Bigg Boss Telugu 5: షన్ను గెలిస్తే బిగ్ బాస్ షో రికార్డులు బద్దలు.. ఎలాగో తెలుసా?.. పూర్తి లెక్కలు ఇవే!

బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హౌస్ లో అతని అట తీరు ఎలా ఉన్నా? ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలవడం ఖాయం అంటున్నారు. అయితే ఒకవేళ కప్ గెలిసే మాత్రం బిగ్ బాస్ రికార్డులు బద్దలు కొట్టినట్టే ఆ వివరాల్లోకి వెళితే..

ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి

ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి

షన్ను ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి పెద్దగా యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పాల్గొన్న దాఖలాలు లేవు. ఇప్పటికే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్లలో ఉన్నంత చురుకుదనం కూడా షన్నులో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ముందు ఇబ్బంది పడ్డారు. అయితే, ముక్కు సూటిగా ఉంటూ.. చెప్పాలనుకున్నది ముఖం మీదే చెప్పేసే తత్వంతో కొంతలో కొంత నెట్టుకుంటూ వచ్చాడు,

అభిజీత్‌ను ఫాలో

అభిజీత్‌ను ఫాలో

అయితే షన్ను తీరును చూస్తే.. గత సీజన్ టైటిల్ విన్నర్ అభిజీత్‌ను ఫాలో అవుతున్నాడని ఒక్కోసారి అనిపిస్తోంది. అప్పట్లో అభి కూడా ఎక్కువగా కష్టపడకుండా కూర్చుని కనిపించేవాడు. టాస్క్ లలో కూడా వెనకబడి ఉండే వాడు. ఇప్పుడు అతనిలానే ఉంటున్న షన్నుకి ఇంటి బయట వెలుపల అద్భుతమైన అభిమానులు ఉన్నారు.

 బిగ్ బాస్ తెలుగు 5లో

బిగ్ బాస్ తెలుగు 5లో

సాఫ్ట్‌వేర్ డెవలపర్‌, సూర్య లాంటి వెబ్ సిరీస్ లతో క్రేజ్ అందుకున్న షన్ను యూట్యూబ్ ప్రేక్షకులలో పాపులర్ అయ్యాడు. ఆ వెబ్ సిరీస్ లు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచి, అతను ఏం చేస్తున్నాడు? ఎలాంటి సిరీస్ తో వస్తున్నాడు అనే విషయాన్నీ గమనించేలా చేసింది, ఇది బిగ్ బాస్ నిర్వాహకులను బిగ్ బాస్ తెలుగు 5లో పోటీదారుగా తీసుకునేలా చేసింది.

టైటిల్ కైవసం

టైటిల్ కైవసం

ఇక మరో రెండు వారాల్లో రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగియనుంది. షణ్ముఖ్ బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ కైవసం చేసుకుంటాడని షణ్ముఖ్ అభిమానులు ఆశిస్తున్నారు. షణ్ముఖ్ నిజంగానే బిగ్ బాస్ తెలుగు 5 ట్రోఫీతో బయటకు వస్తే, బిగ్ బాస్ తెలుగు 5లో చరిత్ర సృష్టిస్తాడని చెప్పాలి. ఎలా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇది అసలు లెక్కక.

వాళ్ళ వయసు ఎంతంటే?

వాళ్ళ వయసు ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 5 లో అతి పిన్న వయస్కుడైన షణ్ముఖ్ విజేత అవుతాడని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే షన్ను రికార్డు సృష్టించవచ్చు. ఎలా అంటే గ్ బాస్ తెలుగు షోలో గెలుపొందిన మునుపటి ఎపిసోడ్‌లలో కౌశల్ మందా, 36 ఏళ్లు, రాహుల్ సిప్ల్‌గంజ్ 29 ఏళ్లు, అభిజీత్ 32 ఏళ్ల వయస్సులో ఉన్నారు.

Recommended Video

Pushpa Trailer Delay | Samantha As Yashodha || Filmibeat Telugu
రికార్డులు బద్దలే

రికార్డులు బద్దలే

ఈ క్రమంలో షణ్ముఖ్ ఈ సీజన్‌లో ట్రోఫీని గెలిస్తే, అతని 27 ఏళ్ల వయస్సులో, అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిగా రికార్డులకు ఎక్కుతాడు. ఇక చిన్న వయస్సులోనే షో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించడాన్ని షణ్ముఖ్ అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటారు. ఇక ఇప్పటికి అయితే ఈ లెక్కలు ఏవీ బయట వారికి తెలియదు. ఈ లెక్కలు గనుక వారికీ తెలిస్తే మరింత ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉంది మరి షణ్ముఖ్ జస్వంత్ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X