Bigg Boss 5: నన్ను ఎదవను చేశారు.. నేను దేనికి పనికి రాను.. సిరి గుండెల్లో గుచ్చిన షణ్ముఖ్
బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఇలాంటి గొడవలు మొదలవుతాయో ఎవరూ ఊహించలేరు. దానికి తోడు బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు ఇచ్చే క్రమంలో ఒకరిపై మరొకరు నిత్యం అనుమానాలతో ఎమోషన్స్ తో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక మంచి స్నేహితులుగా ఉన్న వారి మధ్యలో కూడా ఎప్పుడో ఒకప్పుడు గొడవలు జరగకుండా ఉండవు. సెపరేట్ గ్యాంగ్ మెయింటెన్ చేసినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ చాలా వరకు బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక గత కొంతకాలంగా త్రిమూర్తులు గా కొనసాగుతున్న షణ్ముఖ్ జస్వంత్ సిరి జెస్సి ముగ్గురు మధ్యలో కూడా విభేదాలు వచ్చినట్లు చాలా క్లియర్ గా అర్థం అవుతోంది. ముఖ్యంగా షన్ను అయితే తన ఇద్దరి స్నేహితులను కూడా పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విధంగా అతను అనే మాటలో సిరి గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఆఖరికి నన్ను ఎదవని చేశారు అంటూ షన్ను అలక పాన్పు ఎక్కాడు.

సైలెంట్ గా ఉన్న వారు కూడా..
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంది ఉంటుంది. గత వారం రేటింగ్స్ పై సంతృప్తి చెందలేదో ఏమోగానీ ఈవారం మాత్రం కాస్త డోస్ పెంచినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకరిని మించి మరొకరు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు సైలెంట్ గా ఉన్న వారు కూడా ఈ వారం ఒక్కసారిగా సీరియస్ గా కనిపించారు. మొత్తంగా ప్రియ, సన్నీ గొడవలు మాత్రం ఈ వారం చాలా హైలెట్ గా నిలిచాయి.

బొక్కబోర్లా పడిన జెస్సి
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కోసం మొదలైన బంగారు కోడిపెట్ట గేమ్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. సీక్రెట్ టాస్క్ లో భాగంగా జెస్సి.. షన్నుని దూరం పెట్టడం పై బాగా హర్ట్ అయినట్లు అర్థం అయింది. ఒక ఎవరైతే ఎక్కువ గుడ్లను సంపాదిస్తారో వారు కెప్టెన్సీ టాస్క్ లో ఉంటారు. ఇక ఈ వారం మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు కెప్టెన్సీ పోటీలోకి రాగా సీక్రెట్ టాస్కులో జెస్సీ బొక్క బోర్లా పడ్డాడు. సిరి నమ్ముకొని అతను వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అవ్వడంతో అతను చాలా తొందరగానే ఫెయిల్ అయ్యాడు.

సిరి కష్టమంతా వృధా
బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం సీక్రెట్ టాస్క్ అంటే ఎవరికీ తెలియకుండా ముగ్గురు కంటెస్టెంట్స్ గుడ్లను తగ్గించాల్సి ఉంటుంది. లేదా వాటిని నాశనం చేయాల్సి ఉంటుంది. కానీ జెస్సి మాత్రం తన తెలివి ఉపయోగించకుండా బ్రతిమాలడం మొదలు పెట్టాడు. సిరి సహాయం తీసుకొని ముగ్గురి గుడ్లను జీరో చేయమని చెప్పాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ తో జెస్సీ కెప్టెన్సీ టాస్క్ తప్పుకోవాల్సి వచ్చింది. జెస్సీ తన సీక్రెట్ టాస్క్ ను సరిగ్గా ఫాలో అవ్వలేదని. బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక సిరి పడిన కష్టం అంతా కూడా ఒక్కసారిగా వృధా అయ్యింది.
Recommended Video

నేను దేనికి పనికి రాను..
జెస్సిని కెప్టెన్ గా చేయాలని సిరి గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ మధ్యలో షణ్ముఖ్ జస్వంత్ చాలా హర్ట్ అయినట్లు అర్ధమవుతోంది. సీక్రెట్ టాస్క్ మాత్రం చెప్పకుండా ఇద్దరూ కలిసి ఆడడంతో షన్ను చాలా ఫీల్ అయ్యాడు. చివరికి నన్ను ఎదవని చేశారు. నేను దేనికి పనికి రాను కదా అంటూ నేను ఎవరికీ అవసరం లేదు అని అలక పాన్పు ఎక్కాడు. ప్రతిరోజు ముగ్గురు పక్కనే పడుకుని ఉండే వారు. కానీ షన్ను మాత్రం మరొక బెడ్ వెతుక్కోవాల్సి వచ్చింది. అంతే కాకుండా అతను తన స్నేహితుల మీద అలకతో సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. వారికి చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. షణ్ముఖ్ ఇంకా ఎన్నిరోజులు ఇలా ఉంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











