Bigg Boss 5: ఇదే నీ అసలు క్యారెక్టర్.. ఇన్నర్స్ ఎందుకు అలా పడేశావ్.. సిరిపై షన్ను సీరియస్

బిగ్ బాస్ హౌస్ లో గ్రూపు రాజకీయాలు జరగడం సర్వసాధారణం. అయితే ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి రాజకీయాలు ఎక్కువ రోజులు నిలువవు. తప్పకుండా ఏదో ఒక రోజు టాస్క్ లో భాగంగా మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొందరు ముందుగానే ఆ విషయంలో చాలా తెలివిగా అడుగులు వేస్తూ ఉంటారు మొదట స్నేహంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఆట మొదలైన తర్వాత ఒక్కసారిగా రంగులు మార్చేస్తారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో త్రిమూర్తులు గా ఉన్నటువంటి సిరి షన్ను జెస్సి ముగ్గురు కూడా ఆటలో భాగంగా వారి రంగులు మార్చేస్తున్నారు. ముఖ్యంగా అయితే షన్ను సిరి అయితే మేము ఇద్దరం వేరు వేరు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అవసరానికి మాత్రమే..

అవసరానికి మాత్రమే..

బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటి నుంచి కూడా షణ్ముఖ్ జస్వంత్ సిరి ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. బయట వీరికి షూటింగ్ ద్వారా ఏర్పడిన స్నేహం బిగ్ బాస్ హౌస్ లో కూడా అలానే కొనసాగుతోంది అని చాలా మంది కంటెస్టెంట్స్ అయితే కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సిరి పై అయితే చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక వీరి మధ్య లోకి వచ్చిన జెస్సీ చాలా తక్కువ టైంలోనే వారితో బలమైన బాండింగ్ ఏర్పరుచుకున్నాడు. అయితే జెస్సిని మాత్రం ఇద్దరూ అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వినిపించాయి.

ముగ్గురం క్లోజ్ కాదు..

ముగ్గురం క్లోజ్ కాదు..

సిరి షన్ను ఇద్దరూ ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ కూడా జెస్సీ తో మాత్రం వాళ్ల అవసరం ఉన్నప్పుడే వాడుకుంటున్నారు అంటూ ఇతర కంటెస్టెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటీవల వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైనప్పటికి కూడా ఇద్దరూ పట్టించుకోలేదు. ముగ్గురం క్లోజ్ కాదు అని నిరూపించుకోవాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ సిరి టాస్క్ లో భాగంగా మరోసారి వారి పోటీతత్వం చూపించే ప్రయత్నం చేశారు.

అవసరం అయితే నామినేట్ చేసుకోండి..

అవసరం అయితే నామినేట్ చేసుకోండి..

సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విల్లన్స్ టాస్క్ లో భాగంగా సిరి షన్ను ఏమాత్రం స్నేహంగా లేనట్లు కనిపించారు. సంచాలకుడిగా ఉన్న షన్ను జెస్సి మధ్యలో వచ్చిన కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అరుస్తున్నావ్ ఎందుకు అంటూ జెస్సి కూడా షన్నుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను సంచాలక్ కాబట్టి అడుగుతాను అవసరం అయితే నామినేట్ చేసుకోండి అంటూ మరో కౌంటర్ ఇచ్చాడు. ఇక వీరి గోడవపై ఎవరికి కూడా అంతగా నమ్మకం అయితే కలగడం లేదు.

Recommended Video

Naga Shaurya Making Fun | Varudu Kavalenu Team Interview
ఇదే నీ అసలు క్యారెక్టర్

ఇదే నీ అసలు క్యారెక్టర్

సిరి మొదట బెడ్ రూమ్ లోకి వెళ్లి అందరి బట్టలను చిందరవందరగా చేస్తుంది. అందులో కొన్ని లోదుస్తులు ఇన్నర్స్ కూడా ఉంటాయి. వెంటనే షన్ను వచ్చి ఇన్నర్స్ ఎందుకు అలా పడేశావ్.. అన్ని సర్దేసి పెట్టు అంటూ ఆర్డర్ వేశాడు షన్ను. అయినప్పటికీ ఆమె షన్నుని లెక్క చేయకుండా తరువాత చేస్తానని చెప్పింది. ఒత్తిడి చేసినా కూడా నేను చేయను అంటూ సిరి మొండికేసింది. దీంతో సహనం కోల్పోయిన షన్ను ఇదే నీ అసలు కారెక్టర్ అంటూ సిరిని దారుణంగా అవమానించాడు. కంటతడి పెట్టుకున్న సిరి టాస్కుల్లో అయిన గాయాలకంటే.. నువ్ అనే మాటలే ఎక్కువగా బాధపెడుతున్నాయ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X