Bigg Boss: షణ్ముఖ్ నేషనల్ రికార్డ్.. బిగ్ బాస్‌లో చరిత్రలో తొలిసారి.. అదే జరిగితే విన్నర్ అతడే!

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించడం వల్లే ఇది సక్సెస్ అయింది. ఈ ఉత్సాహంతోనే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు నిర్వహకులు.

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh Unstoppable | VJ Sunny Rampage | Filmibeat Telugu

ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో సాగుతోంది. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు ట్విట్టర్‌లో సునామీ సృష్టించారు. దీంతో అతడి పేరిట ఏకంగా నేషనల్ రికార్డే నమోదైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

గ్రాండ్ ఫినాలేలో తలపడేది ఎవరు?

గ్రాండ్ ఫినాలేలో తలపడేది ఎవరు?

ఐదో సీజన్‌లో మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఏడుగురు కంటెస్టెంట్లలో టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే వాళ్లు ఎవరన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరికి తోచిన పేర్లను వాళ్లు వినిపిస్తున్నారు.

అదే సమయంలో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కూడా పోటాపోటీగా టాస్కులు ఆడుతున్నారు. ఇక, ఈ వారం జరిగిన 'టికెట్ టు ఫినాలే' టాస్కులో శ్రీరామ చంద్ర విజయం సాధించి ఫినాలేకు అర్హత సాధించాడు. దీంతో ఆరుగురిలో నలుగురు మాత్రమే తుదిపోరులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు

భారీ అంచనాలతో మొదలైన ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడమే. అందుకు అనుగుణంగానే షణ్ముఖ్ జస్వంత్‌కు పలువురు సెలెబ్రిటీలు సైతం సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

నెమ్మదిగా మొదలు పెట్టి స్ట్రాంగ్‌గా

నెమ్మదిగా మొదలు పెట్టి స్ట్రాంగ్‌గా

తాజా సీజన్‌లోకి టైటిల్ ఫేవరెట్‌గా షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు.

మరీ ముఖ్యంగా టాస్కుల్లో వందకు వంద శాతం మానసికంగా, శారీరకంగా శ్రమిస్తున్నాడు. తద్వారా కొన్నింటిలో విజయం కూడా సాధించాడు. ఇలా షో చివరికి వచ్చే సరికి షణ్ముఖ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదిగి ఫినాలేకు చేరువయ్యాడు.

ఆమెతోనే ఉంటూ.. విమర్శల వర్షం

ఆమెతోనే ఉంటూ.. విమర్శల వర్షం

షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదటి వారం వెళ్లిపోయిన సరయు వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారంటూ నిందించింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలను సైతం షేర్ చేసింది. ఆ తర్వాత ఉమాదేవి అయితే వీళ్లిద్దరూ పక్కపక్కనే పడుకుంటారని, అలాంటప్పుడు రావడం ఎందుకని విమర్శించింది. ఆ తర్వాత వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించారు. దీంతో వీళ్లిద్దరూ దూరంగా.. దగ్గరగా ఉంటూ డౌట్లు క్రియేట్ చేస్తున్నారు.

 ఎప్పుడూ రొమాన్స్.. పక్కనే ఉంటూ

ఎప్పుడూ రొమాన్స్.. పక్కనే ఉంటూ

బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే షణ్ముఖ్ జస్వంత్‌.. దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. అలాగే, సిరి హన్మంత్.. శ్రీహాన్‌తో లవ్‌లో ఉంది. అయినప్పటికీ వీళ్లిద్దరూ షోలో జంటగా మారిపోయారు. తరచూ కలిసే ఉంటున్నారు.. కలిసే ఆడుతున్నారు. ఒక్కోసారి హగ్ చేసుకుంటారు.. ఒక్కోసారి ముద్దులు పెట్టుకుంటారు. అంతేకాదు, ఏకంగా ఒకరి మీద ఒకరు పడుకుంటారు. దీంతో వీళ్లిద్దరిపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో సిరి అయితే షణ్ముఖ్‌తో కనెక్ట్ అయిపోయానని స్వయంగా ఒప్పుకుంది. అప్పటి నుంచి ఈ బంధం మరింత స్పెషల్‌గా కనిపిస్తోంది.

ట్విట్టర్‌లో షణ్ముఖ్ ఫ్యాన్స్ సందడి

ట్విట్టర్‌లో షణ్ముఖ్ ఫ్యాన్స్ సందడి

బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో టైటిల్ ఫేవరెట్ షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు స్పీడు పెంచేశారు. ఇప్పటికే అతడి పేరిట సోషల్ మీడియాలో పలుమార్లు ట్రెండ్ సెట్ చేసిన వాళ్లు.. వేరే కంటెస్టెంట్ల అభిమానులతో సైతం యుద్ధానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే సన్నీ ఫ్యాన్స్ వర్సెస్ షణ్ముఖ్ ఫ్యాన్స్‌గా రచ్చ జరుగుతోంది. ఎవరికి వారు పోటీగా పోస్టులు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు మిడ్‌నైట్ నుంచి ట్విట్టర్‌లో UnstoppableShannu అనే ట్యాగ్‌తో ట్వీట్ల సునామీ సృష్టిస్తున్నారు.

షణ్ముఖ్ నేషనల్ రికార్డ్.. విన్నర్‌గా

షణ్ముఖ్ నేషనల్ రికార్డ్.. విన్నర్‌గా

UnstoppableShannu అనే హ్యాష్ ట్యాగ్‌తో షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్ ట్విట్టర్‌ను షేక్ చేసేస్తున్నారు. ఇలా కేవలం ఆరు గంటల్లోనే 1.10 మిలియన్ ట్వీట్లు చేసి నేషనల్ రికార్డును క్రియేట్ చేశారు. గతంలో ఏ భాషలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కూ ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఇక, అతడి అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఈ సీజన్‌కు విన్నర్‌ను చేసినా ఆశ్చర్యపోయే పని లేదనే చెప్పాలి. గతంలో అభిజీత్ ఫ్యాన్స్ కూడా ఇలాగే ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేశారు. తర్వాత అతడిని విన్నర్‌ను చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X