నాకు అక్కడ సర్జరీ కామెంట్.. నా పరువు తీసిందంటూ ప్రియపై భగ్గుమన్న హమీదా ఖాతూన్

బిగ్‌బాస్ ఇంటిలో మంగళవారం కూడా నామినేషన్ల గొడవ జరిగింది. ప్రియను టార్గెట్ చేస్తూ కొందరు కంటెస్టెంట్లు కామెంట్లు చేశారు. నటరాజ్ మాస్టర్, జస్వంత్ మధ్య ఘాటుగా గొడవ జరిగింది. అలాగే విశ్వ, నటరాజ్ మాస్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ప్రియ, ప్రియాంకను హమీదా నామినేట్ చేస్తూ ఫైర్ అయింది. ప్రియ చేసిన కామెంట్లను తప్పు పట్టింది. నామినేషన్ల సందర్భంగా ప్రియపై హమీదా చేసిన ఆరోపణలు ఏమిటంటే..

ప్రియను నామినేట్ చేసిన హమీదా

ప్రియను నామినేట్ చేసిన హమీదా


ప్రియను నామినేట్ చేస్తూ ఘాటుగా స్పందించింది. ప్రియ అంటే ఇంటిలో నాకు ఫేవరేట్. ఆమెను చాలా విధాలుగా కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ ఆమె మాట్లాడే మాటలు నన్ను ఎప్పుడూ హర్ట్ చేస్తూనే ఉంటాయి. రెండు రోజుల క్రితం నా శరీరంపై ఎద భాగంపై సర్జరీ మార్కులు ఉంటే వాటిని తీసుకొని నన్ను కామెంట్ చేస్తున్నది. నా బాడీపై కట్స్ ఉంటే సర్జరీ చేసుకొన్నావా అని అడిగింది. ఇంటి సభ్యులతో చర్చిస్తూ ఎప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నది అని నామినేట్ చేయడానికి గల కారణాలను హమీదా చెప్పింది.

నన్ను బాడీ షేమింగ్ అంటూ..

నన్ను బాడీ షేమింగ్ అంటూ..


జాతీయ టెలివిజన్ ఛానెల్లో అలా నా సర్జరీ గురించి డిస్కస్ చేస్తే నా గురించి ప్రేక్షకులు ఏమనుకొంటారు? నన్ను బాడీ షేమింగ్ చేయడం చాలా బాధపడ్డాను అని హమీదా అంటే.. అందుకు ప్రియ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. నీ చెంపలు పట్టుకొంటే బాధ కలిగితే.. ఆ విషయం గురించి ప్రియాంకతో చర్చించాను. ఆమెకు సర్జరీల గురించి ఎక్కవ తెలిసినందునే ఆమెతో ఆ విషయం గురించి మాట్లాడాను. అందుకే నేను అందుకే ఏదైనా సర్జరీ అయిందా అని అడిగాను అని ప్రియ చెప్పింది.

శ్రీరామచంద్రతో క్లోజ్‌గా ఉంటే..

శ్రీరామచంద్రతో క్లోజ్‌గా ఉంటే..

అయితే నీవు మగవాళ్లతో మాట్లాడితే నన్ను అదోలా చూస్తావు. శ్రీరామచంద్రతో క్లోజ్‌గా ఉంటే అదోలా చూస్తావు. ప్రతీ విషయంలో వెకిలి చూపులు, మాటలు మాట్లాడుతుంటావు. నన్ను చిన్న పిల్లవు అని కామెంట్ చేస్తున్నావు. నేను మీ మాదిరిగా నేను పెద్ద సెలబ్రిటీని కాదు. నా కంటు ఓ గుర్తింపు ఉంది కాబట్టి బిగ్బాస్‌లో ఉన్నాను అని ప్రియను హమీదా నామినేట్ చేస్తూ.. గ్లాస్ పగలకొట్టింది.
ప్రియాంకను నామినేట్ చేసిన హమీదా

ప్రియాంకను నామినేట్ చేసిన హమీదా


ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేస్తూ.. నాకు ఫైర్ అంటే భయమని అందరికి చెప్పాను. కానీ కిచెన్‌లో కుక్కర్ పెట్టి నన్ను భయ పెట్టడానికి ప్రయత్నించావు. నేను చెప్పినా కానీ పట్టించుకోకుండా కుక్కర్ ప్రెజర్ నాపై వదిలావు అంటూ ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేసింది. అయితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీవు నన్ను నామినేట్ చేయండి అంటూ ప్రియాంక అంటూ కనిపించింది.

చెండాలమైన రీజన్స్ అంటూ కామెంట్

చెండాలమైన రీజన్స్ అంటూ కామెంట్

హమీదా తనపై చేసిన కామెంట్లకు ప్రియాంక సింగ్ కోపం తెచ్చుకొన్నది. వంట చేసేటప్పుడు అలా చేయడం అనడం దారుణం. నామినేట్ చేయడానికి చాలా సిల్లీ రీజన్స్ చెబుతున్నారు. పనికి మాలిన రిజన్స్, చెండాలమైన రీజన్ ఇస్తున్నారు. ఇది చాలా దారుణం అంటూ ప్రియాంక సింగ్ మండిపడింది. హమీదా చేసిన కామెంట్లను తప్పుపట్టింది. ఇలా ప్రియ, ప్రియాంకతో హమీదా నామినేషన్ గొడవ జరిగింది.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
మూడోవారం నామినేట్ అయింది వీరే...

మూడోవారం నామినేట్ అయింది వీరే...

మూడో వారం నామినేషన్ ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్‌లో ముగిసిందని బిగ్‌బాస్ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యుల్లో లహరి, ప్రియాంక, మానస్, శ్రీరాంచంద్ర, ప్రియ ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ హాట్‌గా మారింది. భారీ వాగ్వాదం మధ్య గొడవ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X