Bigg Boss Telugu 5: సిరిని ఎత్తుకున్న మానస్.. తట్టుకోలేకపోయిన షన్ను.. స్ట్రాంగ్ కౌంటర్

బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి ఫైనల్ ఎపిసోడ్స్ కు అతి దగ్గరలో ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ చాలా పోటాపోటీగా పోరాడుతున్నారు. ఇన్ని రోజుకు సాగిన ఆట ఒక లెక్క ఇక నుంచి కొనసాగే ఆట మరొక లెక్క అనే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇక 87వ ఎపిసోడ్ లో టికెట్‌ టు ఫినాలే టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా సహనంతో ముందుకు సాగారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ లో ఎవరు కూడా తగ్గకుండా గేమ్ ఆడారు. కంటెస్టెంట్స్ లో గెలవలేనే ఓర్పు చాలానే కనిపించింది.

రవి కోసం కంటెస్టెంట్స్ ఎమోషనల్

రవి కోసం కంటెస్టెంట్స్ ఎమోషనల్


గత వారం నుంచి కూడా ఎలిమినేషన్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. అసలు యాంకర్ రవి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు అని ఎవరు ఊహించలేదు. ఇక అతను వెళ్లిపోయిన తరువాత హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. గతంలో ఎప్పుడు లేని విదంగా కంటెస్టెంట్స్ కాస్త ఎక్కువగానే ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఆటలో భాగంగా తిట్టుకుంటూ ఉన్నప్పటికీ మళ్ళీ అప్పుడే కౌగిలింతలతో షాక్ ఇస్తున్నారు.

బిగ్ బాస్ కు కావాల్సింది కూడా అదే

బిగ్ బాస్ కు కావాల్సింది కూడా అదే


బిగ్ బాస్ హౌస్ లో స్నేహాలు అనేవి ఏ తరహాలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే బిగ్ బాస్ కు కావాల్సింది కూడా అదే. నిన్నా మొన్నటి వరకు ఎంతో క్లోజ్ గా ఉన్నవారు ఆట ముందుకు సాగుతున్న తరుణంలో కొట్లాటకు దిగక తప్పదు. బిగ్ బాస్ వారి ఎమోషన్స్ తో సరికొత్త ట్విస్టులను క్రియేట్ చేస్తాడు. ఇక షణ్ముఖ్ జస్వంత్ , సిరి మధ్యలో కూడా అదే తరహాలో వాతావరణం క్రియేట్ అవుతోంది.

సన్నీ, సిరి గొడవ

సన్నీ, సిరి గొడవ


ఇటీవల మానస్, సిరిని ఎత్తుకోవడంతో షన్ను తట్టుకోలేకపోయాడు. మొదటి ఛాలెంజ్ లో భాగంగా ఐస్ లో కాళ్ళు పెట్టి ఎక్కువ సేపు ఎవరు నిలబడతారో వారే తరువాత ఛాలెంజ్ కు అర్హులు అవుతారు. ఇక పక్కనే బాల్స్ ను కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక సన్నీ సిరి మధ్యలో మరోసారి రసబస మొదలైంది. ఒకరికొకరు పోటీ పడుతూ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు. ఇక సిరి కావాలని తనను బ్యాడ్ చేస్తోందని సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మధ్యలో షన్ను కూడా సిరి కోసం సన్నీ పై కౌంటర్లు వేశాడు.

సిరిని ఎత్తుకున్న మానస్

సిరిని ఎత్తుకున్న మానస్


అయితే సన్నీ గేమ్ మధ్యలో వచ్చిన తరువాత మానస్ మాత్రం అతనికి తెలియకుండానే కౌంటర్ ఇచ్చినట్లు అనిపించింది. ఐస్ లో ఎక్కువ సేపు కాళ్లు పెట్టిన సిరి తట్టుకోలేకపోయింది. ఆమెకు కాళ్ళు పట్టేశాయి. ఇక నడవలేని పరిస్థితులలో ఉండడంతో సిరిని మానస్ వెంటనే ఎత్తుకొని తీసుకువచ్చాడు. ఆ సీన్ ను షన్ను అస్సలు జీర్ణించుకోలేకపోయాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
నాతో ఫ్రెండ్ గా ఉండాల్సిన అవసరం లేదని..

నాతో ఫ్రెండ్ గా ఉండాల్సిన అవసరం లేదని..

వాళ్ళ సహాయం ఎందుకు తీసుకున్నావు అంటూ కడుపు మంటతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు వారి సహాయం ఎందుకు తీసుకున్నావు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక షన్ను మాటలకు మరోసారి సిరి ఏడ్చేసింది. ఆమె ఏడుస్తున్నా కూడా పట్టించుకోని షన్ను వారితో క్లోజ్ గా ఉంటే నాతో ఫ్రెండ్ గా ఉండాల్సిన అవసరం లేదని మరొక కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ ట్రాక్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X