Bigg Boss 5 Telugu: షోలో ఊహించని సంఘటన.. సిరి పరువు తీసేసిన షణ్ముఖ్.. అతడికి రిలేషన్ పెట్టుకోవడం వల్లే!
తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అయ్యాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ను అందుకుని సంచలనం సృష్టించాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ షో ఒకటి. హిందీలో ఎప్పుడో వచ్చిన ఇది.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే పరిచయం అయింది. అయితే, ఎక్కడా లేని విధంగా మన దగ్గర మాత్రమే మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది.
ఇక, ఇటీవలే మొదలైన ఐదో సీజన్‌కు సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇదీ విజయవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టాప్ కంటెస్టెంట్ అయిన షణ్ముఖ్ జస్వంత్.. తన ఫ్రెండ్ సిరి హన్మంత్ క్యారెక్టర్‌పై ఊహించని కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ఐదింతలు ఎక్కువ చూపించేందుకు
ఐదో సీజన్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని చెప్పినట్లుగానే.. బిగ్ బాస్ నిర్వహకులు దీన్ని ఆసక్తికరంగా తీసుకెళ్తున్నారు. ఆరంభంలోనే అదిరిపోయే టాస్కులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. మరీ ముఖ్యంగా రొమాన్స్, లవ్, ఫైట్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ చూపించి మజాను పంచుతున్నారు.

అబ్బాయిల్లో అతడు.. లేడీస్‌లో ఆమె
ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి ఎంటర్ అయింది. బయట ఫ్రెండ్స్ కావడంతో వీళ్లు ఎక్కువ హైలైట్ అయ్యారు.

ఒకరు దూకుడు.. ఇంకొకరు స్టాటజీగా
భారీ ఫాలోయింగ్ ఉండడంతో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఆరంభ వారాల్లో అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు, సిరి హన్మంత్ మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ హౌస్‌కు మొదటి కెప్టెన్‌గా కూడా ఎంపికైంది.

అందరూ అవే విమర్శలు చేశారుగా
బయట స్నేహితులైన షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరూ బయట స్నేహితులు కావడంతో.. హౌస్‌లో కూడా జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఈ విషయాన్ని చెప్తూ ఘోరంగా మాట్లాడారు.

దూరం పెట్టిన షణ్ముఖ్... మళ్లీ క్లోజ్
బయటకు వెళ్లిన వాళ్లంతా సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ గురించి చెబుతున్న మాటలతో వీళ్లిద్దరూ బాగా హైలైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ వీళ్లపైనే దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా షణ్ముఖ్.. సిరిని దూరం పెడుతున్నాడు. అయితే, మళ్లీ ఆమెతోనే కలుస్తున్నాడు. దీంతో వీళ్లిద్దరి తీరు ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తోంది.

సిరి క్యారెక్టర్‌పై షణ్ముఖ్ కామెంట్స్
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. 'బంగారు కోడిపెట్ట' టాస్క్ జరుగుతోన్న సమయంలో పక్కన కూర్చుని ఉన్న అతడు.. జస్వంత్‌కు సైగలు చేస్తూ సిరిని చూపించాడు. అది చూసిన జెస్సీ 'ఇదెప్పటి నుంచి రా' అని అన్నాడు. దీనికి షన్నూ 'అందుకే నాకు చిరాకుగా ఉంది. దూరంగా ఉన్నా' అని చెప్పాడు.

అతడితో క్లోజ్‌గా ఉండడం వల్లేనని
సిరి హన్మంత్‌తో ఎంతో స్నేహంగా ఉండే షణ్ముఖ్.. ఇప్పుడామె క్యారెక్టర్‌పై విమర్శలు చేస్తున్నాడు. దీనికి కారణం ఆమె శ్రీరామ చంద్రతో చనువుగా ఉండడమే. ఇదే విషయాన్ని అతడు జెస్సీకి సైగల ద్వారా చెప్పాడు. గతంలో వీళ్ల ముగ్గురికీ శ్రీరామ్‌తో గొడవ జరిగింది. దీంతో ఇప్పుడు అతడితో సిరి క్లోజ్ అవడం షన్నూకు నచ్చడం లేదు. దీనిపై ఈరోజు చర్చ జరగబోతుందని తెలిసింది.


Click it and Unblock the Notifications











