ పడాల

    కెప్టెన్‌గా జస్వంత్ పడాల

    ఇక తాజాగా అంటే గురువారం రిలీజ్ చేసి ప్రోమో ప్రకారం కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన పోటీలో జస్వంత్ పడాల, శ్వేతా వర్మ, శ్రీరామచంద్ర‌, యాంకర్ రవి పాల్గొన్నారు. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు స్వింగ్ జర స్వింగ్ అని పేరు పెట్టారు. స్విమ్మింగ్ పూల్ ముందు టేబుల్స్ పెట్టారు. స్విమ్మింగ్ పూల్‌లో కొన్ని ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లి టేబుల్‌పై పెట్టాలి. ఎవరైతే ఎక్కువ పెడుతారో.. వారే కెప్టెన్‌గా ఎంపిక అవుతారు.

    Recommended Video

    Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic

    కెప్టెన్సీ టాస్క్‌పై సిరి, ఇంటి సభ్యుల అసంతృప్తి

    అయితే హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి టాస్క్‌లో తాము ఎక్కువ టాలెంట్ చూపించామనే భావనలో కొందరు ఉండటమే కాకుండా అసంతృప్తిని వ్యక్తం చేశారు. శ్వేతా వర్మ, శ్రీరామచంద్ర‌, యాంకర్ రవి గట్టిగానే పోటీ ఇచ్చిన చివరకు విజయం సాధించలేకపోయారు. పోటాపోటీగా సాగిన ఈ టాస్క్‌లో జస్వంత్ పడాల విజయం సాధించినట్టు తెలిసింది. దాంతో మూడు, నాలుగు వారాలకు జస్వంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

    English summary
    Bigg Boss Telugu 5 September 23rd Promo update: jaswanth padala is elected as new captain.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X