Bigg Boss: ఫినాలేకు ముందు షణ్ముఖ్‌కు బిగ్ షాక్.. వాళ్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది మరి!

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయం అయినా.. ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. ఇలా ఏకంగా నాలుగు సీజన్లను రికార్డు స్థాయి టీఆర్పీతో నడిపించుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోంది. ఇక, ఇందులో ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు.

అందులో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అతడు.. ఫినాలేకు చేరువగా వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్ చివరి వారంలో షన్నూకు ఊహించని పరిణామం ఎదురైంది. దీంతో అతడికి బిగ్ షాక్ తగిలినట్లైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఫినాలే టైంలో మరింత మజా పంచేలా

ఫినాలే టైంలో మరింత మజా పంచేలా

ఎన్నో అంచనాల నడుమ మొదలైన ఐదో సీజన్ ఆరంభం నుంచే ఆదరణను అందుకుంటోంది. మధ్యలో కొంచెం స్లో అయినప్పటికీ.. మళ్లీ చిన్నగా పుంజుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చివరి అంకానికి చేరడంతో షో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే షో నిర్వహకులు సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. దీంతో చివర్లో కూడా మరింత రంజుగా మారింది.

ఫినాలేకు చేరే కంటెస్టెంట్లు ఎవరెవరు

ఫినాలేకు చేరే కంటెస్టెంట్లు ఎవరెవరు

డిసెంబర్ 19న బిగ్ బాస్ ఐదో సీజన్ ఫినాలే జరగనుంది. దీనికి ఐదుగురు మాత్రమే అర్హత సాధిస్తారు. ఇప్పుడు హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో 'టికెట్ టు ఫినాలే' టాస్కులో శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేకు అర్హత సాధించాడు. మిగిలిన ఐదుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. దీంతో ఎవరు ఉంటారు? ఎవరు వెళ్తారో తెలియాల్సి ఉంది.

రోల్ ప్లే కంప్లీట్.. ఓట్లు అడిగే అవకాశం

రోల్ ప్లే కంప్లీట్.. ఓట్లు అడిగే అవకాశం

ఐదో సీజన్ చివరి వారం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కంటెస్టెంట్లకు 'రోల్ ప్లే' టాస్క్‌ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ సీజన్‌లో హైలైట్ అయిన గొడవలకు సంబంధించిన సన్నివేశాలను ఇచ్చి.. అందులో ఎవరో ఒకరు తమకు నచ్చిన రోల్ చేయమని చెప్పాడు. తర్వాత వాళ్లను సూపర్ స్టార్లుగా మార్చేశాడు. వీటిలో గెలిచిన వాళ్లు ఓట్లు అభ్యర్థించే ఛాన్స్ పొందారు.

ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలని

ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలని

ఓట్లు అపీల్ చేసుకునే టాస్కులో భాగంగా చివరి రౌండ్‌గా కంటెస్టెంట్లకు ప్రేక్షకుల నుంచి ప్రశ్నలు వస్తాయని చెప్పారు. అందులో మనసు విప్పి సమాధానాలు చెప్పిన ఒక్కరికి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఆ కంటెస్టెంట్ ఎవరు అన్నది మాత్రం ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఎంచుకోవాల్సి ఉంటుందని కూడా వెల్లడించాడు.

 ఫినాలే ముందు షణ్ముఖ్‌కు బిగ్ షాక్

ఫినాలే ముందు షణ్ముఖ్‌కు బిగ్ షాక్

ఐదో సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఫాలోయింగ్ ప్రకారం షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అందుకు అనుగుణంగానే అతడు 14వ వారం వరకూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఫినాలేకు చేరుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఫినాలేకు ముందు ఇచ్చిన టాస్కులో షణ్ముఖ్ జస్వంత్‌కు ఆడియెన్స్ షాకుల మీద షాకులు ఇచ్చారు.

షణ్ముఖ్‌కు ఊహించని ప్రశ్నలు వేసి

షణ్ముఖ్‌కు ఊహించని ప్రశ్నలు వేసి

ఈ రౌండ్‌లో షన్నూను ఓ నెటిజన్ 'సిరి అంటే ఎందుకంత పొసిసివ్‌గా ఫీల్ అవుతారు? ఆమెను ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? తనని తనలా ఎందుకుండనివ్వరు?' అని సూటిగా అడిగారు. ఆ తర్వాత మరొకరు 'ఇవి ఎలా నచ్చుతున్నాయి? అవి ఎలా నచ్చుతున్నాయి? అని ఆడియన్స్‌ని జడ్జ్ ఎందుకు చేస్తున్నారు? వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు? ' అని ప్రశ్నించారు.

 వాళ్లకు క్షమాపణలు చెప్పిన షణ్ముఖ్

వాళ్లకు క్షమాపణలు చెప్పిన షణ్ముఖ్

సిరి గురించి అడిగిన ప్రశ్నకు.. 'తను మంచిగా ఆడకుండా డైవర్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ఆమెను కంట్రోల్ చేస్తున్నా' అని చెప్పాడు. అలాగే, ఆడియెన్స్ గురించి 'ఆడియన్స్‌ను జడ్జ్ చేయట్లేదు. నా పాయింట్ చెప్తున్నా. అది బయట వాళ్లకి నచ్చుతుందా లేదా? అని ఆలోచిస్తున్నా. అది తప్పా కరెక్టో అర్ధం కావట్లేదు. నేను ఆడియన్స్‌ని ఫన్ చేయడం లేదు. మళ్లీ అది రిపీట్ చేయను సారీ' అని బదులిచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X