Bigg Boss 5:నేనంటే నీకు అంత కోపం ఎందుకురా షణ్ముఖ్.. రవి ప్లాన్ తో బొక్కబోర్లా పడ్డ షన్ను గ్యాంగ్

బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయినప్పుడు కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో అయితే జనాలు కొంతవరకు అప్సెట్ అయ్యారనే చెప్పాలి. కానీ బిగ్ బాస్ చాలా తెలివిగా ఆలోచించే సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో విభిన్నమైన స్వభావంను హైలెట్ చేస్తూ సరికొత్త ట్విస్ట్ లతో ఆటను ఆసక్తికరంగా మార్చడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే మొదట రెండు వారాల తర్వాత కొంత బోర్ కొట్టించిన బిగ్ బాస్ షో ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. సరికొత్త టాస్క్ లతో బిగ్ బాస్ ఎప్పటికప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో బాగంగా రవి, షన్ను మధ్యలో కోల్డ్ వార్ మరోసారి బయటపడింది అంతేకాకుండా రవి ప్లాన్ తో షన్ను గ్యాంగ్ అయితే ఒక్కసారిగా బొక్కబోర్లా పడింది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 సన్నీ, రవి హైలెట్ అవుతూ

సన్నీ, రవి హైలెట్ అవుతూ

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా చాలామంది పోటీకి సిద్ధమయ్యారు. అయితే అందులో యాంకర్ రవి సన్నీకి ఒక అరుదైన అవకాశం లభించింది. ఇద్దరూ కూడా రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ లో యువరాజులు కనిపించే అవకాశం దొరికింది. ఒక విధంగా ఈ గేమ్ లో వారే ఎక్కువగా హైలెట్ అయ్యారు. వీలైనంత వరకు కంటెస్టెంట్స్ ను వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

మరోసారి ఎదురుదెబ్బ

మరోసారి ఎదురుదెబ్బ

రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ లో భాగంగా రాజులు నచ్చిన ప్రజలకు నాణేలను ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా చివరికి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారు కెప్టెన్సీ టాస్క్ లో కాస్త ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం ఆటలో మరోసారి సన్నికి ఎదురు దెబ్బ తగిలింది. గత వారమే అతను కెప్టెన్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అవేమీ జరగలేదు.

 ఆటను మార్చేసిన రవి

ఆటను మార్చేసిన రవి

రవి గ్యాంగ్ కు దాదాపు శత్రువు గా మారిన షణ్ముఖ్ జస్వంత్ గ్యాంగ్ చాలా కష్టపడి టాస్క్ లో గెలుస్తూ వచ్చింది. ఒకవిధంగా ఫిజికల్ టాస్క్ లో అయితే సన్నీ టీమ్ చాలా బలంగా పోరాడిందని చెప్పవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఫైనల్ గా ఎవరి దగ్గర ఎంత మంది జనాలు ఉంటే వారే ఈ టాస్క్ లో కెప్టెన్ పోటీకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రవి చివరలో ఆటను మార్చేశాడు. చివరి వరకు కూడా ఎక్కువగా సన్నీ టీమ్ లోనే జనాలు ఎక్కువగా ఉన్నారు. కానీ చివర్లో లోబో రవి టీమ్మ్ లోకి లోకి జంప్ అవడంతో షన్ను గ్యాంగ్ ఒక్కసారిగా బోల్తా పడింది.

హ్యాండ్ ఇచ్చిన లోబో

హ్యాండ్ ఇచ్చిన లోబో

ఎలాగైనా రవి టీమ్ ని ఓడించాలని షణ్ముఖ్ జస్వంత్ జెస్సీ సిరి ముగ్గురు కూడా ఎంతో కసిగా ఆటోలో పాల్గొన్నారు. కానీ సన్నీ అవతలి వారిని ఆకట్టుకునే ప్రయత్నంలో అయితే చాలా ఫెయిల్ అయ్యాడు. ఆఖరికి లోబో కూడా అతన్ని నమ్మించి మోసం చేశాడు. చివరి దశ వరకు సన్నీ తోనే ఉండి.. పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకొని అవసరమైన సమయంలో రవి టీమ్ లోకి జంప్ అయ్యాడు.

నేనంటే నీకు అంత కోపం ఎందుకురా?

నేనంటే నీకు అంత కోపం ఎందుకురా?

ఇక యాంకర్ రవి చివరికి మా రాజుగా గెలిచిన తర్వాత షణ్ముఖ్ అయితే చాలా విభిన్నంగా ప్రవర్తించాడు. నడుచుకుంటూ వెళుతూ ఉంటే రవిని చూసి షణ్ముఖ్ చాలా డిఫరెంట్ గా ఆ భావాలను చూపించాడు. నేనంటే నీకు అంత కోపం ఎందుకురా షణ్ముఖ్.. అని రవి ప్రశ్నించినప్పటికి షన్ను ఏమి పట్టని విదంగా అలాంటిదేమి లేదని ఆన్సర్ ఇచ్చాడు. ఇక రవి చేసేదేమీ లేక లోపలికి వెళ్ళిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X