Bigg boss telugu: సైలెంట్ గా గేమ్ చేంజ్ చేస్తున్న షన్ను.. కన్నింగ్ ఐడియా క్లిక్కయితే తిరుగేలేదు!

బిగ్ బాస్ హౌస్ లో ఎంత తెలివిగా అడుగులు వేయాలని అనుకున్నా కూడా కొన్నిసార్లు వేసిన ప్లాన్స్ రివర్స్ అవుతూ ఉంటాయి. అయితే ఓపికతో ప్రణాళికల అమలులో పెట్టిన వారే పై చేయి సాధిస్తారు. ప్లాన్ లో ఉన్నట్లు ఏ ఒక్క వ్యక్తికి తెలిసిన కూడా అది భవిష్యత్తులో తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హౌస్లో ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్నవారు కూడా ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో శత్రువులు గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కూడా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లాలి. ఆ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ కాస్త తెలివిగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. అమాయకంగా ఉంటూనే ఆటను మొత్తం తనదైన శైలిలో మారుస్తున్నాడు. ప్రస్తుతం అతను వేసిన చిన్న కన్నింగ్ ఐడియా క్లిక్కయితే మాత్రం యాంకర్ రవి, కాజల్, శ్రీరామచంద్ర, మానస్ వంటి పవర్ ఫుల్ కంటెస్టెంట్స్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 విశ్వ ఆ దారిలో..

విశ్వ ఆ దారిలో..

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎంత గట్టిగా పోరాడిన కూడా ఫైనల్ గా నామినేషన్స్ లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గొడవ పడిన కూడా ప్రత్యర్థిని మళ్లీ స్నేహితుడిగా మార్చుకునేలా ప్రణాళికలు వేస్తూ ఉండాలి. కొంతమంది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి కొందరు వారి ఆటిట్యూడ్ తో దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక హౌస్ లో ప్రస్తుతం విశ్వ అయితే ఎక్కువ ఎమోషనల్ గా కంటెస్టెంట్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

 భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు

భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు

అయితే ఎమోషనల్ కంటెంట్ అనేది ఎప్పుడూ కూడా అంతగా వర్కవుట్ అవ్వదు. ఏమాత్రం తేడా కొట్టినా కూడా నామినేషన్ లో ఈజీగా తెలిసిపోతుంది. మొదట ఎమోషనల్ గా ఉండి ఆ తర్వాత నామినేషన్స్ లో సీరియస్ అయితే అతని క్యారెక్టర్ లేదు అనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తాయి. ఆడియన్స్ దృష్టిలో కూడా ఆ కంటెస్టెంట్ తక్కువ స్థాయిలో కి వెళ్ళి పోతాడు. విశ్వ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రమే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

షణ్ముఖ్ మైండ్ గేమ్

షణ్ముఖ్ మైండ్ గేమ్

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఆట ఎలా ఉన్నా కూడా షణ్ముఖ్ మాత్రం సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు అతను ఎక్కువగా అయితే ఎవరికీ కనెక్ట్ అవ్వడం లేదు. కానీ ఎవరైనా బాధపడితే మాత్రం వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. రీసెంట్ గా సింగర్ రామచంద్ర తో మాట్లాడిన కొన్ని మాటలతో అతను ఆలోచనా విధానం జనాలకు అర్థం అవుతోంది. తెలియకుండానే తాను ఇతరుల మాటలు వింటున్నను అని చివరికి అదే తీవ్ర ప్రభావం చూపిస్తోందని శ్రీరామచంద్ర నుంచి పాజిటివ్ గా కామెంట్స్ అందుకున్నాడు.

తనకు తానే రాక్షసుడిగా

తనకు తానే రాక్షసుడిగా

రీసెంట్ గా సన్నీ సిరి టీ షర్ట్ లో చేయి పెట్టాడని షణ్ముఖ్ నింద వేసిన విషయం తెలిసిందే. నాగార్జున ముందు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే మళ్లీ వీడియోలో సన్నీ తప్పు ఏమీ లేదని తెలియడంతో ఒక్కసారిగా తలదించుకోవాల్సి వచ్చింది. ఇక రాక్షసుడు ఎవరు అని అన్నప్పుడు తనకు తానే రాక్షసుడిగా స్టిక్కర్లు అతికించికున్నాడు. మళ్ళీ ఆ తప్పును తన వైపుకు తిప్పుకోకుండా వేరే వాళ్ళ వలలో పడ్డట్లు ఎక్కువగా హైలెట్ చేస్తున్నాడు. ఆ విషయంతో ఆడియన్స్ తో పాటు ఇంట్లో కొంతమందిని బాగానే ఎట్రాక్ట్ చేసింది.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
ఇన్‌ఫ్ల్యూయేన్స్ ప్లాన్..

ఇన్‌ఫ్ల్యూయేన్స్ ప్లాన్..

తనకు తెలియకుండానే ఇతరుల మాటలు నమ్మేస్తున్నాను అంటూ అదే విషయాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. షణ్ముఖ్ జస్వంత్ ఇప్పటి వరకు ఇంట్లో ఎవరితోనూ పెద్దగా గొడవలు అయితే పెట్టుకోలేదు. అందరిలో అతను కూల్ బాయ్ అనేలా క్రేజ్ అందుకుంటున్నాడు. అప్పుడప్పుడు హామీదా శ్వేతా వంటి వారితో కూడా రొమాంటిక్ ట్రాక్ ను ఫాలో అవుతున్నాడు. ఏదైనా కూడా షన్ను అటు ఎమోషనల్ గా కాకుండా ఇటు సీరియస్ గా కాకుండా చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో ప్రైవేట్ గా కూర్చొని మాట్లాడుతున్నాడు. అది అతనికి బాగా కలిసి వస్తోంది. వేరే వాళ్ల మాటలతో ఇన్‌ఫ్ల్యూయేన్స్ అవుతున్నాను అని చెబుతున్నాడు. కానీ అతనే ఆ మాటతో ఇతరులను ఇన్‌ఫ్ల్యూయేన్స్ ఎక్కువగా చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఆ ప్లాన్ ఎంత వరకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X