Bigg Boss 5: జెస్సి వాంతులు చేసుకున్నా పట్టించుకోని షన్ను, సిరి.. వీళ్లేం దోస్తుల్రా అంటూ కౌంటర్!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ కూడా అవసరమైన సమయంలో మాత్రం ఒక్కసారిగా రంగులు మారుస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం స్నేహం విషయంలో మాత్రం కేవలం అవసరానికి మాత్రమే వాడుకుంటారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ త్రిమూర్తులుగా కొనసాగుతున్న జెస్సీ షణ్ముఖ్ జెస్సి ముగ్గురు కూడా ఒక తరహాలో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే కొన్నిసార్లు స్నేహం వారికి పాజిటివ్ అయినప్పటికీ మరికొన్నిసార్లు నెగిటివ్ అవుతోంది. ఒకరికొకరు సీక్రెట్ గా కొన్ని టాస్కూల్లో కూడా చాలా బాగా హెల్ప్ అయితే చేసుకుంటున్నారు కానీ వీరిలో షణ్ముఖ్ జస్వంత్ మాత్రం చాలాసార్లు అప్సెట్ అయ్యాడు. ఇక 57వ రోజు జెస్సి కొంత అస్వస్తతకు లోనైనప్పటికి కూడా వారు పట్టించుకోక పోవడం విశేషం.

బిగ్ బాస్ త్రిమూర్తులు

బిగ్ బాస్ త్రిమూర్తులు

బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పుడు కొంతమంది మొదట్లో చాలా స్నేహంగా ఉండే వారు. ఇక ఆ తర్వాత మెల్లగా వారి మధ్యలో కొంత దూరం అయితే పెరిగింది. ఇక ఆ గ్యాప్ లోనే మరికొందరు మంచి ఫ్రెండ్స్ గా తిరుగుతూ ఉన్నారు. కానీ అందులో కూడా నిజాయితీ లేదు అని అనిపిస్తోంది. త్రిమూర్తులుగా కొనసాగుతున్న జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్ అలాగే సిరి మధ్యలో కూడా ఒక బాండింగ్ అనేది బలంగా లేదని కేవలం హైలెట్ అవ్వడానికి ముగ్గురు అలా కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది.

షన్ను కెప్టెన్ అవ్వాలని..

షన్ను కెప్టెన్ అవ్వాలని..

సాధారణ సమయాల్లో ఎంతో క్లోజ్ గా ముందుకు సాగుతూ వస్తున్న ఈ ముగ్గురు కూడా అవసరమైన సమయంలో కూడా సహాయం చేసుకుంటున్నారు. కానీ వారు సహాయం చేసుకుంటున్నట్లు పైకి ఏమాత్రం చూపించడం లేదు కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అలాగే బయట జనాలకు కూడా ఈ విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది. అది కూడా కేవలం అవసరం ఉన్నప్పుడే. ముఖ్యంగా గత వారం షన్ను కెప్టెన్ అవ్వాలని జెస్సితో పాటు ఒక విధంగా సిరి కూడా బాగానే సహాయం చేసింది.

వాంతులు చేసుకున్న జెస్సి

వాంతులు చేసుకున్న జెస్సి

అయితే షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు కూడా జెస్సి విషయంలో అప్పుడప్పుడు వెనకడుగు వేస్తున్నట్లు అనిపిస్తోంది. అతన్ని కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు అనే కామెంట్స్ వచ్చాయి. ఇక నామినేషన్ కు ముందు రోజు జెస్సి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బాత్రూంలోకి వెళ్లి అతను వాంతులు చేసుకున్నప్పటికీ కూడా తన స్నేహితులు ఎవరూ పక్కకు కూడా రాలేదు. ఆ సమయంలో మాత్రమే జెస్సి భుజం తడుతూ అతని పక్కనే ఉన్నాడు.

వీళ్లేం దోస్తుల్రా

వీళ్లేం దోస్తుల్రా

జెస్సీ అస్వస్థతతో ఉన్నాడు అని తెలిసినప్పటికీ కూడా షణ్ముఖ్ అతనితో కామెడీ చేయడం మరొక హైలెట్ పాయింట్. జెస్సి వాంతులు చేసుకుంటున్న కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో వీళ్లేం దోస్తుల్రా అంటూ సన్నీ అసహనం వ్యక్తం చేశాడు. మానస్ కూడా అదే విషయాన్ని చెప్పగా వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది లే ఆ విషయం అందరికీ తెలుసు.. నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ మానస్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

Comedian Sudarshan About Manchi Rojulochaie | Santosh Shobhan | Part 03
 ఎన్ని కుక్కలు ఉన్నాయిరా నీకు..

ఎన్ని కుక్కలు ఉన్నాయిరా నీకు..

షణ్ముఖ్ మరోవైపు కుక్క బొమ్మపట్టుకుని నా కుక్క సామ్రాజ్యానికి వీడే వారసుడు అంటూ సంబంధం లేకుండా జోక్‌లు వేశాడు. అయితే జెస్సీ బాధతో.. ఎన్ని కుక్కలు ఉన్నాయిరా నీకు అని అన్నాడు. అసలు షణ్ముఖ్ జస్వంత్.. జెస్సి విషయంలో చాలాసార్లు సలహాలు ఇచ్చాడు. అలాంటిది అతను అస్వస్థతకు గురైతే ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది అంతు చిక్కడం లేదు. అంతే కాకుండా అతనితో కుక్క జోకులు వేస్తూ పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి రానున్న రోజుల్లో వీరి మధ్య బాండింగ్ ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X