Bigg boss 5: శ్వేతని లవ్ చేసే పనిలో నోరు జారిన షణ్ముఖ్.. గురువుగారు అంటూనే గు*** లో అంటూ దారుణంగా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బుధవారం నామినేషన్ కూడా ఎంతో ఆసక్తిగా మొదలైంది. అయితే నిత్యం సీరియస్ గా కొనసాగుతుందని అనుకున్న బిగ్ బాస్ ఇప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఒక సరదా డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కెప్టెన్ టాస్క్ లో భాగంగా హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి అనే ఒక టాస్క్ ఇచ్చారు. పెళ్లి సంబంధంతో కొనసాగే ఈ టాస్క్ లో ఒక్కక్కరికి ఒక్కో విభిన్నమైన క్యారెక్టర్ ఇచ్చారు. ఇక అందరిది ఒక తరహాలో ఉంటే షణ్ముఖ్, లోబో, శ్వేతా లవ్ ట్రాక్ మరొకలా ఉంది. ఇక సరదాగా కొనసాగిన డ్రామాలో సడన్ గా సీరియస్ వాతావరణం నెలకొంది. పొరపాటున షణ్ముఖ్ అనేసిన ఒక కామెంట్ కు శ్వేతా చాలా సీరియస్ అయ్యింది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

కెప్టెన్ టాస్క్ కోసం

కెప్టెన్ టాస్క్ కోసం

బిగ్ బాస్ హౌస్ లోన్ కెప్టెన్ టాస్క్ అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెప్టెన్ స్థానం దక్కింది అంటే దాదాపు ఆ వారం ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చినట్లు లెక్క. అందుకే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు తెలివిగా గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక ఈ సారి కెప్టెన్ గా ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. అదృష్టవశాత్తు మొదట కెప్టెన్ గా సిరి సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విశ్వ పెద్దరికంతో కెప్టెన్ గా సెట్ అయ్యాడు. ఇక ఈసారి కెప్టెన్ బ్యాండ్ ఎవరికి దక్కుతుంది అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది.

ఆ టాస్క్ లో సమన్యాయం. లేదా?

ఆ టాస్క్ లో సమన్యాయం. లేదా?

అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మాత్రం అందరికీ అనుకూలంగా లేదని కూడా టాక్ వస్తోంది. మూడో వారం లో కెప్టెన్ టాస్క్ లో భాగంగా సరికొత్త సన్నివేశాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి అని స్పెషల్ గా ఒక స్క్రిప్ట్ రూపొందించినట్లు ఉంది. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రను ఇవ్వగా కొందరిని మాత్రం అసలు పట్టించుకోలేదు అని టాక్ వస్తోంది. ఇక ఈ డ్రామా మాత్రం చాలా నీరసంగా కొనసాగుతోంది. ఎవరికి వారు వారి టాలెంటు చూపించాలి కాబట్టి అందరూ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. అసలు ఏం చేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగానే వస్తున్నాయి.

ట్రయాంగిల్ లవ్ స్టొరీ

ట్రయాంగిల్ లవ్ స్టొరీ

ఫిజికల్ టాస్క్ లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయని బిగ్ బాస్ ఈసారి తెలివిగా ఒక డ్రామా క్రియేట్ చేశాడు. అయితే కంటెస్టెంట్ ఎవరు కూడా దానికి అనుకున్నంత స్థాయిలో అయితే న్యాయం చేయలేదు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక అందులో మరొక యాంగిల్ లో లోబో షణ్ముక్ శ్వేతా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి కి పెళ్లి చేయాలి అనే బ్రోకర్ గా షన్ను క్యారెక్టర్ ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. ఇక లోబో ఈవెంట్ మేనేజర్ గా ఉండగా అతడికి అసిస్టెంట్గా శ్వేత ఉంటుంది. ఇక వీరి మధ్యలో కొనసాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా సరదాగా కొనసాగుతోంది.

