Bigg boss 5 promo: ఒక్కటైన షన్ను గ్యాంగ్.. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ శ్రీరామ చంద్రపై ఎటాక్!
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతో అట్టహాసంగా మొదలై ఆ తరువాత నెమ్మదిగా నీరసంగా కొనసాగుతోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత రెండు మూడు వారాలుగా బిగ్ బాస్ లో కూడా అంతగా ఆసక్తికరమైన ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదని కంటెస్టెంట్స్ అసలు ఏ విధంగా గేమ్ ఆడుతున్నారు అనే విషయంలో కూడా కన్ఫ్యూజన్ నెలకొంది అంటూ సోషల్ మీడియాలో అయితే బాగానే కామెంట్స్ వస్తున్నాయి.
ఇక శని ఆదివారాల్లో అంతకు మించి ఫన్ ఉంటుంది అనుకుంటే అదే తరహాలో నాగార్జున కూడా డాన్స్ లు రొమాన్స్ అంటూ కాస్త బోరింగ్ తెప్పిస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక 5వ వారం నామినేషన్ ప్రక్రియ మాత్రం కాస్త విభిన్నంగా మొదలైనట్లుగా తెలుస్తోంది. షణ్ముఖ్ జస్వంత్ అయితే ఈ సారి సరి కొత్త ఆట మొదలు పెట్టబోతున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమో ద్వారా అర్థమవుతోంది.

అందరి ఫోకస్ షన్ను పైనే..
బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి బిగ్ బాస్ ప్రత్యేకంగా పవర్ రూమ్ లోకి పిలిచి మరి నామినేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందరూ ఎక్కువగా షణ్ముఖ్ పైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. గత నాలుగు వారాలు కూడా షన్ను నామినేషన్ లో అయితే పెద్దగా రిస్క్ లో పండలేదు. ఈ వారం ఎక్కువ మంది అతనిపైన ఫోకస్ చేశారు.

షన్నును నామినేట్ చేరిన 8 మంది
ఎంతో సన్నిహితంగా ఉన్న వారు కూడా నామినేట్ చేయడంతో షణ్ముఖ్ ఒక్కసారిగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నీతో పాటు విశ్వ లోబో యాంకర్ రవి హామీదా ప్రియా మానస్ శ్రీ రామచంద్ర.. షన్నుని నామినేట్ చేసినట్లు తెలియజేశాడు. దీంతో షన్ను ఫ్లైయింగ్ కిస్ పెడుతూ వింతగా ప్రవర్తించడు. అందరు నన్ను ఎందుకు నామినేట్ చేశారో అని లోపల ఆలోచిస్తూ ఉంటాడు అని సన్నీ అనగా అందుకు విశ్వ ఫస్ట్ వీక్ ఉన్నట్లు ఇప్పుడు లేడు అని సమాధానం ఇచ్చాడు. ఇక షణ్ముఖ్ థాంక్యూ అనుకుంటూ పక్కనుంచి వెళ్ళాడు.

శ్రీరామచంద్రపై షన్ను గ్యాంగ్ ఎటాక్
అంతగా యాటిట్యూడ్ అవసరంలేదని శ్వేత మరోసారి మానస్ పై కోపాన్ని చూపించగా ప్రియాంక కూడా ఎవడికి వాడు గేమ్ అడుగుతున్నాడు అంటూ సీరియస్ గా స్పందించింది. ఇక ఇష్టం ఉన్న పని చేస్తాము అంటే ఎవరి ఫుడ్ వాళ్ళే వండుకోవాలని రూల్ పెడతానని శ్రీ రామచంద్ర అనడంతో షణ్ముఖ్ జస్వంత్ సిరితో కలిసి శ్రీరామచంద్ర తో గొడవకు దిగారు. ఇది మీ హౌస్ కాదు బిగ్ బాస్ హౌజ్ అంటూ గట్టిగానే మాట్లాడాడు. ఇక శ్రీరామచంద్ర ఒక్కసారిగా కోపంతో మొదట ఏం జరిగిందో నీకు తెలియదు అని సమాధానమిచ్చాడు. ఇక షన్ను ఏమాత్రం వినకుండా నేను మధ్యలోనే వస్తాను అంటూ మరో సమాధానం ఇచ్చాడు.

అందరూ వన్ సైడ్ అయ్యారు
ఇక నేను కెప్టెన్ ఏదైనా చెప్తాను అంటే దొబ్బవు అంటూ షన్ను మరోసారి కామెంట్ చేయడంతో మరోవైపు అని మాస్టారు కూడా గ్రూప్ గా వచ్చి ఎటాక్ చేయవద్దని కౌంటర్ ఇచ్చింది. ఇక జస్వంత్ అందరూ వన్ సైడ్ అయ్యారు అంటూ చెప్పడంతో అందుకు సిరి కూడా చేయనివ్వరా అంటూ కోపంగా సమాధానం చెప్పింది. ఇక ఆ తర్వాత కూల్ గా మాట్లాడడానికి వచ్చిన రామచంద్ర నువ్వు నేను చెప్పింది అసలు విన్నావా అంటూ అని షన్నుని అడిగాడు. నా ఫ్రెండ్ ని అడిగితే నేను కూడా అడుగుతాను అంటూ సమాధానం ఇవ్వడంతో శ్రీరామచంద్ర కూడా చాలా అప్సెట్ అయ్యాడు.
Recommended Video

ఇప్పుడు చూస్తార్రా నా గేమ్..
ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అని చెప్పిన శ్రీరామచంద్ర నువ్వు కూడా నాకు ఫ్రెండ్ లాంటి వాడు అని చెప్పినప్పటికీ షణ్ముఖ్ మొండిగా సమాధానం చెప్పాడు. నా బుక్ లో విన్నదే మాట్లాడాలని రూల్ లేదు అని కౌంటర్ కూడా ఇచ్చాడు. దీంతో వీరి మధ్య వైరం హై వోల్టేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. జస్వంత్ సిరి షన్ను ముగ్గురు కలిసి పకడ్బందీగా శ్రీరామచంద్రుని టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక ఇన్ని రోజులు చాలా కూల్ గా వెళుతూ వచ్చినా షణ్ముఖ్ ఇప్పుడు చూస్తార్రా నా గేమ్.. అని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.


Click it and Unblock the Notifications











