Bigg Boss: దీప్తి గురించి అబద్ధం చెప్పిన షణ్ముఖ్ మదర్.. అలా చేయొద్దంటూ సిరికి గట్టి వార్నింగ్
తెలుగు బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయం అయినప్పటికీ.. దీనికి ప్రేక్షకుల భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఈ కారణంగానే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ఇప్పుడు నాలుగో సీజన్ కూడా అంతే ఆదరణను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడీ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్లకు చెందిన కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్‌లో షణ్ముఖ్ మదర్ లోపలికి వచ్చారు. ఆమె కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

బీబీ ఎక్స్‌ప్రెస్ సందడి చేస్తోందిగా
బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకోవడంతో సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ వారానికి సంబంధించి ఇంటి సభ్యులకు 'బీబీ ఎక్స్‌ప్రెస్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాలి. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాలని ఆదేశించాడు.

షో చివర్లో సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు
బిగ్ బాస్ సీజన్ చివర్లో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను తీసుకొస్తూ ఉంటారు. గత సీజన్‌లో అద్దాల రూమ్‌లో మాత్రమే చూపించిన నిర్వహకులు.. ఈ సారి వాళ్లను మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి మరీ హౌస్ లోపలికి తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేశారు. ఇలా ఒక్కొక్కరుగా వాళ్లను తీసుకొస్తున్నారు. దీంతో బిగ్ బాస్ హౌస్ అంతా సందడి సందడిగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకూ వచ్చింది ఎవరంటే
బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో కాజల్ భర్త, కూతురు హౌస్‌లోకి ఎంట్రీతో ఈ ప్రాసెస్ మొదలైంది. ఇక, గురువారం ఎపిసోడ్‌లో మాత్రం శ్రీరామ చంద్ర సోదరి వచ్చారు. ఈమె ఎంతోసేపు కనిపించలేదు. కానీ, మానస్ తల్లి మాత్రం రచ్చ రచ్చ చేసేశారు. ఇల్లంతా తిరుగుతూ అందరిపై కామెంట్లు చేస్తూ నానా హడావిడి చేశారు. ఇక, సిరి హన్మంత్ తల్లి కూడా చాలాసేపు ఉన్నారు.

సన్నీ మదర్ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌తో
గురువారం ఎపిసోడ్‌లో వీజే సన్నీ తల్లి కూడా హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆమె వచ్చిన కొద్ది సేపటికే ఎపిసోడ్‌ను ముగించారు. దీంతో శుక్రవారం ఆమెను చూపించబోతున్నారు. నిన్న షో తర్వాత వచ్చిన ప్రోమోలో సన్నీ తల్లికి పుట్టినరోజు వేడుకలు చేసినట్లు చూపించారు. దీంతో సన్నీ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
యాంకర్ రవి కోసం వచ్చిన ఇద్దరు
బిగ్ బాస్ హౌస్‌లోకి టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన వారిలో యాంకర్ రవి ఒకడు. ఆరంభం నుంచీ చక్కగానే ఆడుతున్నా అతడిపై ఎందుకో విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీంతో చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి కోసం భార్య నిత్యా సక్సేనా, కూతురు వియా హౌస్‌లోకి వస్తున్నారు. కూతురితో అతడు ఆడుకున్న విధానం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
Recommended Video

షణ్ముఖ్ తల్లి షాకింగ్ కామెంట్స్‌తో
ఇక, షణ్ముఖ్ కోసం తల్లి ఎంట్రీ ఇచ్చారు. రావడమే ఆమెకు కెప్టెన్సీ బ్యాండ్‌ను తొడిగాడు. ఆ తర్వాత మోజ్ రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుకున్నారు. అప్పుడామె 'అందరితో కలిసి ఉండు.. ఒక్కరితో ఉండకు' అన్నారు. తర్వాత షన్నూ తన తల్లిని దీప్తి సునైనా గురించి అడగ్గా ఆమె అబద్ధం చెప్పారు. చివర్లో సిరి 'రాగానే గేమ్ గేమ్‌లా చూడండి.. ఎక్కువ ఎమోషనల్ కావొద్దు' అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