 లోబోకు తెలియకుండా నొక్కేద్ధం అంటూ

లోబోకు తెలియకుండా నొక్కేద్ధం అంటూ

ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో సరదాగా మొదలైన వీరి లవ్ ట్రాక్ ఒక్కసారిగా సీరియస్ వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. షన్ను సరదాగా కామెంట్ చేసినప్పటికీ కూడా ఆ మాటలను శ్వేతా సీరియస్ గా తీసుకోవడంతో హౌస్ లో వాతావరణం మరొకసారి మారిపోయే అవకాశం ఉంది. పెళ్లి చేయాలి కాబట్టి మొదట మనకు వచ్చే డీల్ ను లోబోకు తెలియకుండా నొక్కేద్దాం అని షణ్ముఖ్ జస్వంత్ పెద్ద ప్లాన్ వేస్తాడు. అందుకు శ్వేత కూడా ఒప్పుకుంటుంది.

 శ్వేతకు ఐ లవ్యూ చెప్పిన లోబో

శ్వేతకు ఐ లవ్యూ చెప్పిన లోబో

చెక్కులు రాగానే చేకౌట్ అయిపోతాతే బాగుంటుంది అని షణ్ముఖ్ జస్వంత్ అనడంతో అందుకు శ్వేతా నీకు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక మాట చెబుతోంది. అందుకు షన్ను మనం పెళ్లి చేసుకుందా రా అని మరొకసారి ప్రేమగా చెబుతాడు. అందుకు శ్వేత కూడా ఓకే అనడంతో ఇద్దరు కూడా వానలో గొడుగు కింద రొమాంటిక్ గా కనిపిస్తారు.. మరోవైపు లోబో కూడా శ్వేతకు ఐలవ్యూ చెప్పాలని అనుకుంటాడు. మరొకసారి ఐ లవ్ యూ చెప్పడంతో థాంక్యూ సార్ అంటూ శ్వేత సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక నువ్వంటే నాకు పిచ్చి అని లోబో చాలా సరదాగా రొమాంటిక్ గా చెబుతుండగా ఆ సన్నివేశాన్ని దూరంనుంచి షణ్ముఖ్ జశ్వంత్ ఎంతో సీరియస్ గా చూస్తూ ఉంటాడు.

 గురువుగారు గురువుగారు అంటూ

గురువుగారు గురువుగారు అంటూ

ఇక షణ్ముక్ కాస్త అసూయతో రేయ్ అని పిలవడంతో లోబో కూడా ఎంతో వేగంగా సార్ సార్ అంటూ అతని కాళ్ళ మీద పడతాడు. అంతేకాకుండా గురువుగారు అని పొగిడే ప్రయత్నం చేస్తాడు. దీంతో షన్ను చిరాకుతో గురువుగారు గురువుగారు అంటూ నా గు.. అని సైలెంట్ అయిపోతాడు. ఇక శ్వేత ఏమీ తెలియనట్టుగా అక్కడ పక్కనే వచ్చి నిలబడుతుంది. వాడు పట్టుకుంటే కూడా ఆపడం లేదు ఏమిటి అని షన్ను నిలదీస్తాడు. సమాధానం రాలేదు ఏమిటని మరోసారి సూటిగా అడుగుతాడు. ఆ తర్వాత శ్వేత ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో షన్ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
నోరు జారిన షణ్ముఖ్

నోరు జారిన షణ్ముఖ్

ఇక ఎందుకు అలుగుతారు అంటూ శ్వేత అతడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. ఇక షణ్ముఖ్ పొరపాటున శ్వేత మైనస్ పాయింట్ హైలెట్ చేస్తాడు. ఏమైనా అంటే మళ్లీ మొహం మీద పెయింట్ వేసి కొడుతుంది అని నోరు జారడంతో శ్వేతా ఆ మాటలకు ఫన్నీ కాదు అంటూ ఒక్కసారిగా సీరియస్ ఐపోతుంది. ఆమె మనోభావాలు దెబ్బ తిన్నట్లు అనిపించడంతో షణ్ముఖ్ జస్వంత్ బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. క్షమించమని అడిగిన కూడా శ్వేత ఏ మాత్రం లెక్కచేయరు. నోటి దురద అనుకుంటూ షణ్ముఖ్ జస్వంత్ తల పట్టుకుని ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆమె వాష్ రూమ్ దగ్గర ఉండగా క్షమించమని అడగడానికి వెళ్తాడు.. అయినప్పటికీ శ్వేతా కోపం ఏ మాత్రం తగ్గలేదు. ఇక చేసేదేమీలేక షన్ను అక్కడనుంచి వెళ్ళి పోతాడు ఇక వీరి గొడవతో టాస్క్ ఎలా చేంజ్ అవుతుందో తెలియాలి నాటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X