Bigg Boss Telugu 5: నటి ప్రియతో లోబో చేసిన పనికి.. సిరి హన్మంతుకు బిగ్‌బాస్ వార్నింగ్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో తన స్వభావానికి తగినట్టే.. ఇంటి సభ్యుల మధ్య తగాదాలతో ముందుకు సాగుతున్నది. బిగ్‌బాస్ ఇంటిలో గేమ్ స్టార్ట్ రెండు రోజులు అయిందో గానీ.. గొడవలు మాత్రం భారీగానే చోటుచేసుకొంటున్నాయి. ఇంటి సభ్యుల తగాదాల మధ్య బిగ్‌బాస్ సూపర్ పవర్ టాస్క్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ టాస్క్‌లో యాక్టర్ విశ్వ, మానస్‌లు పవర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజా ఎపిసోడ్‌లో సూపర్ పవర్‌ను హీరోయిన్ సిరి హన్మంతుకు దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

సిరి హన్మంతుకు సూపర్ పవర్

సిరి హన్మంతుకు సూపర్ పవర్

ఇంటి సభ్యుల గొడవ మధ్య సూపర్ పవర్ టాస్క్ బజర్ మోగడంతో వేగంగా పరుగెత్తి హ్యాండ్ సింబల్‌పై సిరి హన్మంతు చేయి పెట్టి పవర్ హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకొన్నది. సిరి హన్మంతు చేసిన ప్రయత్నాన్ని ఇంటి సభ్యులందరూ అభినందించారు. అలా సిరికి పవర్ హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకొన్నది.

సిరి హన్మంతు బిగ్‌బాస్ అలాంటి టాస్క్

సిరి హన్మంతు బిగ్‌బాస్ అలాంటి టాస్క్

ఇక పవర్ హౌస్‌లోకి వెళ్లిన సిరి హన్మంతుకు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. ఇంటిలోని సభ్యుల్లో ఇద్దరు సభ్యులను ఎంపిక చేసుకోవాలి. ఒకరు యజమానిగా, మరొకరు పనిమనిషిగా వ్యవహరించాలి. కాబట్టి నీవు ఇద్దరు పేర్లు చెప్పాలి అంటూ సిరిని బిగ్‌బాస్ కోరారు. దాంతో షణ్ముఖ్ జస్వంత్, లోబో పేర్లు చెప్పింది. దాంతో పనివాడిగా లోబో, యజమానిగా షణ్ముఖ్ నటించారు.

కడుపుబ్బ నవ్వించిన లోబో

కడుపుబ్బ నవ్వించిన లోబో

ఇక పనివాడిగా లోబో ఇంటి సభ్యులకే కాకుండా ప్రేక్షకులు కూడా మంచి వినోదం అందించాడు. జస్వంత్‌తో అనీ మాస్టర్ గొడవ పడిన సమయంలో ఆమె వ్యవహరించిన తీరును ఇమిటేట్ చేసి నవ్వించాడు. అలాగే నటరాజ్ మాస్టర్‌గా, అలాగే ప్రియాంక సింగ్‌గా నటించి అందర్ని కడుపుబ్బా నవ్వించాడు. అలాగే హిందీలో బిగ్‌బాస్ షో గురించి ర్యాప్ పాడి మరింతగా ఆకట్టుకొన్నాడు.

Recommended Video

Maha Samudram Movie Team On 'Cheppake Cheppake' Song
సిరికి బిగ్‌బాస్ వార్నింగ్

సిరికి బిగ్‌బాస్ వార్నింగ్

ఇదిలా ఉండగా, సిరిని పవర్ రూమ్‌లోకి పిలిచి బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా యజమాని, పనివాడు టాస్క్ సరిగా ఆడటం లేదు. కాబట్టి వారిని సరిగా ఆడేటట్టు చూడండి. ఇది మీకు బిగ్‌బాస్ ఇచ్చే మొదటి హెచ్చరిక అని అన్నాడు. దాంతో బయటకు వచ్చిన సిరి హన్మంతు అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X