For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షణ్ముఖ్‌లో మొదలైన భయం.. ఆమె గుర్తు రావడం వల్లేనంటూ మేటర్ లీక్ చేసేశాడుగా!

  |

  తెలుగులో ప్రసారం అయ్యే వాటిలో మిగిలిన షోలతో పోలిస్తే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తోంది. అందుకే అన్ని షోలలా మామూలుగా దీని ప్రయాణం సాగడంలేదు. ప్రతి సీజన్ ఒకదానికి మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అందుకే ఇది విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఐదో సీజన్ కూడా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందులో ఎంతో మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వగా.. వారిలో షణ్ముఖ్ జస్వంత్ మాత్రం టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అతడు పర్సనల్ మేటర్ లీక్ చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   ఒకేసారి అంతమందితో సందడిగా

  ఒకేసారి అంతమందితో సందడిగా

  బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు ఉన్నారు.

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఎంట్రీ

  టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఎంట్రీ

  బిగ్ బాస్ ఐదో సీజన్‌కు కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో షణ్ముఖ్ జస్వంత్ మాత్రం టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా హౌస్‌లోకి ప్రవేశించాడు.

  స్క్రీన్ స్పెస్ లేకపోవడంతో నిరాశ

  స్క్రీన్ స్పెస్ లేకపోవడంతో నిరాశ

  బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమై నాలుగు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. ఆరంభం నుంచి ఇది ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. నామినేషన్స్ టాస్కులో గొడవలతో షో మరింతగా రక్తి కట్టేసింది. ఆ తర్వాత కూడా ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయ్యాయి. ఇక, మొదటి రెండు రోజులు మాత్రం షణ్ముఖ్ జశ్వంత్‌కు పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

  రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!

   సిరి విజయం... షణ్ముఖ్‌కు టాస్కు

  సిరి విజయం... షణ్ముఖ్‌కు టాస్కు

  ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ శక్తి చూపరా డింభకా అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓ కంటెస్టెంట్‌గా సిరి హన్మంత్ విజయం సాధించింది. దీంతో బిగ్ బాస్ ఆమెకు కంటెస్టెంట్లు అందరిలో ఒకరు ఓనర్, మరొకరు సర్వెంట్‌గా ఉండాలన్న టాస్క్ ఇచ్చాడు. దీనికామె షణ్ముఖ్‌ను ఓనర్‌గా, లోబోను సర్వెంట్‌గా ఉండమని చెబుతుంది. దీంతో షన్నూ హైలైట్ అయ్యాడు.

  సిరికి హెచ్చరిక.. షణ్ముఖ్ గట్టిగానే

  సిరికి హెచ్చరిక.. షణ్ముఖ్ గట్టిగానే

  షణ్ముఖ్‌ను ఓనర్‌గా, లోబోను సర్వెంట్‌గా ఉండమని సిరి హన్మంత్ చెప్పిన తర్వాత వాళ్లిద్దరూ కాసేపు అలాగే వ్యవహరించారు. కానీ, ఆ తర్వాత మామూలుగా ఉండిపోయారు. దీంతో బిగ్ బాస్ వాళ్లను సరిగా ఆడించమని సిరిని హెచ్చరించాడు. ఈ విషయం చెప్పగానే షణ్ముఖ్‌ మరింతగా రెచ్చిపోయాడు. దీంతో లోబోను సర్వెంట్‌గా చూస్తూ ఎన్నో రకాల టాస్కులు ఇచ్చి విసిగించాడు.

  ఆ కంటెస్టెంట్‌కు నాగబాబు సపోర్ట్: బిడ్డ లాంటి వాడంటూ కామెంట్.. అభిజీత్ గెలిచినట్లే తను కూడా!

   లోబో విషయంలో షణ్ముఖ్ భయం

  లోబో విషయంలో షణ్ముఖ్ భయం

  యజమాని పాత్రను చేస్తోన్న షణ్ముఖ్‌ జస్వంత్.. టాస్కులో భాగంగా లోబోకు ఆడవాళ్ల వేషం వేయించాడు. అలాగే, కెమెరాల దగ్గరకు వెళ్లి ఐలవ్యూ చెప్పమన్నాడు. ఇది జరిగిన తర్వాత రవి దగ్గర ‘నాకు ఎందుకో లోబో ఫీల్ అవుతున్నాడని అనిపిస్తుంది. కొంచెం తగ్గించాలని అనుకుంటున్నా. నువ్వు కూడా సలహాలు ఇవ్వకు బ్రో' అంటూ చెప్పి తెగ భయపడిపోయాడతను.

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
   ఆమె గుర్తు రావడం వల్లేనని చెప్పి

  ఆమె గుర్తు రావడం వల్లేనని చెప్పి

  హౌస్‌లోకి కంటెస్టెంట్ల గురించి సిరి, కాజల్ దగ్గర ఓపెన్ అయ్యాడు షణ్ముఖ్. ఆ సమయంలో ఉమాదేవి తనతో మాట్లాడడం లేదని.. ఆమె చాలా కోపంగా ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, వాస్తవానికి ఆమెను మొన్న నామినేట్ చేయ్యాలని అనుకున్నా.. తన తల్లి పేరు కూడా అదే (ఉమ) కావడంతో వదిలేశానని చెప్పాడు. ఇక, వచ్చే వారం నామినేట్ చేస్తాడేమో చూడాలి.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Shanmukh Jaswanth Comments on Lobo and Umadevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X