Bigg Boss Telugu 5: ఆ ఇద్దరి చేతికి సూపర్ పవర్స్, నన్ను ఎటాక్ చేస్తున్నావని ఆర్జే కాజల్‌పై లహరి ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో మంగళవారం (సెప్టెంబర్ 7వ తేదీ) ఎపిసోడ్ మంచి రంజుగా సాగింది. భావోద్వేగాలే కాకుండా ఇంటి సభ్యుల మధ్య గొడవలు రచ్చగా మార్చాయి. ఇంటిసభ్యుల్లో ఆవేశకావేశాలు అత్యధిక స్థాయిలో కనిపించాయి. ముఖ్యంగా సిరి హన్మంతు, లోబో మధ్య, అలాగే లహరి షారి, ఆర్జే కాజల్ మధ్య, అలాగే అనీ మాస్టర్, మోడల్ జస్వంత్ మధ్య భారీ స్థాయిలో గొడవలు జరిగాయి. ఇంకా సెప్టెంబర్ 7వ తేదీ ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

పవర్ రూమ్‌లోకి యాక్టర్ విశ్వ

పవర్ రూమ్‌లోకి యాక్టర్ విశ్వ

బిగ్‌బాస్ హౌస్‌లోని పవర్ రూమ్‌లోకి ప్రవేశించడానికి సభ్యులకు టాస్క్ పెట్టారు. పవర్ హౌప్ ముందు ఉన్న హస్తం గుర్తుపై కంటెస్టెంట్ చేయిపెట్టాలి. ఈ టాస్క్‌లో యాక్టర్ విశ్వ విజయం సాధించాడు. దాంతో పవర్ రూమ్ యాక్సెస్ లభించింది. గదిలోకి వెళ్లిన విశ్వతో బిగ్‌బాస్ మాట్లాడుతూ.. ఇద్దరి పేర్లు చెప్పాలి. వారి బట్టలు, వస్తువులు ఏవీ లేకుండా స్టోర్ రూమ్‌లో పెట్టాలని, అలాగే వారిద్దరూ అపోజిట్ జెండర్ బట్టలు వేసుకోవాలని సూచించాడు.

యాంకర్ రవి, ప్రియ బట్టలు మాయం

యాంకర్ రవి, ప్రియ బట్టలు మాయం


విశ్వ టాస్క్‌లో భాగంగా యాంకర్ రవి, ప్రియ పేర్లు చెప్పడంతో వారిద్దరు తమ వస్తువులను స్టోరు రూమ్‌లో పెట్టారు. యాంకర్ రవి లేడిస్ నూడల్ స్ట్రాప్ మ్యాక్సీ వేసుకొని ఉన్నాడు.. ప్రియ మగవాళ్ల బట్టలు వేసుకొని ఉన్నారు. లేడిస్ డ్రస్సులో యాంకర్ రవి బయటకు రాగానే అందరూ నవ్వి ఎంజాయ్ చేశారు.

పవర్ రూమ్‌లోకి యాక్టర్ మానస్

పవర్ రూమ్‌లోకి యాక్టర్ మానస్

ఇక రెండోసారి టాస్క్ బిగ్‌బాస్ నిర్వహించడం, దానిలో యాక్టర్ మానస్ విజయం సాధించాడు. దాంతో పవర్ రూమ్‌లోకి ప్రవేశించే అవకాశం దక్కింది. పవర్ రూమ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఒకరి పేరు చెప్పాలని, మీరు చెప్పే వ్యక్తి ఇంటి సభ్యులు పడుకొనేంత వరకు నిద్ర పోకూడదు. ఇంటి సభ్యులందరూ పడుకొన్న తర్వాత నిద్రపోవాలి. ఎవరైనా లేస్తే వారు ఆమెను నిద్ర లేపాలి. లేచిన వాళ్లు నిద్రపోయేంత వరకు ఆ వ్యక్తి నిద్ర పోకూడదు అని బిగ్‌బాస్ టాస్క్ రూల్స్ చెప్పాడు. దాంతో ఆర్జే కాజల్ పేరును మానస్ చెప్పాడు.

కాజల్‌లో లహరి షారి ఫైట్

కాజల్‌లో లహరి షారి ఫైట్

పవర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన మానస్‌ను లోపల ఏం జరిగిందనే విషయాన్ని అడిగారు. దాంతో టాస్క్ గురించి చెప్పి తాను ఆర్జే కాజల్ పేరు చెప్పానని, అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని ఆర్జే కాజల్‌కు మానస్ నచ్చచెప్పాడు. ఇలా టాస్క్ గురించి చెబుతుండగా.. అప్పటికే లహరికి, ఆర్జే కాజల్‌కు కిచెన్‌లో పని గురించి వాగ్వాదం జరిగింది. కిచెన్ పని చేసే సమయంలో అందరూ ఉండాలని ఆర్జే కాజల్ అంటే.. నీవు హైపర్ ఎందుకు అవుతున్నావని లహరి షారి ఘాటుగా స్పందించింది.

Recommended Video

Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
కంటతడి పెట్టిన కాజల్

కంటతడి పెట్టిన కాజల్

ఆ తర్వాత కూడా ఆర్జే కాజల్, లహరి షారి మధ్య గొడవ కంటిన్యూ అయింది. ఆర్జే కాజల్‌ను ఉద్దేశించిన నన్ను ఎటాక్ చేస్తున్నావు అంటూ లహరి కామెంట్ చేసింది. దాంతో గొడవను సర్ది చెప్పడానికి ఇంటి సభ్యులు ప్రయత్నించారు. జస్వంత్ వచ్చి ఆర్జే కాజల్‌ను పక్కకు తీసుకెళ్లాడు. దాంతో కాజల్ కంటతడి పెట్టుకొని బాధలో మునిగిపోయింది. అయితే ఆర్జే కాజల్ తప్పేమి లేదని యాంకర్ రవి ఓదార్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X