Bigg Boss: షోలో ఊహించని పని చేసిన షణ్ముఖ్.. ఇప్పుడే పోసుకుని వచ్చా.. దమ్ముంటే కొట్టు అంటూ!
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాలు వస్తున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పటి ప్రేక్షకులు అభిరుచిని మార్చుకోవడంతో ఇలాంటివి కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అయితే, అందులో అన్నీ సక్సెస్ కావడం లేదు. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందిస్తున్నారు. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిందీ షో. ఇక, గత నెలలో మొదలైన ఐదో సీజన్ కూడా అంచనాలకు అనుగుణంగానే సాగుతోంది. ఇందులో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

ఐదు రెట్లు ఎక్కువ చూపించే దిశగా
తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోన్న షోలలో మన బిగ్ బాస్ ఒకటి. అందుకే ఇది ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్పందన వస్తుంది. అందుకే ఈ సారి ప్రసారం అవుతోన్న సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎక్కువ ఎమోషన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైటింగ్స్‌తో నడుపుతూ మరింత ఆసక్తికరంగా చూపిస్తున్నారు.

చాలా మంది ఉన్నా.. అతడికే క్రేజ్
ఎన్నో అంచనాలతో వచ్చిన ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇందులో సోషల్ మీడియా స్టార్ ఐదో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం అతడికి బయట భారీ ఫాలోయింగ్ దక్కడమే.

అప్పుడు విమర్శలు.. ఇప్పుడు ఇలా
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడంతో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. అనుకున్న రీతిలో హైలైట్ అవడం లేదనే చెప్పాలి. మొదట చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫలితంగా ఆరంభ వారాల్లో అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తూ టాస్కుల్లో తన సత్తాను చూపిస్తున్నాడు.

నిత్యం ఆమెతోనే.. ఘోరంగా ట్రోల్స్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి షణ్ముఖ్ జస్వంత్.. మరో కంటెస్టెంట్ సిరి హన్మంత్‌తో ఎంతో చనువుగా ఉంటున్నాడు. బయట కూడా వీళ్లిద్దరూ స్నేహితులు కావడంతో.. హౌస్‌లోనూ జంటగానే కనిపిస్తున్నారు. ఎప్పుడూ పక్క పక్కనే ఉంటూ విమర్శల పాలవుతున్నారు. దీంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం వీళ్లపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ కెప్టెన్‌గా.. మార్క్ చూపాలి
గత వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో షణ్ముఖ్ జస్వంత్ విజయం సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్కులో సైతం చక్కని ఆటతీరుతో గెలుపొందాడు. తద్వారా బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో తన సత్తాను హౌస్‌మేట్లతో పాటు ప్రేక్షకులకు చూపించాడు. ఆ వెంటనే కెప్టెన్‌గా సక్సెస్ అవడం కోసం అందరూ సహకరించాలని పేరు పేరునా కోరుకున్నాడు.

పూరీల టాస్క్.. షణ్ముఖ్ వర్సెస్ సన్నీ
ఈ వారం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ పూరీల టాస్క్ ఇచ్చాడు. ఇందులో సభ్యులను రెండు టీమ్‌లుగా పెట్టి వేగంగా పూరీలు చేసిన వాళ్లే విజేతలు అని చెప్పాడు. దీనికి సంచాలకుడిగా హౌస్ కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడు. ఇక, ఇందులో త్వరగా పూరీలు చేసిన వాళ్లను కాదని.. క్వాలిటీగా చేసిన వాళ్లను విజేతగా ప్రకటించాడు. అప్పుడు సన్నీ.. షణ్ముఖ్ మీద ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు.
Recommended Video

పోసుకుని వచ్చా.. దమ్ముంటే కొట్టు
జైలులో ఉన్న సన్నీ మాట్లాడగా.. అతడితో ఆనీ మాస్టర్ గొడవ పడింది. అప్పుడు సంచాలకుడు షణ్ముఖ్ విడదీయాల్సింది పోయి నవ్వుతూ కూర్చున్నాడు. దీంతో సన్నీ ఇదే విషయంపై అతడితో గొడవ పడ్డాడు. అప్పుడు షన్నూ 'వామ్మో భయం వేస్తుంది.. ఇప్పుడే పోసుకుని వచ్చా.. నీ భయానికి మళ్లీ పోసుకుని వస్తా.. దమ్ముంటే కొట్టు' అంటూ వింతగా ప్రవర్తించాడు.


Click it and Unblock the Notifications











