Bigg Boss 5: సిరి నిజస్వరూపం బయట పెట్టిన షణ్ముఖ్ జస్వంత్.. పక్కనే పడుకోవడంపై సంచలన వ్యాఖ్యలు

తెలుగులో గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రేక్షకాదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సీజన్లను ఒక దానికి మించి ఒకటి సక్సెస్‌ చేసుకుంటూ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. అందుకే దీనికి సంబంధించిన సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక, ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను మొదలు పెట్టారు బిగ్ బాస్ నిర్వహకులు. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్లు బరిలోకి దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. వీళ్లిద్దరూ హౌస్‌లో గూడుపుటానీ నడుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఎన్నో అంచనాలు.. వాటికి తగ్గట్టుగానే

ఎన్నో అంచనాలు.. వాటికి తగ్గట్టుగానే

ఇండియాలోని మిగిలిన భాషలతో పోల్చితే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా అందుకుంది.

పాపులర్ కంటెస్టెంట్లు.. ఆ ఇద్దరు అలా

పాపులర్ కంటెస్టెంట్లు.. ఆ ఇద్దరు అలా

గతంలో మాదిరిగా కాకుండా ఐదో సీజన్‌కు కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండవు అన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి ఎంటర్ అయింది.

 సిరి స్పీడు... షణ్ముఖ్ నెమ్మదిగా స్టార్ట్

సిరి స్పీడు... షణ్ముఖ్ నెమ్మదిగా స్టార్ట్

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోని టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ఆరంభంలో నిరాశ పరిచాడనే చెప్పాలి. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయ్యాయి. అయినప్పటికీ అతడికి మాత్రం పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కలేదు. అయితే, ఈ మధ్య మాత్రం షణ్ముఖ్‌ తన ఆటను మొదలెట్టి హైలైట్ అవుతున్నాడు. మరోవైపు, సిరి హన్మంత్ మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ ఐదో సీజన్‌కు మొదటి కెప్టెన్‌గా కూడా ఎంపికైంది. దీంతో టైటిల్ వేటలో తాను ఉన్నానని సగర్వంగా హెచ్చరికలు కూడా పంపేసింది.

వాళ్లిద్దరిపై సరయు షాకింగ్ కామెంట్స్

వాళ్లిద్దరిపై సరయు షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆరంభ వారంలోనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన సరయు అయితే వీళ్లిద్దరిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారంటూ నిందించింది. బిగ్ బాస్ స్టేజ్‌పైనే ఉన్న సమయంలో ఈ జంటను బాగా విమర్శించింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత కూడా షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారని కొన్ని వీడియోలను సైతం షేర్ చేసింది. దీంతో షోలో వీళ్లిద్దరూ విపరీతంగా హైలైట్ అవుతున్నారు.

 పక్కపక్కనే పడుకుంటారని ఉమాదేవి

పక్కపక్కనే పడుకుంటారని ఉమాదేవి

షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లో కూడా స్నేహితులుగా ఉన్నారని, కలిసే ఆటలు ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణంలో రెండో వారంలో ఎలిమినేట్ అయిన ఉమాదేవి సైతం ఇదే విషయాన్ని హైలైట్ చేసింది. ఎలిమినేషన్ సమయంలో వీళ్లిద్దరిపై విమర్శలు చేసిన ఆమె... బిగ్ బాస్ బజ్‌లో అయితే ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ పక్కపక్కనే పడుకుంటారని, ఒకరి కోసం ఒకరు ఆడతారని ఆరోపించింది. దీంతో అప్పటి వరకూ వీళ్లను వేరుగా చూసిన ప్రేక్షకులు.. తర్వాత జంటగా చూడడం మొదలు పెట్టేశారు.

 సిరి క్యారెక్టర్ బయట పెట్టిన షణ్ముఖ్

సిరి క్యారెక్టర్ బయట పెట్టిన షణ్ముఖ్

తమపై విమర్శలు వస్తున్న కారణంగా రియలైజ్ అయ్యాడో.. లేక బిగ్ బాస్ అనేది సొంతంగా ఆడుకునే గేమ్ అని గ్రహించాడో ఏమో తెలియదు కానీ, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మధ్య అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అతడు.. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సిరి హన్మంత్ క్యారెక్టర్‌పై ఊహించని కామెంట్స్ చేశాడు. జెస్సీతో మాట్లాడుతూ.. 'నాకు ఎక్కడో కొడుతుంది. వరుస సంఘటనలు చూస్తే మన సపోర్ట్ ఇన్ డైరెక్ట్‌గా సిరికి వెళ్లిపోతుంది అనిపిస్తుంది' అని పేర్కొన్నాడు.

Recommended Video

Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic
 పక్కనే పడుకోవడంపై సంచలన వ్యాఖ్యలు

పక్కనే పడుకోవడంపై సంచలన వ్యాఖ్యలు

జెస్సీతో సిరి హన్మంత్ గురించి మాట్లాడుతూ 'నేను ఏం చేసినా సిరి కోసం చేసినట్లే కనబడుతుంది. అందుకే ఆమెకు దూరంగా ఉందామని డిసైడ్ అయ్యాను. దీని కోసం ముందుగా బెడ్ మారిపోదాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచైనా ఆమెను దూరం పెట్టడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకో సిరి సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. అది నాకు నచ్చడం లేదు. నేను సిరి నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. అంత గొప్పగా ఊహించుకోవడం నాదే తప్పు' అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. సిరి విషయంలో అతడు తీసుకున్న నిర్ణయానికి ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X