Bigg Boss 5: మరోసారి కౌగిలింతలో మునిగిపోయిన సిరి, షన్ను... సారీ అంటూనే కానిచ్చేశారుగా
బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు చాలా వరకు కొన్ని విభిన్నమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. కంటెస్టెంట్స్ ఎంట్రీ విషయంలో ఎవరు కూడా అంతగా సంతృప్తిగా లేరని నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేశారు. గతంలో కంటే ఈసారి చాలా నీరసంగా మొదలవ్వడంతో షో మంచి రేటింగ్ తో ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమే అనే కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి. అయినప్పటికీ బిగ్ బాస్ అద్భుతమైన టాస్క్ లతో షోపై కొంత ఆసక్తిని అయితే పెంచాడు. ఇక రొమాన్స్ విషయంలో అయితే కొన్ని జంటలు రోజురోజుకు డోస్ పెంచుతున్నాయి.
కొన్ని రోజులైతే సెన్సార్ కట్ కూడా మొదలవుతుంది ఆమె విధంగా సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. మరోసారి షన్ను, సిరి పరిస్థితులను మర్చిపోయి ఘాటైన కౌగిలింతలో మ్యూనిగితేలారు.

హోస్టింగ్ పై కూడా ట్రోల్స్
బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల మళ్ళీ నీరసంగా కొనసాగుతోంది అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. అందరికి సమన్యాయం జరగడం లేదని కూడా సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నాగార్జున కంటెస్టెంట్స్ ను ప్రశ్నించే క్రమంలో అస్సలు కరెక్ట్ గా లేడని అంటున్నారు. అసలు నాగ్ బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్నారా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. రేటింగ్స్ తగ్గిన ప్రతీసారి తన హోస్టింగ్ తో మైలేజ్ పెంచిన నాగ్ ఈసారి మాత్రం కొంత నిరాశపరిస్తున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

కెప్టెన్సీ టాస్క్ లో ఆ ముగ్గురు
ఇక బిగ్ బాస్ హౌస్ లో కొందరి మధ్యలో కొనసాగుతున్న కెమిస్ట్రీ మాత్రం ఎవరు ఊహించని విధంగా కొనసాగుతోంది. శన్ముఖ్ జస్వంత్, సిరి అయితే కొన్నిసార్లు వారి ప్రేమను గుర్తు చేసుకొని మరి దగ్గరవుతున్నారు. ఇక మొత్తంగా కెప్టెన్ టాస్క్ లో గేమ్ ముగిసేసరికి మానస్, ప్రియాంక, సిరి, యానీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. దీంతో ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారు అనేది ఆసక్తిగా మారింది. ఇక ప్రెస్టేజ్ 25 వేల గిఫ్ట్ వోచర్ యానీ మాస్టర్ సొంతమయ్యింది.

లవర్స్ ను గుర్తు చేసుకుంటూ
ఇక షణ్ముఖ్ జస్వంత్ అయితే మరోసారి దీప్తి సునయనను గుర్తు చేసుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు అతను దీప్తిని ఊహించుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు సిరి కూడా తన శ్రీహాన్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. అనంతరం సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేపర్ మీద రాసి షన్నుకి ఇచ్చేసింది.

కౌగిలింతలో షన్ను, సిరి
వీరి కెమిస్ట్రీని ఎలా తీసుకోవాలో హౌస్ లో ఎవరికి అర్థం కాలేదు. బయట జనాలు కూడా చాలా వరకు అదే కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతుంది. సిరి చేసిన పనికి కాస్త ఫీల్ అయిన షణ్ను మొత్తానికి సారీ చెప్పి కౌగిలించుకున్నాడు. అనంతరం సిరి కూడా అతడికి హగ్ ఇస్తూనే ఏడ్చేసింది. హగ్ అనంతరం మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మానస్ పై పింకి కామెంట్స్
షన్ను సిరి ట్రాక్ ఒకేలా ఉంటే మానస్ ప్రియాంక ట్రాక్ మరొక విధంగా కొనసాగుతోంది. తనకు ఎవరు అవసరం లేదని చెప్పే పింకి మరోసారి మానస్ పై పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను తనను ఒక ఫ్రెండ్ లా కాకపోయినా మనిషిలా చూసినా చాలు అంటూ ఎంతగానో వేడుకుంది. మరి రానున్న రోజుల్లో వీరి ట్రాక్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











