Bigg Boss: ఊహించని పని చేసిన షణ్ముఖ్.. నాగార్జున ముందే ఆమెతో అలా.. ఇద్దరి మధ్య అదే జరుగుతుందంటూ!
బిగ్ బాస్... తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరిది. అంతలా దీన్ని ఓన్ చేసేసుకున్నారు మన ఆడియెన్స్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. అందుకే ఈ షో తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. దీనికి ఆరంభం నుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక, ఇందులో చాలా మంది పాపులర్ అయిన కంటెస్టెంట్లు ఉండగా.. అందులో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అతడు ఓ ఊహించని పని చేసి షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

ఆరంభంలోనే రికార్డు కొట్టేసిన బిగ్ బాస్
గత సీజన్ల కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని చెప్పినట్లుగానే.. బిగ్ బాస్ నిర్వహకులు ఐదో సీజన్‌ను ఆసక్తికరంగా తీసుకెళ్తున్నారు. ఆరంభంలోనే అదిరిపోయే టాస్కులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. దీంతో ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఫలితంగా ఇది ఆరంభంలోనే రికార్డు కొట్టేసింది.

19 మంది.. అబ్బాయి ఒకడు.. గర్ల్ ఒకరు
తాజా సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి ఎంటర్ అయింది. బయట ఫ్రెండ్స్ కావడంతో వీళ్లపై ఫోకస్ ఎక్కువగా ఉంది.

ఒకరు స్పీడు... మరొకరు స్లో.. ఇప్పుడలా
టైటిల్ కంటెండర్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. మరోవైపు, సిరి హన్మంత్ మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ ఐదో సీజన్‌కు మొదటి కెప్టెన్‌గా కూడా ఎంపికైంది.

వాళ్ల నుంచి విమర్శలు.. మరీ ఘోరంగా
బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరూ బయట స్నేహితులు కావడంతో.. హౌస్‌లో కూడా జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన సరయు రాయ్, ఉమాదేవి, లహరి షారిలు ఈ విషయాన్ని చెప్తూ ఘోరంగా విమర్శలు చేశారు.

దూరం పెట్టేసిన షణ్ముఖ్... సిరి బాధగా
ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ గురించి చెబుతున్న మాటలతో వీళ్లిద్దరూ బాగా హైలైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ వీళ్లపైనే దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా షణ్ముఖ్.. సిరిని దూరం పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమె ఎంతగానో బ్రతిమాలినప్పటికీ.. మాట్లాడడం లేదు. దీంతో గ్యాప్ పెరుగుతోంది.

నాగ్ ముందే షణ్ముఖ్ ఊహించని పని
తాజాగా జరిగిన సండే ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగింది. ఇందులో సిరి, లోబో, నటరాజ్, ఆనీ మాస్టర్‌లు నామినేషన్స్‌లో ఉండగా.. ఒక్కొక్కరినీ హోస్ట్ నాగార్జున సేఫ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే వాళ్లలో ముందుగా సిరి హన్మంత్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఆ సమయంలో షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా నాగ్ ముందే ఆమెను హగ్ చేసుకుని గాల్లో తిప్పుతూ సంతోషపడ్డాడు.
Recommended Video

ఇద్దరి మధ్య అదే జరుగుతుందంటూ!
బయటకు వచ్చిన కంటెస్టెంట్లు షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌పై విమర్శలు చేస్తుండడంతో వాళ్లు దూరంగా ఉంటున్నారు. అయితే, ఇప్పుడు ఆమె సేఫ్ అవగానే మనోడు ఏకంగా ఎత్తుకుని తిప్పుతూ తన సంతోషాన్ని బయట పెట్టాడు. దీంతో పైకి దూరంగా ఉన్నా లోపల మాత్రం ఇద్దరూ ఒకటేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో వీళ్లు నిజంగానే ప్లాన్ ప్రకారమే ఆడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











