Bigg Boss 5: పిచ్చోళ్లు మాదిరిగా ఇన్నర్స్ ఎగరేస్తారా? .. సిరి, షణ్ముఖ్ మరో రచ్చ

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎంత క్లోజ్ గా ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో మాత్రం గొడవలు జరగకుండా ఉండవు. స్నేహాలు ప్రేమలు ఈ కాంట్రవర్సీ షోలో ఎప్పుడో ఒకప్పుడు గొడవలుకు దారి తీస్తూనే ఉంటాయి. ఎమోషనల్ గా కనెక్ట్ అయినవారు కొన్ని సందర్భాల్లో చాలా బాధకు గురవుతుంటారు. ఇక ఈసారి సిజన్ లో అలాంటి ఎమోషన్స్ ఎక్కువగా సిరి, షన్ను మధ్యలోనే కనిపిస్తున్నాయి. అసలు వీరి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది ఎవరు ఊహించని విధంగా కొనసాగుతోంది. ముఖ్యంగా షన్ను అయితే సిరి మీద అలకలతో ఆమెను ఎమోషన్స్ తో కొట్టేస్తున్నాడు.

స్పెషల్ బాండింగ్

స్పెషల్ బాండింగ్

సిరి హౌజ్ లోకి రాక ముందే షణ్ముఖ్ జస్వంత్ తో స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. వీరిద్దరూ కలిసి వెబ్ సీరీస్ చేస్తున్నప్పుడే మంచి ఫ్రెండ్స్. ఆ విషయం అందరికి తెలిసిందే. ఇక బిగ్ బాస్ లోకి వచ్చిన తరువాత కూడా వీరి బంధం అదే తరహాలో కొనసాగుతోంది. ఉదయం ప్రేమగా ఉంటూ మళ్ళీ వెంటనే అలకలతో షాక్ ఇస్తున్నారు. ఇక బిగ్ బాస్ కూడా ఎక్కువగా కెమెరాలను వీరి వైపే ఫోకస్ చేస్తున్నాడు.

కెప్టెన్ అవ్వడానికి

కెప్టెన్ అవ్వడానికి

పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సిరి చాలా వరకు షణ్ముక్ వైపు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. షన్ను ఈ వారం కెప్టెన్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఆ విషయంలో అతనికి సిరి హెల్ప్ చేసిన విధానం అందరికి చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. చివరలో కెప్టెన్ అవ్వడానికి సిరికి ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా షన్ను కోసం త్యాగం చేసింది. ఇక వీరి గ్యాంగ్ లో ఉన్న జెస్సి కూడా కనిపించి కనిపించకుండా సహాయం అయితే చేశాడు.

 ఇన్నర్స్ ఉన్నాయని తెలియదా?

ఇన్నర్స్ ఉన్నాయని తెలియదా?

ఇక షన్ను కెప్టెన్ అయిన తరువాత సిరితో కాస్త గొడవలు ఎక్కువగానే కొనసాగిస్తున్నాడు. ఆమెకు మాటలతో చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు. ఇక సిరి సూపర్ హీరోస్ బ్యాచ్ పవర్ తో చాలా బలంగా పోటీ ఇచ్చింది. అయితే ఆమె కొన్ని విషయాల్లో ప్రవర్తించిన విధానం ఎవరికి నచ్చలేదు. ముఖ్యంగా షన్ను అయితే చాలా సీరియస్ అయ్యాడు. బెడ్ రూమ్స్ లోకి వెళ్లి కనీసం ఇన్నర్స్ ఉన్నాయా అని కూడా చూసుకోకుండా చిందరవందరగా పడేసింది. దీంతో షన్ను ఆమె క్యారెక్టర్ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.

Recommended Video

105 Minutes Movie Official Teaser || Hansika Motwani
మొండిగా సమాధానం ఇచ్చిన సిరి

మొండిగా సమాధానం ఇచ్చిన సిరి

అసలు మీరు సూపర్ హీరోస్‌‌ ఆ లేక విలన్స్‌ ఆ అంటూ సిరిపై మాటలతో కౌంటర్ ఇచ్చాడు.. పిచ్చి వారి లాగా ఇన్నర్స్ ఎగరేస్తారా? అంటూ ఏకంగా కాజల్ ముందు పంచ్ వేశాడు. ఇక మరోవైపు విలనిజం అలానే ఉంటుంది అని చెప్పిన సిరి నేను బట్టలే ఎగరేశా.. అందులో ఇన్నర్స్ ఉన్న విషయం నాకు ఏం తెలుసు అంటూ మొండిగా సమాధానం ఇచ్చింది. ఇక ఇల్లు సరిగా లేకపోతే నాగార్జున గారు నాకు క్లాస్ పీకుతారు అంటూ షన్ను మరో ఆన్సర్ ఇచ్చాడు. అంతే కాకుండా నిన్ను ఇన్నర్స్ తీసి లోపల పెట్టమన్నా పెట్టలేదు అందుకే కోపం వచ్చిందని కూడా షణ్ముఖ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X