Big boss 5: వాళ్లిద్దరూ వెళ్లిపోతే బిగ్ బాస్ షోకు మళ్ళీ అవమానమే.. ఆ విమర్శలను ఎదుర్కోవాల్సిందే?

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో తెలుగులో సక్సెస్ అవుతుంది అని మొదట్లో ఎవరూ ఊహించలేదు. ఈ కాంట్రవర్సీ షోను ప్రేక్షకులముందుకు ఎలా తీసుకువెళ్లాలి అని మొదట నిర్వాహకులు చాలానే ఆలోచించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అయితే ఇప్పటి వరకు హోస్ట్ విషయంలో పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ ప్రతి సారి కూడా బిగ్ బాస్ విన్నర్స్ విషయంలో అనేక రకాల విమర్శలు మాత్రం వెలువడుతున్నాయి.

బిగ్ బాస్ ఒక విషయంలో అన్యాయం చేస్తోంది అని కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఈసారి బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం బిగ్ బాస్ విన్నర్ విషయంలో మళ్లీ మోసం జరిగే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఏమీ చేయలేని పరిస్థితి..

ఏమీ చేయలేని పరిస్థితి..

బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా బలంగా పోరాడుతూ వచ్చారు. అయితే ఎవరు ఎంత పోరాడినా కూడా చివరికి ఆటలో నిలదొక్కుకున్న వారే విజేత గా నిలుస్తూ ఉంటారు. కానీ కొందరు లో ప్రొఫైల్ స్టార్స్ మాత్రం అదృష్టవశాత్తు తో టాప్ ఫైవ్ లో కూడా వస్తూ ఉంటారు. అలాంటి వారి విషయంలో బిగ్ బాస్ కూడా కొన్నిసార్లు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే బేదాలు చూపిస్తున్నారు అనే విమర్శలు కూడా ఎదురవుతాయి కాబట్టే కొన్నిసార్లు రేటింగ్స్ ను కూడా పక్కన పెట్టే కంటెస్టెంట్స్ కొనసాగించాల్సి వస్తుంటుంది.

ప్రియాంక గెలిచి ఉంటే..

ప్రియాంక గెలిచి ఉంటే..

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ప్రస్తుతం కేవలం ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇక వీరిద్దరిలో ఎవరు టాప్ లోకి వెళ్తారు అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ సారి అయినా ఒక అమ్మాయి తప్పకుండా బిగ్ బాస్ టైటిల్ అందుకోవాలి అని చాలామంది కోరుతున్నారు. ట్రాన్స్ జెండర్ ప్రియాంక గెలుచుకుంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఒక రికార్డు నెలకొల్పేది అని కూడా అనుకున్నారు. కానీ ప్రియాంక అనుకున్నంత స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది.

ఈ వారం వెళ్లిపోయే కంటెస్టెంట్?

ఈ వారం వెళ్లిపోయే కంటెస్టెంట్?

ఇక ప్రస్తుతం సిరి కాజల్ మాత్రమే పోటాపోటీగా బిగ్ బాస్ టైటిల్ కోసం పోరాడుతున్నారు. కానీ ఇద్దరిలో ఈ వారం ఒకరు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఎవరిపై ఎక్కువగా ఫోకస్ ఉన్న ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్జే కాజల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా అనేక రకాల స్టోరీలు వైరల్ అవుతున్నాయి.

ఆ విషయంలో తేడా వస్తే..

ఆ విషయంలో తేడా వస్తే..

ఇక ప్రస్తుతం చాలా బలంగా పోరాడుతున్న సీరీ ఎంత వరకు నిలదొక్కుకుంటుంది అనేది కూడా ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఆమె షన్ను అభిమానుల మద్దతు కూడా బాగానే గెలుచుకుంటుంది కానీ ఆ అభిమానుల మద్దతు కంటే కూడా ఆమెపై నెగిటివ్ ఆడియన్స్ ఎక్కువ అవుతున్నారు అనే చెప్పాలి. ఓట్ల విషయంలో తేడా వస్తే అందరి కంటే ముందు సిరి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

గెలిచే అవకాశం లేదా?

గెలిచే అవకాశం లేదా?

ఇక బిగ్ బాస్ హౌస్ సీజన్ ఫైవ్ లో ఈసారి కూడా ఒక అబ్బాయి గెలిచే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తుంది. అయితే గతంలోనే నాలుగు సీజన్లకు అబ్బాయిలు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలవడంతో చాలా విమర్శలు వచ్చాయి. ఫైనల్ టాప్ వరకు కూడా అమ్మాయిలు వస్తున్నప్పటికీ బిగ్ బాస్ టైటిల్ వారికి కావాలనే ఇవ్వడం లేదు అని విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు కాజల్ సిరి ఇద్దరూ పోటీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం లేదని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ నిర్వాహకులు ఈ వాతావరణంలో ఎలా నిలదొక్కుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X