Bigg Boss Telugu 5: తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైమ్ ఇలా.. షణ్ముఖ్ కూడా చరిత్రలో నిలుస్తూ?

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఐదో వారం కి చేరింది. ప్రతి సోమవారం నామినేషన్లు ఆసక్తికరంగా సాగుతాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ వారం కూడా ఆసక్తికరంగా సాగాయి. అయితే నిన్న జరిగిన నామినేషన్ లు మాత్రం బిగ్ బాస్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జరిగాయి అని చెప్పక తప్పదు. మొత్తం మీద నిన్న తొమ్మిది మంది హౌస్ సభ్యులు నామినేట్ కాగా అందులో షణ్ముఖ్ కి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు కావడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే

ఏకంగా 19 మంది

ఏకంగా 19 మంది

గతంలో లేని విధంగా ఈ సారి బిగ్ బాస్ 19 మందితో మొదలైన సంగతి తెలిసిందే. ఇక నాలుగు వారాల ఆట పూర్తి కావడంతో నలుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు కేవలం 15 మంది మాత్రమే మిగిలారు. ఇక సోమవారం నాటి నామినేషన్స్ ప్రక్రియ వాడీవేడిగా సాగింది. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనే విషయానికి వస్తే ముందు నామినేషన్ ప్రక్రియ ప్రక్రియ ఒరకరం హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తూ.. నామినేట్‌ చేయాలనుకుంటున్న ఇద్దరి ఇంటిసభ్యుల పేర్లు, అందుకు తగిన కారణాలు చెప్పమని బిగ్‌బాస్‌ అడిగడంతో ఎవరికి వారు ఓపెన్ అయిపోయారు. ముందుగా జెస్సీ రవిని, లోబోని నామినేట్ చేస్తూ దానికి తగిన కారణాలు చెప్పాడు. ఇక సన్నీ-షణ్ముఖ్ ని, ప్రియాని నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పాడు. విశ్వ జెస్సీని, షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పాడు.

ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారు అంటే

ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారు అంటే


ఇక కాజల్-రవి, సన్నీని నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పింది. లోబో-మానస్, షణ్ముఖ్ లను నామినేట్ నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పాడు. ప్రియాంక-హమీదను, లోబోని నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పింది. సిరి- రవిని, హమీద నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పింది.
రవి-జెస్సీని, షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పాడు.

వాళ్లతో అలా

వాళ్లతో అలా

యానీ మాస్టర్ రవి, విశ్వలను నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పింది. హమీద-ప్రియాని, షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పింది. శ్వేతా-కాజల్, మానస్ ని నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పింది. ప్రియా- షణ్ముఖ్ ని, సన్నీను నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పింది. మానస్-జెస్సీ, షణ్ముఖ్ లను నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పాడు. శ్రీరామచంద్ర- జెస్సీ, షణ్ముఖ్ నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పాడు.

ఆట చూపిస్తా

ఆట చూపిస్తా


అయితే అందరికీ రెండు మూడు ఓట్లతో నామినేట్ కాగా.. షణ్ముఖ్‌కి ఏకంగా 8 ఓట్లు వచ్చాయి. సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ ఈ ఎనిమిది మంది షణ్ముఖ్‌ని నామినేట్ చేయడంతో రికార్డులకు ఎక్కినట్టు అయింది. ఇక మరోపక్క బిగ్ బాస్ హిస్టరీలో ఒకే వారంలో 9 మంది నామినేట్ కావడం కావడంతో పాటు.. ఒక కంటెస్టెంట్‌ని ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ చేయడం ఇదే తొలిసారని అంటున్నారు. షణ్ముఖ్‌ని ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ చేయడంతో షాక్ కూడా అయ్యాడు. మొదట తనని ఎవరూ నామినేట్ చేయడం లేదని కన్ఫెషన్ రూంలో చెప్పిన షణ్ముఖ్ బయటకు వచ్చిన తర్వాత ఈ లెక్కలు అన్నీ బయట పడడంతో ఇక మీద నా ఆట చూపిస్తానని పేర్కొన్నాడు.

Recommended Video

Sudigali Sudheer,Getup Srinu Hilarious Fun At Most Eligible Bachelor Wrop Up Party | Oneindia Telugu
శ్రీ రామ్ మీద దాడి

శ్రీ రామ్ మీద దాడి

ఇక షణ్ముఖ్ ఆ తరువాత కెప్టెన్ శ్రీరామ్‌తో జెస్సీ విషయంలో గొడపడుతూ కనిపించాడు. పనులు చేయకపోతే ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోండి అని జెస్సీతో శ్రీరామ్ అనడంతో ఆ మాటతో జెస్సీతో పాటు షణ్ముఖ్, సిరిలు చెలరేగిపోయారు. విషయం పూర్తిగా తెలియకుండా మధ్యలో దూరిన షన్నూ ఏమాత్రం లాజిక్ లేకుండా అడ్డంగా వాదిస్తూ.. నా రూల్ బుక్ ప్రకారం ఫ్రెండ్ కోసం గొడవ పడాలంటే విషయం తెలియాల్సిన అవసరం లేదంటూ గొడవకు దిగాడు. అసలు నువ్వు ఎవరివి.. ఫుడ్ లేదని చెప్పడానికి? ఇది బిగ్ బాస్ హౌస్‌ అంటూ సిరి కూడా శ్రీ రామ్ మీద రెచ్చిపోయింది.,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X