Bigg Boss Telugu 5: షోలో తొలిసారి ఏడ్చిన షణ్ముఖ్.. సిరితోనే కాదు ఆమెతో కూడానా.. మొదలైన అనుమానాలు

సంచనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటున్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే మన భాషలోకి పరిచయం అయిన దీనికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా జాతీయ స్థాయిలో రికార్డులు కొట్టేంత రేటింగ్ దక్కింది. దీంతో నాలుగు సీజన్లను నిర్వహకులు నిర్వఘ్నంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఐదో దాన్ని కూడా మొదలు పెట్టారు.

దీనికి సైతం మంచి స్పందనే వస్తోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన షణ్ముఖ్ జస్వంత్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఎప్పుడూ సిరి హన్మంత్‌తోనే కనిపించే అతడు.. తొలిసారి అలా ఉండడంతో సందేహాలు వస్తున్నాయి. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఆసక్తికరంగా సాగుతూ.. భారీ రెస్పాన్స్

ఆసక్తికరంగా సాగుతూ.. భారీ రెస్పాన్స్

ఆది నుంచే బిగ్ బాస్ ఐదో సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు ఇందులో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. వీటికి తోడు నామినేషన్స్ టాస్కును రంజుగా మారేలా ప్లాన్ చేయడంతో ఎక్కువగా గొడవలు కనిపిస్తున్నాయి.

అలాగే, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌కు కూడా ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఫలితంగా రేటింగ్‌లో దుమ్ముదులిపేస్తూ ముందుకు దూసుకెళ్తోంది.

19 మంది.. టైటిల్ ఫేవరెట్లలో ఒకడు

19 మంది.. టైటిల్ ఫేవరెట్లలో ఒకడు

ఎన్నో అంచనాలతో మొదలైన తాజా సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడమే. అందుకు అనుగుణంగానే షణ్ముఖ్ జస్వంత్‌కు పలువురు సెలెబ్రిటీలు సైతం సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అతడికి అనుకూలంగా పోస్టులు చేస్తున్నారు.

వాళ్లంతా స్పీడుగా.. అతడు మాత్రమే

వాళ్లంతా స్పీడుగా.. అతడు మాత్రమే

టైటిల్ ఫేవరెట్ కంటెండర్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరీ ముఖ్యంగా టాస్కుల్లో వందకు వంద శాతం మానసికంగా, శారీరకంగా శ్రమిస్తున్నాడు. తద్వారా కొన్నింటిలో విజయం కూడా సాధించాడు. ఇలా క్రమంగా మిగిలిన వాళ్ల స్పీడును అందుకునేందుకు ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాడు.

ఆమెతోనే ఉంటూ.. వాళ్లు టార్గెట్ చేసిc

ఆమెతోనే ఉంటూ.. వాళ్లు టార్గెట్ చేసిc

షోలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదటి వారం వెళ్లిపోయిన సరయు వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారంటూ నిందించింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలను సైతం షేర్ చేసింది. ఆ తర్వాత ఉమాదేవి అయితే వీళ్లిద్దరూ పక్కపక్కనే పడుకుంటారని, అలాంటప్పుడు రావడం ఎందుకని విమర్శించింది. ఇక, లహరి కూడా వీళ్లు జంటగానే ఆడుతుంటారని ఆరోపించింది. దీంతో ఆమెను దూరం పెట్టి.. మళ్లీ దగ్గరయ్యాడు షణ్ముఖ్ జస్వంత్.

ఆరో వారం హౌస్ నుంచి శ్వేత ఔట్

ఆరో వారం హౌస్ నుంచి శ్వేత ఔట్

బిగ్ బాస్ హౌస్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదాలు ఎలిమినేట్ అయిపోయారు. ఇక, ఆరో వారానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో లోబో, వీజే సన్నీ, ప్రియాంక, రవి, విశ్వ, శ్రీరామ్, షణ్ముఖ్, జస్వంత్, శ్వేతా వర్మ, సిరి హన్మంత్‌లు ఉన్నారు. వీళ్ల నుంచి ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో శ్వేత వర్మ ఎలిమినేట్ అయిపోయింది. మంచిగా ఆడుతున్నా ఆమె వెళ్లిపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

షోలో తొలిసారి ఏడ్చేసిన షణ్ముఖ్

షోలో తొలిసారి ఏడ్చేసిన షణ్ముఖ్

బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లు అన్ని రకాల ఎమోషన్స్ చూపిస్తూ ఉంటారు. బిగ్ బాసే వాళ్లతో అలా చేయిస్తుంటాడు. అయితే, షణ్ముఖ్ జస్వంత్ మాత్రం ఇప్పటి వరకూ ఎప్పుడూ అతిగా వ్యవహరించలేదు. ఇప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటూ వచ్చాడు. మధ్యలో కొన్ని గొడవల్లో భాగం అయినా ఓవర్ యాక్షన్ మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ్ జస్వంత్ ఓ రేంజ్‌లో ఎమోషనల్ అయ్యాడు. ఏడుపును ఎంత కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నా.. కన్నీళ్లు మాత్రం ఆగలేదు. దీంతో ఇది బాగా హైలైట్ అయింది.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
ఆమెతో కూడా.. అనుమానాలు స్టార్ట్

ఆమెతో కూడా.. అనుమానాలు స్టార్ట్

షణ్ముఖ్ జస్వంత్ ఏడవడానికి కారణం శ్వేతా వర్మ ఎలిమినేట్ అవడమే. అవును.. చివర్లో సిరి హన్మంత్.. శ్వేతా వర్మ ఉన్నప్పుడు ఒకరు సేఫ్ అయి.. మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఆ సమయంలో తన ఫ్రెండ్ సేఫ్ అయినందుకు షన్నూ ముందుగా సంతోషించాడు. ఆ తర్వాత శ్వేతను చూస్తూ ఎమోషనల్ అయిపోయాడు. దీంతో ఎప్పుడూ సిరితోనే ఉండే షణ్ముఖ్‌కు శ్వేతతో కనెక్షన్ ఎక్కడ కుదిరింది అని అంతా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న సన్నివేశాలను ఎందుకు చూపించలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X