For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: సిరితో రిలేషన్‌పై షన్నూ ఓపెన్.. రిలేషన్‌లో ఉన్నా కనెక్ట్ అయ్యాం.. సన్నీ కోసం నయా ప్లాన్

  |

  తెలుగు బుల్లితెరపై వినూత్నమైన కాస్పెప్టుతో పరిచయమైనా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోవడంలో విజయం సాధించి నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నిర్వహకులు ఐదో సీజన్‌ను కూడా మొదలెట్టారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఇది కూడా అదే రీతిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇందులో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇక, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. తాజా ఎపిసోడ్‌లో సిరి హన్మంత్ రిలేషన్‌పై ఓపెన్ అయ్యాడు. అలాగే సన్నీ కోసం ఓ స్కెచ్ వేశాడు. ఆ వివరాలు మీకోసం!

  అంచనాలకు తగ్గట్లుగానే చూపిస్తూ

  అంచనాలకు తగ్గట్లుగానే చూపిస్తూ

  గత సీజన్లు విజయవంతం అవడంతో ఐదో దానిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఐదింతలు ఎక్కువగా ఉంటుందని నిర్వహకులు చెప్పారు. అలాగే ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని ఆరంభం నుంచే వాళ్లు ప్లాన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రొమాన్స్, లవ్ ట్రాకులు, ఫైటింగులు, కోల్డ్ వార్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా పలు రకాల సన్నివేశాలను చూపిస్తున్నారు. తద్వారా షోను రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేస్తూ మంచి రేటింగ్ రాబడుతూ దూసుకుపోతోంది.

  Evaru Meelo Koteeswarulu: కోటి గెలిచి చరిత్ర సృష్టించిన ఎస్సై.. ఆయనది ఏ జిల్లా? పూర్తి వివరాలివే!

  టైటిల్ ఫేవరెట్లు.. ఇద్దరూ హైలైట్

  టైటిల్ ఫేవరెట్లు.. ఇద్దరూ హైలైట్


  ఐదో సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది తమ తమ రంగాల్లో ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. అయితే, వీళ్లందరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి కారణం అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి అడుగు పెట్టింది. ఇక, వీళ్లిద్దరూ బయట కూడా స్నేహితులు కావడంతో షో ఆరంభం నుంచే జంటగా హైలైట్ అవుతున్నారు.

  హౌస్‌లో జంటగా.. విమర్శల వర్షం

  హౌస్‌లో జంటగా.. విమర్శల వర్షం

  బిగ్ బాస్‌లో ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతుంది. అందుకే అందులో ఉన్న కంటెస్టెంట్లు చాలా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అలాంటిది షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. హౌస్‌లో వీళ్లిద్దరూ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఈ విషయాన్ని చెప్తూ ఘోరంగా మాట్లాడారు. మరికొందరైతే దారుణమైన పదజాలాన్ని కూడా వాడారు. అలాగే, నెటిజన్లు సైతం వీళ్లను తెగ ట్రోల్ చేసేస్తున్నారు.

  పెళ్లైనా తగ్గని స్టార్ హీరోయిన్: జాకెట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటుగా.. మరీ ఇంత రచ్చ అవసరమా!

  ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదుగా

  ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదుగా

  షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ స్నేహితులు కావడంతో హౌస్‌లో కూడా ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కామెంట్లతో వీళ్లు అప్పుడప్పుడూ దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి కలిసి ఆడుతున్నారు.. ఒక్కోసారి దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి రొమాన్స్ చేసుకుంటున్నారు.. ఒక్కోసారి దూరంగా కనిపిస్తున్నారు. ఇలా వీళ్లు బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేస్తున్నారో.. ఎందుకు అలా ఉంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ, బిగ్ బాస్ నిర్వహకులకు మాత్రం కావాల్సినంత కంటెంట్‌ను ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

  పిచ్చి పిచ్చిగా.. రచ్చ చేసేశారుగా

  పిచ్చి పిచ్చిగా.. రచ్చ చేసేశారుగా

  మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరు ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ కాసేపు రొమాంటిక్‌గా కనిపించారు. ఆ తర్వాత మాత్రం గొడవ పడ్డారు. ఆ సమయంలో సిరి ఏకంగా బాత్రూంలో దూరిపోయి నానా హడావిడి చేసింది. అంతకు ముందు షణ్ముఖ్‌కు దిష్టి తగులుతుందని బ్యాండ్‌ను ఇచ్చిన ఆమె.. దానికి తన రక్తాన్ని రాసి ఓవర్ యాక్టింగ్ చేసింది. అలాగే, షణ్ముఖ్ కూడా కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని ఇప్పటికి గ్రహించాడు. దీంతో జాగ్రత్తగా ఉండాలని సిరికి సూచనలు చేశాడు.

  హాట్ షోలో బౌండరీ దాటేసిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో మొత్తం కనిపించేలా ఘాటు ఫోజు

  సిరితో రిలేషన్‌లో షణ్ముఖ్ ఓపెన్

  సిరితో రిలేషన్‌లో షణ్ముఖ్ ఓపెన్


  బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే షణ్ముఖ్ జస్వంత్ ఒకరితో, సిరి హన్మంత్ ఒకరితో రిలేషన్‌లో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే, హౌస్‌లో మాత్రం వీళ్లిద్దరే లవర్స్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే వీళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సిరితో ఉన్న రిలేషన్‌లో షన్నూ ఓపెన్ అయ్యాడు. శ్రీరామ చంద్రతో మాట్లాడుతూ.. 'సిరి ఒక‌రితో రిలేష‌న్‌, నేనొక‌రితో రిలేష‌న్‌లో ఉన్నాం.. కానీ హౌస్‌లో మేమిద్ద‌రం ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాం.. అదే నాకు స‌మ‌స్య‌గా మారింది. మెంట‌ల్‌గా చాలా డిస్ట‌ర్బ్ అవుతున్నా' అని చెప్పుకొచ్చాడు.

  RRR రికార్డుల కోత Indian Cinema History లోనే మొదటగా | వరల్డ్ వైడ్ Record || Filmibeat Telugu
  సన్నీ కోసం షన్నూ నయా ప్లాన్స్

  సన్నీ కోసం షన్నూ నయా ప్లాన్స్

  మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో సన్నీ గురించి షణ్ముఖ్, సిరి మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఆ సమయంలో ఇద్దరూ హౌస్‌లో ఏం జరుగుతుందన్న దానిపై మాట్లాడుకున్నారు. అప్పుడు షన్నూ 'ఇక నుంచి సన్నీని నువ్వు అన్నయ్య అని పిలువు. అలా చేస్తే ఇక నుంచి నిన్ను తిడతాడో లేదో.. ఏలా పడితే అలా మాట్లాడతాడో లేదో చూస్తా' అంటూ సిరికి సలహా ఇచ్చాడు. దీనికి ఆమె కూడా ఓకే అన్నట్లుగా మాట్లాడింది. మొత్తానికి ఎమోషనల్‌గా చేసి స్ట్రాంగ్‌గా ఉన్న సన్నీ గేమ్‌ను చెడగొట్టేందుకు షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు కొత్త ప్లాన్ వేసినట్లు కనిపించింది.

  English summary
  Bigg Boss is the Telugu Top Reality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Shanmukh Jaswanth Clarity about Siri Hanmanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X