Bigg Boss 5: నాకు పడిపోయావ్‌ కదా.. సిరి ఒడిలో తల పెట్టుకుని షన్ను కామెంట్స్.. గాలి తీసేసిన సిరి!

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకున్న కొద్దీ చాలా ఆసక్తికరంగా మారుతోంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరికి వారు టైటిల్ విన్నర్ గా నిలవాలని చాలా బలంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఓటింగ్ లో అయితే చాలా తేడాలు వస్తున్నాయి. మొదట్లో ఉన్న ఓటింగ్ ఇప్పుడు మాత్రం చాలావరకు తేడాగా కనిపిస్తోంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ కు చేరుకున్న కూడా కొన్ని సన్నివేశాలు అయితే ఎప్పటిలానే దర్శనమిస్తున్నాయి. సిరి షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు కూడా అర్థంలేని కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మరో సారి చిరాకు తెప్పిస్తున్నారు. షన్ను కలిపిన పులిహోర ముచ్చట్లకు సిరి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం విశేషం.

Recommended Video

Bigg Boss Telugu 5 : Mommy's Warning.. Shannu & Siri Self Goal || Oneindia Telugu
టైటిల్ గెలవాలని..

టైటిల్ గెలవాలని..

గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా పాత టాస్క్ లని గుర్తు చేశాడు. ఇక ఇందులో అందరు కూడా చాలా సరదా గా పోటీపడ్డారు. ఇక మధ్యలో ఎప్పటిలానే గొడవలు కూడా జరిగాయి. కంటెస్టెంట్స్ గొడవలు పడటంలో కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవాలి అని ఎవరికి వారు వారి టాలెంట్ ను గట్టిగానే ఉపయోగిస్తున్నారు. బిగ్ బాస్ కూడా ఎమోషన్స్ తో దృష్టిలో కూడా టాస్క్ లను చాలానే ఇస్తున్నాడు.

ఆమె గెలిస్తే..

ఆమె గెలిస్తే..

బిగ్ బాస్ లో ఈసారి బెస్ట్ జోడిగా షణ్ముఖ్ సిరి అందరికంటే ఎక్కువ రోజులు హౌస్ లో కొనసాగుతున్నారు. ఇక ఏకైక అమ్మాయి గా ఉన్న సిరి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆమె గెలిస్తే మాత్రం బిగ్ బాస్ చరిత్రలో ఒక సంచలనం క్రియేట్ అయినట్లే. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ లో ఏ అమ్మాయి టైటిల్ విన్నర్ గా నిలువలేదు. దీంతో ఓ వర్గం వారు ఈ బ్యూటీకి మద్దతుగా నిలుస్తున్నారు.

పులిహోర ముచ్చట్లు

పులిహోర ముచ్చట్లు

ఇక బిగ్ బాస్ హౌస్ లో సిరి షన్ను అర్థంలేని రొమాంటిక్ ట్రాక్ లతో చాలాసార్లు చిరాకు తెప్పించారు. ఇక ఫైనల్ స్టేజ్ వద్దకు వస్తున్న కూడా వారి మధ్యలో ఎలాంటి తేడా కనిపించలేదు. మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఉన్నా కూడా సిరి షన్ను వారి పులిహోర ముచ్చట్లను కొనసాగించారు. ముఖ్యంగా షన్ను అయితే రొమాంటిక్ డోస్ పెంచుతున్నట్లు అర్థమవుతోంది. దానికి తగ్గట్టుగానే సిరి కూడా పంచులు వేస్తూ గాలి కూడా తీస్తోంది.

నాకు పడిపోయావ్‌..

నాకు పడిపోయావ్‌..

గురువారం ఎపిసోడ్ లో షణ్ముఖ్‌, సిరి ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఇక నాకు పడిపోయావ్‌ కదా సిరి అంటూ ఆమె ఒళ్ళో తల పెట్టుకుని షన్ను పులిహోర ముచ్చట్లు బాగానే కలిపాడు. ఇక సిరి ఊహించని విధంగా నీకంత సీన్‌ లేదులే అంటూ గాలి తీసేసింది. దీంతో షన్ను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక బిగ్‌బాస్‌ పాత టాస్క్ లను గుర్తు చేయగా.. ముందుగా బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగిలిపోయేలా చూడాలన్న టాస్క్‌ ఇచ్చాడు. ఇక షణ్ను ఆ టాస్క్ లో విజేతగా నిలిచాడు. ఇక అందులో కూడా సన్నీ అనుమానం వ్యక్తం చేశాడు సన్నీ. ఇక ఆ విషయంలో వారికి కొంత రసబస కొనసాగింది.

బిగ్ బాస్ విన్నర్ అతడే?

బిగ్ బాస్ విన్నర్ అతడే?

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బిగ్ బస్ సీజన్ ఫైవ్ లో టైటిల్ విన్నర్ గా విజే సన్నీ నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ప్రేక్షకుల నుంచి అయితే భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఒక విధంగా గత రెండు వారాల నుంచి సన్నీ ఎలాంటి పని చేసినా కూడా అతనికి బాగా కలిసొస్తోంది. ఒక విధంగా మిగతావాళ్లు పొరపాట్లు చేయడం వల్లనే సన్నీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని తన గేమ్ తాను ఆడుతూ వస్తున్నాడు. దీంతో ప్రేక్షకులు అతని వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X