Bigg Boss: షణ్ముఖ్ స్ట్రాటజీకి బలైన జెస్సీ.. అతడి ప్లాన్‌తో సిరికి ప్లస్.. కానీ చివర్లో మాత్రం షాక్
రియాలిటీ కాన్సెప్టుతో నడిస్తూ.. ఊహించని మలుపులతో సాగుతూ.. సంచలనాలకు కేంద్ర బిందువగా మారుతోన్న ఏకైక షో బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే దానికి మాత్రమే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో మన షో నేషనల్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన నాలుగు సీజన్లు అలాగే సాగగా.. ఇప్పుడు ఐదోది కూడా వాటికి ఏమాత్రం తీసిపోకుండా నడుస్తోంది. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలం తర్వాత ఓ స్ట్రాటజీ ప్లాన్ చేశాడు. దీంతో దీనికి జెస్సీ బలైపోగా.. సిరి హన్మంత్‌కు లాభం చేకూరింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

మజాను పంచుతోన్న ఐదో సీజన్
బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్పందన వస్తుంది. అందుకే ఈ సారి ప్రసారం అవుతోన్న సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎక్కువ ఎమోషన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైటింగ్స్‌తో నడుపుతూ మరింత ఆసక్తికరంగా చూపిస్తున్నారు. దీంతో రేటింగ్ కూడా మంచిగానే వస్తోంది. దీంతో ఇది సక్సెస్‌ఫుల్‌గా వెళ్తోంది.

అతడికే క్రేజ్.. టైటిల్ ఫేవరెట్‌గా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇందులో సోషల్ మీడియా స్టార్ ఐదో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం అతడికి బయట భారీ పాపులారిటీ ఉండడమే.

ఆరంభంలో అలా.. ఇప్పుడు ఇలా
టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. అనుకున్న రీతిలో హైలైట్ అవలేదనే చెప్పాలి. మొదట చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫలితంగా ఆరంభ వారాల్లో అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తూ టాస్కుల్లో తన సత్తాను చూపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టిలో పడి పేరు తెచ్చుకున్నాడు.

ఆమెతోనే ఎక్కువగా.. విమర్శలు
షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మరో కంటెస్టెంట్ సిరి హన్మంత్‌తో ఎంతో చనువుగా ఉంటున్నాడు. బయట కూడా వీళ్లిద్దరూ స్నేహితులు కావడంతో.. హౌస్‌లోనూ జంటగానే కనిపిస్తున్నారు. ఎప్పుడూ పక్క పక్కనే ఉంటూ విమర్శల పాలవుతున్నారు. దీంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం వీళ్లపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు.

బిగ్ బాస్ కెప్టెన్‌గా.. టాస్క్‌లో షాక్
గత వారం జరిగిన టాస్కుల్లో విజయం సాధించి షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకోవడంతో పాటు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులకు సంచాలకుడిగా వ్యవహరించాడు. నామినేట్ అయిన వాళ్లకు బ్యాగుల టాస్క్ ఇవ్వగా.. షణ్ముఖ్ వాటికి ముడులు వేసి అదిరిపోయే స్ట్రాటజీ ప్లాన్ చేశాడు. దీంతో అంతా షాకయ్యారు.

షణ్ముఖ్ స్ట్రాటజీకి బలైన జెస్సీ
'జీవితమే ఒక ఆట' టాస్కులో కంటెస్టెంట్స్ వేరే వాళ్ల ముఖంతో ఉన్న బ్యాగును తీసుకు రావాలి. అయితే, షణ్ముఖ్ జస్వంత్ వాటికి ముడులు వేయడంతో ఆ రౌండ్‌లో అందరూ తెగ ఇబ్బంది పడ్డారు. ఎలాగోలా జస్వంత్ పడాల.. సిరి హన్మంత్ బ్యాగ్ పట్టుకుని వచ్చాడు. దీంతో ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉండగా.. కంటెస్టెంట్లు అందరూ కలిసి సిరికి ఓట్ చేయడంతో జెస్సీ బలైపోయాడు.
Recommended Video

సిరికి కూడా చివర్లో షాక్ తగిలింది
షణ్ముఖ్ జస్వంత్ చేసిన ప్లాన్‌తో ఆట రసవత్తరంగా సాగింది. కానీ, జెస్సీ మాత్రం టాస్కు నుంచి ఎలిమినేట్ అవడంతో పాటు నామినేషన్స్‌లోకి వెళ్లాడు. అయితే, అప్పుడు సిరి సేఫ్ అయినా.. ఆ తర్వాత జరిగిన ఐదో రౌండ్‌లో మాత్రం ఆమె కూడా ఎలిమినేటైంది. దీంతో షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు స్నేహితులు ఈ వారం నామినేషన్స్‌లోకి వెళ్లారు. కానీ, అతడి ఆట అదుర్స్ అనిపించింది.


Click it and Unblock the Notifications











