Bigg Boss: ఫినాలే ముందు పెద్ద తప్పు చేసిన షణ్ముఖ్.. ఇదే కంటిన్యూ అయితే గెలవడం కష్టమే!
తెలుగు బుల్లితెరపై దాదాపు ఐదేళ్లుగా భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టే అయినా ప్రేక్షకులు దీనికి ఓ రేంజ్‌లో స్పందనను అందించడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో సాగుతోంది. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్ తప్పు మీద తప్పు చేస్తున్నాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

టాప్ 5లో ఉండేందుకు పోటీపోటీగా
బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశలో ఉంది. ఈ వారం తర్వాత ఫినాలే వీక్ మొదలు కాబోతుంది. దీంతో హౌస్‌లో ఇప్పుడున్న ఆరుగురు కంటెస్టెంట్లలో టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే వాళ్లు ఎవరన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఎలాగైనా ఫినాలేకు చేరుకోవాలని పోటాపోటీగా టాస్కులు ఆడుతున్నారు. ఇక, గత వారం జరిగిన 'టికెట్ టు ఫినాలే' టాస్కులో శ్రీరామ చంద్ర విజయం సాధించి ఫినాలేకు అర్హత సాధించాడు. దీంతో ఐదుగురిలో నలుగురు మాత్రమే తుదిపోరులోకి అడుగు పెట్టబోతున్నారు.

అతడు మాత్రమే చాలా ప్రత్యేకంగా
బిగ్ బాస్ ఐదో సీజన్‌పై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇందులో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడమే. అందుకు అనుగుణంగానే షణ్ముఖ్‌కు పలువురు సెలెబ్రిటీలు సైతం సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఆరంభం నుంచే అతడు హైలైట్ అవుతున్నాడు.

ఆటలో అలా సాగుతూ.. ఇప్పుడిలా
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరీ ముఖ్యంగా టాస్కుల్లో వందకు వంద శాతం మానసికంగా, శారీరకంగా శ్రమిస్తున్నాడు. తద్వారా కొన్నింటిలో విజయం కూడా సాధించాడు. ఇలా షో చివరికి వచ్చే సరికి షన్నూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదిగి ఇప్పుడు ఫినాలేకు చేరువయ్యాడు.

ఎప్పుడూ ఆమెతోనే... విమర్శలతో
బిగ్ బాస్ హౌస్‌లో సిరి హన్మంత్‌తో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదటి వారం వెళ్లిపోయిన సరయు దగ్గర నుంచి బయటకు వచ్చిన దాదాపుగా ప్రతి కంటెస్టెంట్ వీళ్లిద్దరి గురించి చెడుగానే మాట్లాడారు. కలిసే గేమ్ ఆడతారని ఆరోపించారు. ఆ తర్వాత వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించారు. దీంతో వీళ్లిద్దరూ దూరంగా.. దగ్గరగా ఉంటూ డౌట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో సైతం వీళ్లిద్దరిపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

హగ్గులు... ముద్దులు... దారుణంగా
కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వక ముందే షణ్ముఖ్.. దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. అలాగే, సిరి హన్మంత్.. శ్రీహాన్‌తో లవ్‌లో ఉంది. అయినప్పటికీ వీళ్లిద్దరూ షోలో జంటగా మారిపోయారు. తరచూ కలిసే ఉంటున్నారు.. కలిసే ఆడుతున్నారు. ఒక్కోసారి హగ్ చేసుకుంటారు.. ఒక్కోసారి ముద్దులు పెట్టుకుంటారు. అంతేకాదు, ఏకంగా ఒకరి మీద ఒకరు పడుకుంటారు. దీంతో వీళ్లిద్దరిపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో సిరి అయితే షణ్ముఖ్‌తో కనెక్ట్ అయిపోయానని స్వయంగా ఒప్పుకుంది. అప్పటి నుంచి ఈ బంధం మరింత హైలైట్ అవుతూనే ఉంది.

ఫినాలే ముందు షణ్ముఖ్ తప్పులు
ప్రస్తుతం బిగ్ బాస్ ఐదో సీజన్ ఫినాలే వీక్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న షణ్ముఖ్ ఎలాగైనా సేఫ్ అవుతాడు. ఇది పక్కనపెడితే.. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అతడు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. మరీ ముఖ్యంగా టాస్కు విషయంలో వీజే సన్నీ తనను ఇమిటేట్ చేస్తున్నాడని గొడవ పడ్డాడు. ఆ తర్వాత సిరి హన్మంత్‌పై నోటికొచ్చిన మాటలు అన్నాడు. పాపం ఆమె చాలా సైలెంట్‌గా ఉన్నప్పటికీ షణ్ముఖ్ మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో సిరి తట్టుకోలేక ఏడ్చేసింది. ఇలా నిన్నటి ఎపిసోడ్‌లో అతడు తప్పుల మీద తప్పులు చేశాడు.
Recommended Video

ఇలా అయితే గెలవడం కష్టమేనా
షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గానే వచ్చాడు. ఇప్పుడు సీజన్ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఈ సమయంలో తప్పులు చేయడం ఏమంత మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదే పదే సిరిని తిట్టడం.. వాళ్ల అమ్మ పేరు తీసుకు రావడం అతడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తాయని పలువురు అంటున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లోనైతే సిరిపై అతడు విరుచుకుపడడం దారుణంగా అనిపించింది. ఆమెను సాధిస్తూ షన్నూ పెద్ద తప్పు చేశాడు. ఇదే కంటిన్యూ అయితే అతడి గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











