Bigg Boss Telugu 5 unseen.. అర్ధరాత్రి యాంకర్ రవి, లహరి కౌగిలి రచ్చ.. నీవు అతడితో బిజీగా ఉన్నందుకే అంటూ ప్రియ

బిగ్‌బాస్ ఇంటిలో మూడోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల ప్రక్రియ గందరగోళం చోటుచేసుకొన్నది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బద్దలు కొట్టి మీరే చెప్పాలి అనే కాన్సెప్ట్‌లో ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. నామినేషన్ సందర్భంగా ప్రియతో లహరిషారి మాట్లాడుతూ.. డిస్టెన్స్ మెయింటెన్ చేయడాన్ని ప్రస్తావించింది. దాంతో ప్రియ స్పందిస్తూ.. ఎందుకంటే నీవు ఇంటిలో మగాళ్లందరితో బిజీగా ఉంటున్నావు. నువ్వు యాంకర్ రవి, బాత్రూంలో అర్ధరాత్రి కౌగిలించుకొన్నారు.. అది నేను చూశాను అని ప్రియ చేసిన ఘాటైన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఆ వివాదంపై ప్రియ స్పందిస్తూ..

ప్రియ కామెంట్‌పై రవి అసహనం

ప్రియ కామెంట్‌పై రవి అసహనం

ప్రియ చేసిన కామెంట్ గురించి యాంకర్ రవి, షణ్ముఖ్, సిరి హన్మంతు మధ్య చర్చ జరిగింది. ప్రియ గురించి రవి మాట్లాడుతూ.. నిన్న జరిగిన విషయాలకు సారీ చెప్పాలా? అని అడుగుతున్నది. నేను చూసిందే చెప్పానని అంటున్నది. ఎంత చెప్పినా వేరే వేరే పాయింట్స్ పట్టుకొని మరో విధంగా తెలియజెప్పుతున్నది అని యాంకర్ రవి అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే ప్రియ చాలా డిప్రెషన్‌లో ఉంది. ఈ రోజుకు ఆ విషయం ఎత్తకండి అంటూ యాంకర్ రవికి సిరి హన్మంతు చెప్పడం కనిపించింది.

 లహరి షారికి ప్రియ క్షమాపణ

లహరి షారికి ప్రియ క్షమాపణ

అయితే నామినేషన్ల సందర్బంగా తన వ్యాఖ్యలు దుమారం సృష్టించడంతో ప్రియ దాని తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకొన్నది. నిన్న ఏదైతో జరిగిందో దానికి నేను బాధపడుతున్నాను. నేను అన్న మాటలు ఉద్దేశం వేరు. కానీ నేను మరోలా చెప్పాననే ఫీలింగ్ కలుగుతున్నది. మీ అందరి ఫీలింగ్స్ చూస్తే.. నేను చెప్పిన విధానం సరికాదనే భావన కలిగింది. నేను చేసిన వ్యాఖ్యలు లహరి షారికి బాధకలిగించిందని తెలుసుకొన్నాను. అందుకు సారీ అంటూ లహరికి ప్రియ హగ్ ఇచ్చింది.

నా మాటల వెనుక ఉద్దేశం అదే

నా మాటల వెనుక ఉద్దేశం అదే

లహరితో ప్రియ మాట్లాడుతూ. నేను మాట్లాడిన విషయాలు వెనుక మరో ఉద్దేశం లేదు. నాకు అవసరం అయినప్పుడు లహరి అందుబాటులో లేదనే కారణం ఒకటి.. ఇతర సభ్యులతో బిజీగా ఉన్నావనే ఉద్దేశంతో ఆ మాటలు అన్నాను. నా మాటలు సీరియస్‌గా తీసుకోకండి. మీ రియాక్షన్ చూసిన తర్వాత నాకు అసలు విషయం అర్దమైంది అంటూ ప్రియ చెప్పింది. ప్రియ సారి చెప్పడంతో పక్కనే ఉన్న లోబో హ్యాపీ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

నామినేషన్లకు హగ్‌కు సంబంధమేమిటి?

నామినేషన్లకు హగ్‌కు సంబంధమేమిటి?

అలాగే యాంకర్ రవితో మాట్లాడుతూ.. నేను మాట్లాడిన విషయం రాంగ్ వేలో వెళ్లింది. అందుకే ఆ విషయాన్ని నేను మళ్లీ మాట్లాడటం నాకు ఇష్టం లేదని ప్రియ చెప్పింది. అయితే నామినేషన్‌కు ఆ బాత్రూం విషయానికి ఏం సంబంధమని లహరి షారి ప్రశ్నించింది. అంతేకాకుండా నామినేషన్లలో హగ్ బయటకు తీయడం కరెక్ట్ కాదు. నా కెరీర్, లైఫ్‌కు సంబంధించిన విషయమని లహరి ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో ఆ విషయంలో తప్పు జరిగిందని భావిస్తున్నాను. అందుకు సారీ చెబుతున్నాను అని లహరితో ప్రియ చెప్పింది.

 నేను మాట జారాను.. అందుకే అంటూ..

నేను మాట జారాను.. అందుకే అంటూ..

ఆ తర్వాత యాంకర్ రవి, లహరి ఫ్యామిలీకి బిగ్‌బాస్ కెమెరాకు చెబుతూ ప్రియ వివరణ ఇచ్చింది. నామినేషన్ల సందర్భంగా నాకు, రవి, లహరికి మధ్య వాగ్వాదం జరిగింది. లహరి నాతో ఉండటం లేదన్న ఉద్దేశంతో నేను ఓ మాట జారాను. ఆ విషయంలో మరో ఉద్దేశం లేదు. అర్ధరాత్రి లైట్లు ఆర్పిన తర్వాత రవి, లహరి కౌగిలించుకొన్నానని చెప్పాను. వారిద్దరూ ఫ్రెండ్లీగా హగ్ చేసుకొన్నారని, బ్రదర్, సిస్టర్ మాదిరిగా కౌగిలించుకొన్నారనే ఉద్దేశాన్ని కూడా చెప్పాను. ఇప్పుడు నిత్య, లహరి ఫ్యామిలీకి నా వివరణ ఇస్తున్నాను. లహరి, రవి ఫ్యామిలీకి నా క్షమాపణలు అంటూ ప్రియ చెప్పింది.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
నీ మీద నాకు కోపం లేదంటూ లహరి షారి

నీ మీద నాకు కోపం లేదంటూ లహరి షారి

ప్రియ చెప్పిన క్షమాపణను పాజిటివ్ వేలో లహరి తీసుకొన్నది. నీ మీద నాకు కోపం లేదు. నీవు అన్న మాటలే నాకు కోపం తెప్పించాయి. ఇప్పటికీ నీ మాటలనే సీరియస్‌గా తీసుకొన్నాను. అంతేకానీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఎప్పుడు నీకు నా సపోర్ట్ ఉంటుంది. ఈ విషయం ఇంతటితో ముగిద్దాం అని లహరి చెప్పడంతో కౌగిలింత వివాదం ముగిసిపోయింది. అందరూ ఈ ఘటనతో హ్యాపీగా ఫీలయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X