Bigg Boss telugu 5: నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో.. యాంకర్ రవికి లోబో వార్నింగ్.. చిన్నోడా తొక్కేస్తారంటూ..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ముగిసాయి. బుల్లితెర ప్రేక్షకులకు హోస్ట్ నాగార్జున అక్కినేని తాజా బిగ్‌బాస్ కంటెస్టెంట్లను పరిచయం చేశారు. పరిచయ కార్యక్రమం సందర్బంగా కంటెస్టెంట్లకు సంబంధించిన ఆడియో వీడియో వీడియోలు ఎమోషనల్‌గా మార్చాయి. ఇప్పటి వరకు బయటి నుంచే చూసిన సెలబ్రిటీల జీవితంలో ఎలాంటి లోతైన విషయాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది. అయితే అలా బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించిన మరుసటి రోజే బిగ్‌బాస్ నామినేషన్ల ఝలక్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

తొలి రోజే నామినేషన్ల ప్రక్రియ

తొలి రోజే నామినేషన్ల ప్రక్రియ

బిగ్‌బాస్ నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్టు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు తెలియజేశారు. వెంటనే కంటెస్టెంట్లు కాస్త షాక్ తిన్నారు. మొదటి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా తొలి రోజే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బిగ్‌బాస్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు, అలాగే నాగార్జున చెప్పినట్టు డివైడ్ అండ్ రూల్ పద్దతిన కంటెస్టెంట్లను విడదీసి.. కంటెంట్‌ను రాబట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్లందరూ

నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్లందరూ

బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టిన వెంటనే కంటెస్టెంట్లు అందరూ వరుసగా లైన్‌లో నిలబడ్డారు. తాజా ప్రోమోలో కనిపించిన ప్రకారం.. విశ్వ, లోబో మధ్య ఏదో గట్టిగానే వాదన జరిగినట్టు కనిపించింది. లోబోను ఉద్దేశించి డోంట్ మైండ్ బ్రో అంటూ యాక్టర్ విశ్వ అనడం కనిపించింది.

యాంకర్ రవితో లోబో ఘర్షణ

యాంకర్ రవితో లోబో ఘర్షణ

నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కక్కొరి కోసం వారి ముందు ప్లాస్టిక్ బ్యాగులు ముందు పెట్టారు. విశ్వతో వాదన తర్వాత తమ ముందు ఉన్న ప్లాస్టిక్ ప్యాకెట్ల మధ్య నుంచి నడుచుకొంటూ లోబో వెళ్లి ఓ ప్యాకెట్ తీసుకొని ముద్దు పెట్టుకొన్నాడు. ఆ తర్వాత షణ్ముఖ్ ప్యాకెట్ పైకి ఎత్తి 20 ఏళ్ల కుర్రాడా.. చిన్న పోరడు అంటూ లోబో పక్కన పడేయడంతో అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత యాంకర్ రవితో నామినేషన్ విషయంలో ఏదో గొడవ జరగడంతో.. నీ యాటిట్యుడ్‌ నీ దగ్గర పెట్టుకో అంటూ లోబో గట్టిగా ఇచ్చారు.

నటరాజ్ మాస్టర్‌తో యాంకర్ రవి వాగ్వాదం

నటరాజ్ మాస్టర్‌తో యాంకర్ రవి వాగ్వాదం

ఇక 19 మంది ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ల విషయంలో తగాదాలు మొదలయ్యాయి. యాంకర్ రవికి, నటరాజ్ మాస్టర్‌కు మధ్య గట్టిగానే డిస్కషన్ జరిగింది. మీరు చాలా స్ట్రిక్టుగా కనిపిస్తున్నారు అంటే.. నేను అలానే ఉంటాను. నాకు నటించడం రాదు అంటూ నటరాజ్ మాస్టర్ జవాబిచ్చాడు. అలాగే వీజే సన్నీ కూడా ఎవరితోనే గట్టిగానే వాదులాడుకొన్నట్టు కనిపించాడు.

వీజే సన్నీ వర్సెస్.. షణ్ముఖ్

వీజే సన్నీ వర్సెస్.. షణ్ముఖ్

తన ఎదుటి కంటెస్టెంట్‌తో వీజే సన్నీ మాట్లాడుతూ.. మనం చేసినా.. మన వెనుక ఏదైనా ఫర్‌ఫెక్ట్ సైన్యం ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికి ఒక సైన్యం వస్తుంది. వీజే సన్నీ మాటలకు స్పందిస్తూ.. షణ్ముఖ్ జస్వంత్.. నాకు అయితే అలాంటి ఫీలింగ్ లేదు అంటూ సమాధానం ఇచ్చాడు. దాంతో వీజే సన్నీ షణ్ముఖ్ ఉన్న ప్యాకెట్‌ను డస్ట్ బీన్‌లో విసిరి కొట్టారు. ఆ తర్వాత సెవెన్ ఆర్ట్స్ సరయు మరో కంటెస్టెంట్ మధ్య వాదన కనిపించింది.

మోడల్ జస్వంత్‌తో యాక్టర్ విశ్వ

మోడల్ జస్వంత్‌తో యాక్టర్ విశ్వ

అలాగే మోడల్ జస్వంత్, యాక్టర్ విశ్వ మధ్య కూడా ఏదో వాదన చోటు చేసుకొన్నట్టు కనిపించింది. పొద్దున ఏదో సంఘటన జరిగింది అంటూ విశ్వ అంటే... మీకు తెలుసా.. ఏం జరిగిందో మీకు తెలుసా? అని మోడల్ జస్వంత్ అంటే.. నేను చెప్పనివ్వు.. అంటూ విశ్వ సమాధానం చెప్పారు. దాంతో ఏదో అనబోగా.. ఆ టోన్‌లో మాట్లాడకు బ్రో అంటూ జస్వంత్‌కు విశ్వ సూచించాడు.

Recommended Video

Legendary Director Raghavendra Rao Releases Pellikuturu Party Trailer
చిన్నోడా తొక్కేస్తారు అంటూ నటరాజ్ మాస్టర్

చిన్నోడా తొక్కేస్తారు అంటూ నటరాజ్ మాస్టర్

ఇక నటరాజ్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ మోడల్ జస్వంత్‌కు ఏదో సూచనలు ఇచ్చాడు. చిన్నోడా.. ఇక్కడ అమాయకత్వంతో ఉంటే నిన్ను తొక్కేస్తారు. కన్ఫార్మ్ అంటూ నటరాజ్ చెప్పాడు. దాంతో మోడల్ జస్వంత్ కంటతడి పెట్టుకొన్నాడు. ఇలా మరికొందరు ప్రియ, హమీదా లాంటి వాళ్లు కూడా ఎమోషనల్‌గా కనిపించారు. ఈ ప్రోమో రాత్రికి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X