దొంగగా మారిన యాంకర్ రవి.. గుట్టుచప్పుడు కాకుండా ప్రియ వస్తువులు కొట్టేసి..
బిగ్‌బాస్ తెలుగ రియాలిటీ షోలో మూడోవారం కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసేందుకు బిగ్‌బాస్ గేమ్ మొదలు పెట్టారు. పెళ్లి చూపులు గేమ్‌ను టాస్క్‌గా ఇచ్చి ఇంటి సభ్యుల్లో టాలెంట్‌ను వెలికి తీస్తున్నారు. అయితే కెప్టెన్సీ కోసం పోటీ పడటానికి ఇంటి సభ్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ అమ్మాయి... అమెరికా అబ్బాయి.. టాస్క్‌ను వినోదంగా మలిచి పోటీదారులుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే 22వ తేదీ ఎపిసోడ్‌లో ఫన్నీ మూమెంట్స్ ఏం జరిగాయంటే..

శ్రీరామచంద్ర హమీదా, సిరితో లవ్ ట్రాక్
పెళ్లి చూపులు టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు తమకు సంబంధించిన జోడిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంటిలో పెద్ద మనిషిగా లోబోగా, ప్రియ పెండ్లి కొడుకు తల్లిగా , ఆనీ మాస్టర్ పెళ్లి కూతురు తల్లిగా నటిస్తున్నారు. ఇక పెళ్లి కొడుకుగా శ్రీరామచంద్ర, పెళ్లి కూతురుగా లహరి షారీ నటించారు. ఇక శ్రీరామచంద్ర గర్ల్‌ఫ్రెండ్స్‌గా హమీదా, సిరి హన్మంతు నటిస్తున్నారు. పురోహితుడిగా షణ్ముఖ్ నటించారు.

యాంకర్ రవికి సీక్రెట్ టాస్క్
ఇక ఇంటిలో బిగ్‌బాస్ తన స్ట్రాటజీలో జోరు పెంచారు. యాంకర్ రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. సీక్రెట్ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే నేరుగా కెప్టెన్సీ టాస్క్‌కు నేరుగా పోటీదారుడిగా ఎన్నికవుతారు అని చెప్పారు. ఒకవేళ ఫెయిల్ అయితే.. కెప్టెన్సీ పోటీకి అర్హుడి కావు అని చెప్పారు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ప్రియా నెక్లెస్ బాక్స్‌ను దొంగిలించాలి అని టాస్క్ రూల్ చెప్పారు.

ప్రియ నెక్లెస్ బాక్స్ కొట్టేసి..
ఇక పెళ్లిచూపులు టాస్క్‌లో ప్రియ బిజీగా ఉన్న ప్రియ కళ్లు గప్పి నెక్లెస్ కొట్టేశాడు. దాంతో యాంకర్ రవి సీక్రెట్ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా టాస్క్ పూర్తి చేశాడు. అయితే టాస్క్‌లో ప్రియ పూర్తిగా లీనమైపోయింది. శ్రీరాం తల్లి ప్రియను మచ్చిక చేసుకొనేందుకు హమీదా, సిరి ప్రయత్నం చేయడంతో గేమ్ చాలా వినోదంగా మారింది.

హమీదాతో రొమాన్స్
ఒకవైపు శ్రీరామచంద్ర ట్రాక్స్ ఆసక్తిగా సాగింది. తో హమీదా సంభాషణ మరింత ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని హమీదా అంటే.. నా చేతిలో ఏమీ లేదు అని శ్రీరామచంద్ర అన్నారు. హమీదాతో శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. మనిద్దరి ఒకరికి ఒకరు తొడు ఉండకపోవచ్చు. మనం ఎవరితో ఉన్నా నీ మీద నాకు ప్రేమ, నా మీద నీకు ప్రేమ ఉంటుంది అని అన్నాడు.
శ్రీరామచంద్రతో సిరి లవ్లీగా
మరోవైపు శ్రీరామచంద్రతో సిరి మాట్లాడుతూ.. నీకు తెలిసినప్పటి నుంచి నీవు మనం ఫ్రెండ్స్ అనుకొన్నాం. కానీ చిన్నప్పటి నుంచి నేను నిన్ను లవ్ చేస్తూ ఉన్నాను అని సిరి అంటే.. నేను లైఫ్ లాంగ్ లవ్ చేస్తూనే ఉంటాను అని చెప్పాడు. అయితే నాకు ఫ్రెండ్లీ లవ్ వద్దంటూ ఓ దశలో సిరి కంటతడి పెట్టుకొంటే.. వద్దు ఏడవకు అంటూ శ్రీరామచంద్ర కంటతడి తుడుస్తూ కనిపించాడు. ఇలా శ్రీరాం డబుల్ లవ్ ట్రాక్ నడిపించి ఆకట్టుకొన్నాడు. సిరి, హమీదాకు ముద్దుల పెడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
Recommended Video

ప్రియ నెక్లెస్ వెతుకు లాడుతూ..
అయితే ప్రియ తన నెక్లెస్ బాక్స్ కనిపించకపోవడంతో వెతులాడింది. ఇంటి సభ్యుల బెడ్స్ మీద వెతికింది. ఒక బాక్స్ ఉండాలి మీకు కనిపించిందా అంటూ ప్రియాంకను అడిగింది. అయితే ఎక్కడా కనిపించకపోవడంతో వెతుకులాడుతూనే ఉంది. ఇక పెళ్లిచూపుల్లో భాగంగా లహరిషారి, శ్రీరాం పెళ్లి జరగడంతో పెళ్లి టాస్క్ పూ్తి కావడంతో వివాహ సంబురాల్లో అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ అమ్మాయి... అమెరికా అబ్బాయి.. టాస్క్ ముగిసింది అంటూ బిగ్‌బాస్ ప్రకటించారు. దాంతో ఇంటి సభ్యులందరూ హ్యాపీగా ఫీలయ్యారు.


Click it and Unblock the Notifications











