For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఆమె వల్ల చనిపోదామనుకున్న షణ్ముఖ్.. తను రావడం వల్లే బతికానంటూ సీక్రెట్ రివీల్

  |

  ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులో ప్రారంభమై.. భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ఆడియెన్స్‌ను గెలుచుకుంటోందీ షో. అందుకే తెలుగులో నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఈ షో ఐదో సీజన్ కూడా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది.

  ఇందులో కూడా ప్రేక్షకుల అంచనాలు తగ్గకుండా వినోదాన్ని పంచుతున్నారు. దీంతో ఈ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్.. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో తన పర్సనల్ విషయాలను బయట పెట్టాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  ముందుగా చెప్పినట్లే.. ఐదు రెట్లుగా

  ముందుగా చెప్పినట్లే.. ఐదు రెట్లుగా

  గతంలో వచ్చినవి అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో సీజన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్‌ హైలైట్‌గా ఉండబోతున్నాయని నిర్వహకులు చెప్పారు. వాళ్లు ముందుగా చెప్పినట్లుగానే ఇందులో ఐదింతల ఎక్కువ ఎమోషన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైటింగ్స్‌ను చూపిస్తూ ఈ సీజన్‌ను కూడా నిర్వహకులు రంజుగా మార్చేశారు.

  అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  19 మందిలో అతడికే ఎక్కువ క్రేజ్

  19 మందిలో అతడికే ఎక్కువ క్రేజ్


  తాజా సీజన్‌కు ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంపిక అయ్యారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇక, ఇంత మందిలో సోషల్ మీడియా స్టార్ ఐదో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం అతడికి బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే.

  ఆరంభంలోనే విమర్శలు.. స్పీడుగా

  ఆరంభంలోనే విమర్శలు.. స్పీడుగా


  సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడంతో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. అనుకున్న రీతిలో హైలైట్ అవడం లేదనే చెప్పాలి. మొదట చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫలితంగా ఆరంభ వారాల్లో అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తూ టాస్కుల్లో తన సత్తాను చూపిస్తున్నాడు.

  మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

  ఆమె వల్ల తక్కువ.. అవే ఎక్కువగా

  ఆమె వల్ల తక్కువ.. అవే ఎక్కువగా


  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి షణ్ముఖ్ జస్వంత్.. మరో కంటెస్టెంట్ సిరి హన్మంత్‌తో ఎంతో చనువుగా ఉంటున్నాడు. బయట కూడా వీళ్లిద్దరూ స్నేహితులు కావడంతో.. హౌస్‌లోనూ జంటగానే కనిపిస్తున్నారు. ఎప్పుడూ పక్క పక్కనే ఉంటూ విమర్శల పాలవుతున్నారు. దీంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం వీళ్లపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

   సిరి, జెస్సీతో గొడవలతో ఒంటరిగా

  సిరి, జెస్సీతో గొడవలతో ఒంటరిగా


  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సిరి హన్మంత్, జస్వంత్ పడాలతోనే ఎక్కువగా కలిసి కనిపిస్తున్నాడు షణ్ముఖ్ జస్వంత్. దీంతో వీళ్లను త్రిమూర్తులు అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలాంటిది రెండు రోజుల క్రితం వాళ్లిద్దరితో షన్నూ గొడవ పడ్డాడు. అప్పటి నుంచి సరిగా తినకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగానే కనిపిస్తున్నాడు.

  టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  బ్రేకప్ వల్ల చనిపోదామనుకున్నా

  బ్రేకప్ వల్ల చనిపోదామనుకున్నా


  హౌస్‌లోని ఇంటి సభ్యులందరూ తమ తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలు, అడ్డంకుల గురించి చెప్పాలంటూ బిగ్ బాస్ ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. ‘ఇంటర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే సమయంలో లవ్‌ బ్రేకప్‌ కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీలయ్యా. సూసైడ్‌ చేసుకుందామనుకున్నా' అని చెప్పాడు.

  Santosh Sobhan Vs Director Maruthi Truth Or Dare | Manchi Rojulochaie
  తను రావడం వల్లే బతికాను అంటూ

  తను రావడం వల్లే బతికాను అంటూ


  షన్నూ దీనిని కంటిన్యూ చేస్తూ.. ‘సూసైడ్ చేసుకునే టైంలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ వచ్చి డోర్‌ కొట్టాడు. కానీ నేను తీయలేదు. తర్వాత వాడు ఎలాగోలా లోపలకు వచ్చి నన్ను నాలుగు పీకాడు. వాడివల్లే ఇప్పుడు బతికున్నాను. ‘వైవా' అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నాకు బ్రేక్‌ వచ్చింది. తర్వాత క్రేజ్ వచ్చింది. నా ఫేస్‌లో స్మైల్‌ తెప్పించిన పేరెంట్స్‌, కజిన్స్‌కు రుణపడి ఉంటా' అని తెలిపాడు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Shanmukh Jaswanth Open About his Love Breakup.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X